Home /News /telangana /

SCHOOLS WILL REOPEN IN TELANGANA FROM FEBRUARY FIRST HERE IS FULL DETAILS MS

తెలంగాణలో బడి గంట మోగేది ఆ రోజు నుంచే.. కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..

కలెక్టర్లతో సమావేశంలో సీఎం కేసీఆర్

కలెక్టర్లతో సమావేశంలో సీఎం కేసీఆర్

Schools Reopen In Telangana: కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకుని విద్యాసంస్థలను తెరవడం సాధ్యమేనని అధికారులు వెల్లడించడంతో బడులు తెరవడానికి సీఎం పచ్చజెండా ఊపినట్టు తెలుస్తున్నది.

  • News18
  • Last Updated :
    కోవిడ్ కారణంగా మూత పడ్డ బడులు మళ్లీ తెరుచుకునేందుకు సిద్దమవుతున్నాయి. తెలంగాణలో పాఠశాలలను పున: ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వచ్చేనెల 1 వ తేదీ నుంచి బడులను తెరిచే విషయంపై అధికారులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. మంత్రులు, కలెక్టర్లతో కలిసి సోమవారం ప్రగతిభవన్ లో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలకాంశాలపై సమావేశంలో చర్చించినట్టు తెలుస్తున్నది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకుని విద్యాసంస్థలను తెరవడం సాధ్యమేనని అధికారులు వెల్లడించడంతో బడులు తెరవడానికి సీఎం పచ్చజెండా ఊపినట్టు తెలుస్తున్నది. వచ్చే నెల (ఫిబ్రవరి) 1వ తేదీ నుంచి.. 9వ తరగతి నుండి ఆపై తరగతులను నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

    బడులతో పాటు అత్యంత కీలకమైన రెవెన్యూశాఖకు సంబంధించిన అన్నిరకాల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ లో అవసరమైన అన్నిరకాల మార్పులు, చేర్పులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా పాఠశాలల పునరుద్దరణ, రెవెన్యూ శాఖ లోని సమస్యలు, ధరణి పోర్టల్ కు సంబంధించిన సమస్యలపై సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా.. ధరణి పోర్టల్ లో తలెత్తుతున్న సమస్యలపై కూడా సత్వర పరిష్కారం కనుగొనాలని ఆదేశించారు.

    అంతేగాక కరోనా వ్యాక్సినేషన్ డ్రై రన్ పూర్తైన నేపథ్యంలో అవసరార్ధులకు వ్యాక్సిన్ ఇచ్చే దాని కోసం ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని సీఎం చెప్పారు. అడవుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. అన్నిశాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, ఖాళీలన్నీ ఒకేసారి వెంటనే భర్తీ చేయాలని అధికారులకు సూచించారు. అన్ని పట్టణాల్లో జనాభాకు అనుగుణంగా సమీకృత మార్కెట్లు, వైకుంఠ ధామాలు నిర్మించాలని సీఎం ఆదేశించారు. మంత్రులు, కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో నిర్వహించిన ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారులు, ఆయాశాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు పాల్గొన్నారు.
    Published by:Srinivas Munigala
    First published:

    Tags: CM KCR, Kcr, Schools reopening, Telangana, Telangana News, Telangana schools

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు