Schools open: ఈ కరోనా కాలంలో స్కూళ్లు తెరవాలా వద్దా అనే అంశంపై తెరవాలి అని కొందరు, అప్పుడే వద్దు అని మరికొందరు... అంచెలవారీగా తెరవండి అని ఇంకొందరు.. ఇలా పేరెంట్సే కాదు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాల నుంచి రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. ఏమైతే అదే అవుతుంది అనుకుంటూ తెలంగాణ (Telangana) ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు, కాలేజీలను తెరుస్తోంది. సరే కాలేజీల్లో విద్యార్థులకు కరోనాతో ఎలా పోరాడాలో చెప్పాల్సిన పనిలేదు. సమస్యల్లా పిల్లలతోనే. ఆ పసి హృదయాలకు ఈ కరోనా, వేరియంట్ల సంగతి తెలియదు. కాబట్టి వారి రక్షణ టీచర్లు, ప్రభుత్వం, పేరెంట్స్ చేతిలోనే ఉంది.
సోషల్ డిస్టాన్స్ పాటించేలా మీ పిల్లలకు మీరు బాగా ట్రైనింగ్ ఇవ్వండి. ఈ విషయం మళ్లీ మళ్లీ చెప్పండి. అలాగే మాస్క్ వాడటం, శానిటైజర్ వాడటంపై పదే పదే చెబితేనే పిల్లల మైండ్‌లోకి వెళ్తుంది.
ప్రభుత్వ రూల్స్ ప్రకారం పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వెళ్లగానే వాళ్లకు స్నానం చేయించి, యూనిఫామ్‌ను ఉతికేయాలి. ఇలా ప్రతి రోజూ పేరెంట్స్ చెయ్యాలి. ఎందుకంటే పిల్లల నుంచి ఇంట్లోని పెద్దలకు, ముసలివారికి కరోనా సోకకుండా పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
పిల్లల ఉష్ణోగ్రతను తరచూ చెక్ చేస్తూ ఉండాలి. జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయేమో గమనించాలి. వేడి చేసే ఆహారాలు వాళ్లకు వీలైనంత తక్కువగా పెడుతూ ఉండాలి. పండ్ల రసాలు ఎక్కువగా ఇవ్వాలి.
స్కూల్ బ్యాగులో ఓ అదనపు మాస్కు ఉండాలి. తద్వారా ఆల్రెడీ తొడుక్కున్న మాస్క్ దెబ్బతింటే... అదనపు మాస్క్ వాడుతారు. మాస్కుతోపాటూ హ్యాండ్ కర్చీఫ్ కూడా ఉండాలి. అలాగే హ్యాండ్ శానిటైజర్ ఉండాలి. వాటర్ బాటిల్, స్నాక్స్ కూడా ఉండేలా చెయ్యండి.
జుట్టు ఎక్కువగా ఉండే పిల్లలకు ఆ జుట్టును అలాగే వదిలేయవద్దు. టైట్‌గా అల్లేయాలి. ఆ జుట్టు వారి ముఖాన్ని టచ్ చెయ్యకుండా జాగ్రత్త పడాలి. లేదంటే జుట్టుపై ఉండే కరోనా ముక్కులోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది.
కనీసం 2 గంటలకు ఓసారి చెయ్యి కడుక్కొని 4 చుక్కల శానిటైజర్ రాసుకోమని పిల్లలకు సూచించండి. ఎవరితోనూ ఆటలాడవద్దని చెప్పండి. దూరం దూరంగా ఉండాలని చెప్పండి. ఎవరికీ ఏ వస్తువులూ ఇవ్వొద్దనీ, ఎవరి నుంచి ఏవీ తీసుకోవద్దని మరీ మరీ చెప్పండి.
క్లాసులో వెలుతురు వచ్చే చోట మాత్రమే పిల్లలు కూర్చోవాలి. చీకటి ఉన్న చోట కరోనా ఎక్కువగా ఉంటుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్త ప్రకారం... పిల్లల మధ్య 1 మీటర్ గ్యాప్ ఉండాలి. స్కూలు లోపల, బయట కూడా అది మెయింటేన్ చెయ్యాలి. టీచర్లు, స్కూల్ సిబ్బంది కూడా 1 మీటర్ డిస్టాన్స్ మెయింటేన్ చెయ్యాలి.
ఇది కూడా చదవండి: Horoscope 31-8-2021: రాశి ఫలాలు.. ఉద్యోగాలు ప్రశాంతం.. ఆర్థికం అప్రమత్తం
ఇవన్నీ చదివాక... ఓర్నాయనో ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలా... ఇవన్నీ ఎక్కడ కుదురుతాయి... జరిగే పనేనా అని అనిపించడం సహజం. నిజమే మరి మనది సంపన్న దేశం కాదు. కాబట్టి మన దేశంలో అన్నీ అరకొరగానే ఉంటాయి. అయినప్పటికీ కరోనాకి ఛాన్స్ ఇవ్వకూడదు కాబట్టి... మన ప్రయత్నం మనం చేయడం మంచిదే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covid-19, Online Education, Schools reopening, Telangana News