మాములుగా స్కూల్ పిల్లలు తమ బర్త్‌డే వచ్చిదంటే కేక్ కట్ చేయడం, స్నేహితులతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తారు. కానీ అయితే పెబుల్ క్రీక్ లైఫ్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల చిన్మయి సిద్ధార్థ్ షా మాత్రం.. తన బర్త్‌డేకు ఖర్చయ్యే మొత్తాన్ని ఓ మంచి పని కోసం కేటాయించాడు. హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్‌లోని సంకల్ప్ పేరుతో ఉన్న రాయల్ బెంగాల్ టైగర్‌ను దత్తత తీసుకున్నాడు. ఈ మేరకు శనివారం రూ. 25 వేల చెక్‌ను తన తండ్రి సిద్దార్థ్ కాంతిలాల్ షాతో కలిసి నెహ్రూ జూపార్క్ డిప్యూటీ క్యూరేటర్ నాగమణికి అందజేశారు. మూడు నెలల పాటు టైగర్‌ను దత్తత తీసుకునేందుకు ఈ మొత్తాన్ని చెల్లించారు.
అదే రోజు హవీష్ జైన్, విహాన్ అతుల్ షా, ప్రీక్షా, ప్రియల్, ధ్వాని అనే ఐదుగురు విధ్యార్థులు కూడా కొన్ని పక్షులను, ఇతర జంతువులను దత్తత తీసుకున్నారు. ఇందుకోసం ఒక్కొక్కరు రూ. 5 వేల రూపాయల చెక్‌ను జూకు అందజేశారు. ఈ సందర్భంగా పిల్లలు చూపిన స్ఫూర్తిని జూ డిప్యూటీ క్యూరేటర్ నాగమణి అభినందించారు. టైగర్, పక్షులను దత్తత తీసుకోవడం ద్వారా విద్యార్థలు వన్యప్రాణులపై తమకు ఉన్న ప్రేమను చాటుకున్నారని అన్నారు. నగరవాసులు కూడా పెద్ద సంఖ్యలో ముందుకు జూలోని జంతువులను దత్తత తీసుకోవాలని కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tiger