Home /News /telangana /

SCHOOL TIMINGS CHANGED BY WEATHER CONDITIONS VRY

Telangana : రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతల ఎఫెక్ట్... School వేళల్లో మార్పులు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana : గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఉష్ణోగ్రత తీవ్రతలు ఎక్కువవుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం స్కూలు సమయాలను తగ్గించింది. ఇప్పటికే ఒంటిపూట బడులు కొనసాగుతుండగా మరొ గంట సమయాన్ని తగ్గించింది.

    రెండు, మూడు రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 44 డిగ్రీలకు ఎండలు చేరుకున్నాయి.దీంతో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. స్కూలు సమయాలను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గత వారం రోజుల నుండి ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12.30 వరకు స్కూళ్లు కొనసాగుతున్నాయి. అయితే రెండు రోజులుగా ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలోనే నేటి నుండి స్కూలు సమయాలను తగ్గించారు.నేటి నుండి ఉదయం 8 నుండి 11.30 గంటల వరకే పని చేయనున్నాయి. నేటి నుండి ఏప్రిల్ 6 వరకు ఉదయం 11.30 వరకే కొనసాగనున్నాయి.

    మరోవైపు ఎండలు తీవ్రం అయిన నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే రానున్న రెండు రోజుల్లో పలు జిల్లాల్లో రెండు నుండి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను సిద్దం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ సూచించారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: School, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు