Home /News /telangana /

SCHOOL GIRL OF KASTURIBA ARE FORCED TO GET MARRAIGE VRY KMM

Khammam : పసిప్రాయంలో గుండెలపై భారం, బడికి దూరమవుతున్న పిల్లలు కారణాలు ఇవేనా...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Khammam : ఖమ్మం ఉమ్మడి జిల్లాలో 14 స్కూళ్లలో 72 మంది పాఠశాలలకు స్వస్తి పేదరికం వారి పాలిటి శాపంగా మారుతోంది. ఎలాగైనా చదువుకోవాలన్న ఆ బాలికల ఆశలు నీరుగారిపోతున్నాయి. సంసారం ఈదలేక పేదింటి బిడ్డల బాధలుపట్టుమని పదహారేళ్లూ నిండని ఆ పేదింటి బిడ్డలకు పెళ్లి కష్టాలు వచ్చాయి. పుస్తక ప్రాయంలో పుస్తెల తాళ్లు గుండెలపై భారంగా మారాయి. కరో నా ధాటితో ఛిన్నాభిన్నమైన పలు పేద కుటుంబాలు బిడ్డల చదువు మాన్పించి పెళ్లి పీటలు ఎక్కించారు

ఇంకా చదవండి ...
  (జి. శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్, న్యూస్18 తెలుగు, ఖమ్మం జిల్లా)

  . ఖమ్మం జిల్లాలో 14 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలుండగా కోవిడ్ సమయంలో 72 మంది చదువుకు స్వస్తి పలికారు. వీరిలో అత్యధికులకు పెళ్లిళ్లు చేశారు. ఇందులో కొందరు చిరుప్రాయంలో సంసార సాగరం ఈదలేక అనారోగ్యబారిన పడుతున్నారు. కాపురాల్లో కలతలు, అమ్మాయిని బాగా చూసుకుంటామంటూ మభ్యపెట్టి పెళ్లి చేసుకున్నా అత్తారింటి వేధింపులతో కొందరి పెళ్లిళ్లు ఏడాది తిరగకముందే పెటాకులవుతున్నాయి. అనారోగ్య కారణాలు, ఆర్థిక ఇబ్బందుల నడుమ  త్వరగా త్వరగా పెళ్లిళ్లు జరిపించిన తల్లిదండ్రులు కొందరు ఇప్పుడు తీరని వ్యధను అనుభవిస్తున్నారు. పెళ్లి చేసి భారం దింపుకోవాలనే యోచనతో కరోనా కష్టకాలంలో అప్పు చేసి మరీ చేసిన కళ్యాణం దారిద్య్రరేఖ దిగువన ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్జీ కుటుంబాలకు చెందిన బాలికలకు శాపంగా మారింది. వాస్తవానికి ఆర్ధిక కారణాలతో ఏ ఒక్క బాలిక చదువుకు దూరం కాకూడదన్న  లక్ష్యంతో విద్యా సౌకర్యాల కల్పనలో భాగంగా 2004లో దేశవ్యాప్తంగా కస్తూర్బా బాలికా విద్యాలయాలను నెలకొల్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న లింగ అసమానతలు రూపుమాపడానికి నెలకొల్పిన ఈ విద్యాలయాలు కరోనా కారణంగా రెండేళ్ల పాటు మూసివేశారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ బోధన చెప్పించే ఆర్ధిక స్థోమతలేని అనేక మంది తల్లిదండ్రులు పిల్లలను చదువుమానిపించారు. ఖమ్మం జిల్లాలో 14 కేజీబీవీలు ఉండగా బోనకల్ 6. చింతకాని 4, ఏన్కూరు 6, కామేపల్లి 4, ఇమ్మం అర్బన్ 7, కొత్తూరు (పై) 8, కొణిజర్ల 9, కూసుమంచి 3. ముదిగొండ 6, పెనుబల్లి 6, రఘునాథపాలెం 1, తిరుమలాయపాలెం 4. ఎర్రుపాలెం 8 మొత్తంగా 72 మంది కోవిడ్ సమయంలో చదువు మానేశారు. వీరిలో అత్యధికులకు పెళ్లిళ్లు చేశారు.

  కొందరు కుటుంబానికి తోడుగా కూలి పనులకు వెళ్తున్నారు. పెళ్లిళ్లు చేసుకున్న అనేక మంది అనారోగ్యంతో అవస్థపడుతున్నారు.* కోవిడ్ సమయంలోనే చదువుకు స్వస్తి...కూసుమంచి మండలం గ్రెగోళ్లపల్లికి చెందిన ఓ నిరుపేద గిరిజన కుటుంబం పదినెలల క్రితం కోవిడ్ సెకండ్ వేప్ సమయంలో తన కూతురికి పెళ్లి చేసింది. ముదిగొండ మండలం లక్ష్మీపురం కస్తూర్బా బాలికల విద్యాలయంలో నాడు 9వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థినిని అర్ధాంతరంగా తల్లిదండ్రులు చదువు మాన్పించారు. రూ.8లక్షలు వెచ్చించి పట్టుమని 15 ఏళ్లు నిండని తమ కూతురుకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రానికి చెందిన యువకునితో వివాహం 2.5 లక్షలు కానుకల కింద రూ.1.5 లక్షలతో ఇంట్లోకి సామగ్రి కొనిచ్చారు. మొత్తంగా రూ. 4 లక్షల వరకు ముట్టజెప్పారు. కానీ ఆ యువకునికి మూర్ఛ వ్యాధి ఉండటంతో తరచూ ఫిట్స్ వచ్చి కిందపడిపోతున్నాడు.

  నిజానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న పెద్దకూతురిని ఇచ్చి పెళ్లి చేద్దామని ప్రయత్నించగా జిల్లా స్త్రీ, శిశు సంక్షేమాధికారికి విషయం తెలిసి మందలించారు. దీంతో చిన్నకూతుర్ని ఒప్పించి మరీ పెళ్లి చేశారు. రెక్కలుముక్కలు చేసుకుని కూడబెట్టిన రూ. 4 లక్షలకు తోడు మరో రూ. 4 లక్షలు అప్పుచేసి పెళ్లి చేస్తే అల్లుడు అనారోగ్యంతో అవస్థపడుతుండటంతో విడాకులకు సిద్ధమయ్యారు. మరోవైపు బాల్యవివాహ చట్టం కింద కేసు నమోదవడంతో కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. కోవిడ్ సమయంలో స్వగ్రామంలో పనులు లేక ముదిగొండ గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేయడానికి వచ్చిన ఆ బాలిక తల్లిదండ్రులు పెళ్లి చేసి తప్పు చేశాం' అని పశ్చాతాప పడుతున్నారు. కూతురిని మళ్లీ యథావిధిగా కస్తూర్భా విద్యాలయంలో చేర్పించారు. ఇప్పుడు ఆ బాలిక పదో తరగతి చదువుతోంది.ఈ ఒక్క కుటుంబ బాధ కాదు. దాదాపు 72 మంది పిల్లల వ్యధ 2020- 21లో కామేపల్లి కస్తూర్బా స్కూల్లో ఇంటర్ ఫస్టియర్లో జాయిన్ అయిన బాలికకు, టేకులపల్లి కస్తూర్భా స్కూలులో మరో బాలికకు కూడా ఇలాగే వివాహం చేశారు. చిన్న వయసు కావడంతో కాపురం చేయడానికి ఆ బాలిక అవస్థలు పడుతోంది. తరచూ గర్భకోశ సమస్యలు తలెత్తుతున్నాయి. తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంకు చెందిన మరో బాలిక కూడా ఇలాగే అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటోంది. ఆర్ధికలేమి. అవగాహన రాహిత్యం కారణంగానే ఇలా బాల్యవివాహాలు జరుగుతున్నట్లు కస్తూర్బా విద్యాలయాల నిర్వాహకులు చెబుతున్నారు.

  అధికారులు అవగాహన చేసినా...

  విద్యార్థినులకు అత్యధికంగా పెళ్లికైనట్లు మా నోటీసుకూ వచ్చిందని. ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే చిన్నతనంలోనే పెళ్లి నష్టాలను వివరిస్తున్నామని. ఆయా స్కూల్స్ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. కానీ కొందరు తల్లిదండ్రులు. పేదరికం తదితర కారణాలతో చిన్నవయస్సులోనే పెళ్లిళ్లు చేస్తున్నారని చెబుతున్నారు
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Khammam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు