SCHOOLS MAY RE OPEN ON FEB 5TH MEDICAL AND HEALTH DEPARTMENT CLEARANCE VRY
Schools Reopen : ఫిబ్రవరి 5 నుండి విద్యావ్యవస్థలు రీ ఓపెన్.. వైద్యశాఖ నివేదిక.. రేపు మంత్రి సమీక్ష
ప్రతీకాత్మక చిత్రం
Schools Reopen : తెలంగాణలో రానున్న ఫిబ్రవరి 5 నుండి ఆఫ్‌లైన్ తరగతులు నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి సూచనలు చేసినట్టు తెలుస్తోంది.
కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులను పెంచడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్న విషయం తెలిసిందే.. ఇతర ప్రైవేటు సంస్థలు తెరిచేందుకు అవకాశమిస్తున్న ప్రభుత్వం, విద్యా వ్యవస్థలపై మాత్రం నిబంధనలను తీవ్రతరం చేస్తోంది. ఈ క్రమంలోనే విద్యార్థులు నష్టపోతున్నట్టు పలు విద్యాసంస్థల యాజమాన్యాలతో పాటు పలు ప్రజా సంఘాలు సైతం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో రానున్న ఫిబ్రవరి 5 నుండి స్కూళ్లకు, కాలేజీలకు అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నట్టు సమాచారం. అయితే ఒకేవేళ విద్యా సంస్థలు ప్రారంభమైన తర్వాత కూడా తల్లిదండ్రుల ఇష్టం మేరకు ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్లైన్ పాఠాలకు కూడా అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇక ఆఫ్‌లైన్ ప్రారంభంపై కూడా ఆయా జిల్లాల్లో ఉన్న పరిస్థితులను బట్టి అనుమతి ఇవ్వనున్నట్టు సమాచారం.
మరోవైపు థర్డ్ వేవ్ మరో పదిహేను రోజుల్లో ముగిసే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు ఇస్తున్న వైద్య ఆరోగ్య శాఖ రానున్న విద్యా సంవత్సరంలో షెడ్యుల్ ప్రకారమే ప్రవేశ పరీక్షలు నిర్వహించుకోవచ్చనే సంకేతాలను కూడా ఇస్తుంది. ఇందుకు సంబంధించి సీఎం కేసీఆర్‌కు ఓ నివేదిక కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా వైద్యాశాఖ ఇచ్చిన నివేదికపై మంగళవారం మంత్రి హరీష్ రావు సమీక్ష జరపనున్నారు.
కాగా సంక్రాంతి ముందు నుండే విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. జనవరి 8 నుండి 16వరకు సెలవులు ప్రకటించింది. కాని కరోనా తీవ్రత దృష్ట్యా ఆ తర్వాత జనవరి 30 వరకు పొడగించారు. దీంతో విద్యా సంస్థల క్లోజ్ పై పలు ఆరోపణలు ఎదుర్కొంటుంది. దీంతో విద్యా సంస్థలు ఓపెన్ చేసి గతంలోనే ఆఫ్‌లైన్, ఆన్లైన్ క్లాస్‌లకు అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.