హోమ్ /వార్తలు /తెలంగాణ /

Schools reopen : ఫిబ్రవరి 1 నుండి స్కూళ్లు రీ ఓపెన్... ప్రకటించిన అధికారులు.

Schools reopen : ఫిబ్రవరి 1 నుండి స్కూళ్లు రీ ఓపెన్... ప్రకటించిన అధికారులు.

Schools reopen : ఓ వైపు కోవిడ్ ఉదృతి తగ్గడంతో పాటు విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావడం పడుతుండడం, మరోవైపు హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్ల రీ ఓపెనింగ్‌పై కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.

    ఫిబ్రవరి ఒకటి నుండి విద్యా వ్యవస్థలను రీ ఓపెన్ చేయనున్నట్టు తెలంగాణ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ప్రకటించిన సెలవులు ఈ నెల 31 వరకు కొనసాగనున్నాయి.. కాగా ఒమిక్రాన్​ వ్యాప్తితో రాష్ట్రంలో కేసులు పెరగడం వల్ల ఈ నెల 8 నుంచి విద్యాసంస్థలను మూసివేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి జనవరి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. ఆ తర్వాత కేసుల పెరుగుదల ఆగకపోవడం వల్ల ఆ సెలవులను 30 వరకు పొడిగించారు. 15 ఏళ్లు దాటిన వారికి టీకా పంపిణీ, విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి టీకా ఇవ్వడం.. మరోవైపు జ్వర సర్వే పూర్తవ్వడం వల్ల కరోనా వ్యాప్తి తీరును అంచనా వేసిన సర్కార్.. విద్యాసంస్థలు తెరిచేందుకు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.

    ప్రస్తుతం 8, 9, 10వ తరగతుల విద్యార్థులతో పాటు, ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇవి ప్రత్యక్ష బోధనకు ప్రత్యామ్నాయం కాదనే వాదనలు వినిపిస్తుండటం.. తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి వస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో.. త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపాయి. కాగా స్కూళ్లు తెరవడంతోపాటు ఇప్పటికే ఇంటర్‌, పదో తరగతి పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వం పొడిగించింది. వార్షిక పరీక్షల నిర్వహణపై కూడా షెడ్యూల్‌ ప్రకటించాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సెలవులు కొనసాగుతుండటం వల్ల పరీక్షలపై ఇంకా తుది నిర్ణయాన్ని వెల్లడించలేదు. విద్యా సంస్థలను తెరిచిన వెంటనే వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం.

    First published:

    Tags: Schools reopening, Telangana

    ఉత్తమ కథలు