టీచర్ కళ్లలో కారం కొట్టిన తోటి ఉపాధ్యాయుడు.. మెదక్ స్కూల్లో రచ్చ

దేవరుషిపై పగపెంచుకున్న శ్రీనివాస్ మూర్తి.. తన వెంట తెచ్చుకున్న కారం పొడి ప్యాకెట్లను బయటకు తీసి కళ్లల్లో చల్లాడు. మిగతా టీచర్లు అప్రమత్తమై దేవరుషిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

news18-telugu
Updated: November 18, 2019, 10:04 PM IST
టీచర్ కళ్లలో కారం కొట్టిన తోటి ఉపాధ్యాయుడు.. మెదక్ స్కూల్లో రచ్చ
బాధిత టీచర్ దేవరుషి
  • Share this:
విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పి.. వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాల్సిన టీచర్లే దారి తప్పుతున్నారు. విద్యార్థినులను లైంగికంగా వేధిస్తూ కొందరు.. రౌడీల్లా ప్రవర్తిస్తూ మరికొందరు.. ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెస్తున్నారు. తాజాగా మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి జెడ్పీ హైస్కూల్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ టీచర్‌పై తోటి ఉపాధ్యాయుడు దాడికి పాల్పడ్డాడు. కళ్లలో కారంకొట్టి స్కూల్‌లో నానా రచ్చ చేశాడు. దాంతో మిగతా ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల్లో భయాందోళన నెలకొంది.

స్కూళ్లో శ్రీనివాస మూర్తి ఫిజిక్స్ టీచర్‌గా, దేవరుషి మ్యాథ్స్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఇక దేవయ్య హెడ్మాస్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల దేవయ్య లీవ్‌లో ఉండడంతో దేవరుషి తాత్కాలికంగా ఇంచార్జి హెడ్మాస్టర్‌గా పనిచేశారు. డీఈవో ఆదేశాల మేరకు ఫిజిక్స్ మార్కులను ఆన్‌లైన్ చేయాలని మూర్తికి సూచించారు దేవరుషి. ఆ విషయంలో ఇరువరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన శ్రీనివాసమూర్తి.. దేవరుషిపై దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం హెడ్మాస్టర్‌కు తెలియడంతో తిరిగి ఆయన సోమవారం స్కూల్‌కు వెళ్లారు.

ఆ క్రమంలో సోమవారం స్కూల్ ప్రారంభమయ్యాక రిజిస్టర్‌ల కోసం ఉపాధ్యాయులంతా ఆఫీస్ రూమ్‌కి వెళ్లారు. ఐతే దేవరుషిపై పగపెంచుకున్న శ్రీనివాస్ మూర్తి.. తన వెంట తెచ్చుకున్న కారం పొడి ప్యాకెట్లను బయటకు తీసి కళ్లల్లో చల్లాడు. మిగతా టీచర్లు అప్రమత్తమై దేవరుషిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్లి చికిత్స అందించారు. బాధిత టీచర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఫిజిక్స్ టీచర్ శ్రీనివాస మూర్తిపై తోటి ఉపాధ్యాయులతో పాటు టీచర్లు విమర్శలు గుప్పించారు. ఆయన స్కూల్‌కి ఇష్టానుసారం వస్తాడని.. క్లాస్‌లు కూడా సరిగా చెప్పడని ఆరోపిస్తున్నారు. ఆయనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Published by: Shiva Kumar Addula
First published: November 18, 2019, 8:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading