హుజూరాబాద్ ఎన్నికల ప్రక్రియలో కీలక పరిణామం చోటు చేసుకోబుతుందా.. దేశంలో కాస్లీ ఎన్నికలుగా మారుమ్రోగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో వేల రూపాయలను ఓటర్లకు పంచుతున్నారనే ప్రచారం విపరీతంగా కొనసాగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అటు బీజేపీతో పాటు టీఆర్ఎస్ పార్టీలు ఓటర్లు డబ్బులు పంచుతున్నట్టుగా వీడియోలు చక్కర్లు కొట్టాయి. ఇది నిజమే అన్నట్టుగా నియోజకవర్గ ప్రజలు తమకు డబ్బులు ఇవ్వలేదంటూ బహిరంగగానే రోడ్డు పైకి వచ్చి ఆందోళణ చేపట్టిన పరిస్థితి కనిపించింది. ఏకంగా ఓటర్లు ప్రజా ప్రతినిధుల ఇళ్ల ముందు గుమిగూడి ధర్నా చేపట్టారు. దీంతో పోలీసులు సైతం ఎంటర్ అయినా ఎలాంటీ చర్యలు తీసుకోలేదు. మరోవైపు ఆ సంఘటనలను మీడియా మొత్తం చూపించింది. అయినా ఎవరిపై చర్యలు తీసుకోని పరిస్థితి. ఎంత సేపు ఆయా పార్టీలు పంచుతున్న డబ్బులు పై మీడియాతోపాటు ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. అంతే తప్ప ఓటర్లు డబ్బులు అడగడంపై ఎవ్వరి దృష్టి పడలేదు..
వాస్తవానికి ఎన్నికల్లో డబ్బులు ఇవ్వాలని చూసిన పార్టీలతో పాటు తీసుకునేందుకు ప్రయత్నించిన ఓటర్లు కూడా చట్టప్రకారం నేరస్థులే..అయితే ఇప్పుడు ఇదే నిబంధనను ఎన్నికల కమీషన్ ముందుకు తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే హుజూరాబాద్‌లో డబ్బులు అడిగిన ఓటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్ఈసీ శశాంక్ గోయల్ తెలిపారు. తమకు డబ్బులు రాలేదని నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఆందోళన చేయడం ఈసి దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. దీంతో డబ్బుల కోసం ఆందోళణ చేసిన వారిపై చర్యలు చేపడుతున్నట్టు , వారిని పలు మార్గాల ద్వారా గుర్తిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ సంఘటన పై విచారణ జరుపుతున్నామని డబ్బులు అడిగినట్టు తేలితే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇది చదవండి : పందెం కోళ్ల అరెస్ట్.. నాలుగు రోజులుగా పోలీసుల పహారా..
మొత్తం మీద హుజూరాబాద్ ఉప ఎన్నికలపై ఎన్నికల కమిషన్ తీవ్రమైన చర్యలు తీసుకుబోతున్నట్టు అర్థమవుతోంది. ఎన్నికల్లో విచ్చలవిడి డబ్బు పంపకాలు జరుగుతుందని బహిరంగ రహస్యమే అయినా.. ఇందుకు సంబంధించి కాంగ్రేస్ పార్టీ నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో నేరుగా కేంద్ర అధికారులు రంగంలోకి దిగారు. రాష్ట్ర అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం .. వస్తున్న ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో ఎన్నికల సంఘం ఆ దిశగా చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.