KTR : రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు.....బలోపేతంపై విస్తృత చర్చ

KTR : రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు.....బలోపేతంపై విస్తృత చర్చ

KTR : తెలంగాణaలో రెండో హరిత విప్లవం కొనసాగుతోందని మంత్రి కేటిఆర్ ఉద్ఘటించారు. రాష్ట్రంలో భవిష్యత్ అవవసరాలను దృష్టిలో పెట్టుకుని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు, సెజ్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా ఇందుకు సంబంధించి మంత్రి కేటిఆర్ ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం జరిగింది.

  • Share this:
రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ది చెందుతున్న నేపథ్యంలోనే అందుకు అనుగుణంగా పరిశ్రమలు తీసుకువచ్చేందుకు మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారు. ఇందులో బాగంగానే రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు సంబంధించి పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కాగా ఈ సమావేశంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ తోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పాల్గోన్నారు.

ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ...ప్రభుత్వం చేపట్టిన సాగునీటీ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలోని వెనకబడిన మహబుబ్‌నగర్ లాంటీ జిల్లాలు కళకళలాడుతున్నాయని అన్నారు. దీంతో వ్యవసాయ రంగం పుంజుకుంటుందని చెప్పారు. ఇది రెండవ హరిత విప్లవానికి నాంది అని వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులకు అనుగుణంగానే అందుకు కావాల్సిన మార్కెటింగ్ సౌకర్యాలను కల్పించాలని, ఇందుకు గాను ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవరం ఉందని ఆయన అన్నారు. ఇందుకు అనుగుణంగానే రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను కూడా ఏర్పాటు చేయడం వల్ల రైతుల పంటలకు డిమాండ్ పెరుగుతుందని అప్పుడే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు.

కాగా రాష్ట్రంలో స్థాపించాలనుకున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు సుమారు 225 ఎకరాలకు తక్కువ కాకుండా ఒక్కో జోన్‌ను ఏర్పాటు చేసేందు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇక వాటిలో రోడ్లు ,మంచినీరు వంటీ మౌలిక వసతులు కల్పించేందుకు చిత్తశుద్దితో పనిచేయాలని ఆయన అధికారులకు సూచించారు.
Published by:yveerash yveerash
First published: