గాలి నుంచి నీరు... లీటర్ రూ.5... ఎక్కడో తెలుసా?

Indian Railways : గాలి నుంచి నీటిని తయారుచేసే విధానం ఇప్పుడు విదేశాల్లో బాగా అమలవుతోంది. దాన్ని ఇండియాలో... తెలంగాణలో తొలిసారిగా అమలుచేస్తున్నారు.

news18-telugu
Updated: December 13, 2019, 5:28 AM IST
గాలి నుంచి నీరు... లీటర్ రూ.5... ఎక్కడో తెలుసా?
గాలి నుంచి నీరు (credit - twitter - SouthCentralRailway)
  • Share this:
Indian Railways : దేశంలోనే తొలిసారిగా... గాలి నుంచి నీటిని ఉత్పత్తిచేసే విధానాన్ని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయోగాత్మకంగా అమల్లోకి తెచ్చారు. స్వచ్ఛమైన మంచి నీటిని ప్రయాణికులకు ఇస్తున్నారు. ఇదెలా సాధ్యం అన్న డౌట్ రావడం సహజం. గాలిలో నీటి అణువులు ఉంటాయి కదా. వాటిని ఒడిసిపట్టి చేస్తున్నదే ఈ ప్రక్రియ. ఇందుకోసం గాలి నుంచి నీటిని ఉత్పత్తి చేసే పరికరం ‘ఆట్మోస్పియరిక్ వాటర్ జనరేటర్’‌ని కియోస్క్ సంస్థ ఏర్పాటు చేసింది. ఈ యంత్రానికి ‘మేఘ్‌దూత్’ అని పేరుపెట్టారు. ఇది గాలి నుంచి అంచెలంచెలుగా నీటిని డైరెక్టుగా సేకరిస్తుంది. గాలి యంత్రంలోకి పంపిస్తారు. అక్కడ వడబోత ఉంటుంది. గాలిలోని తేమలో ఉండే కాలుష్యాల్ని తొలగిస్తారు. వడబోసిన గాలి ఓ చల్లని గదిలోకి వెళ్ళి గట్టిపడుతుంది. ఈ గట్టిపడిన గాలి నీటి బిందువులుగా మారి అక్కడ ఏర్పాటు చేసిన పాత్రలో పడుతుంది. అలా వచ్చిన నీటిని రకరకాలుగా వడబోస్తారు. తద్వారా చెడు వాసన, కాలుష్యాలు పోతాయి. ఈ నీరు ఆల్ట్రా వయొలెట్ (యువీ) సిస్టం ద్వారా ప్రవహిస్తుంది. ఈ విధంగా వచ్చిన నీటిలో అవసరమైన ఖనిజ లవణాలను కలుపుతారు. దీంతో అది తాగడానికి మంచినీరుగా మారుతుంది.


మంచి నీటిని అందించే ఈ పద్ధతిని కేంద్రం ఆమోదించింది. నీటి యంత్రం రోజూ 1000 లీటర్ల నీటిని గాలి నుంచి తయారుచేస్తుంది. లీటర్ బాటిల్ నీటిని రూ.8కి అమ్ముతున్నారు. బాటిల్ లేకుండా రూ.5కి ఇస్తున్నారు. దేశంలో దశల వారీగా కియోస్క్ యంత్రాన్ని అమల్లోకి తేవబోతోంది దక్షిణ మధ్య రైల్వే. 

Pics : క్రియేటివిటీని చాటుకుంటున్న మధులికా జోషీఇవి కూడా చదవండి :

Health Tips : గుండె ఫిట్‌గా ఉండాలా... ఈ 5 చిట్కాలు పాటించండి

Health Tips : కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్... ఇంటి దగ్గరే తయారుచేసుకోండి

Health Tips : డయాబెటిస్ ఉంటే ఖర్జూరాలు తినవచ్చా?

పాము కాటేసినప్పుడు టీ తాగితే ఏమవుతుంది?
First published: December 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు