సిద్దిపేట బడిలో..." చెత్త పాఠాలు " ప్రారంభించనున్న మంత్రి

సిద్దిపేట బడిలో..." చెత్త పాఠాలు "  ప్రారంభించనున్న మంత్రి

swacha school

స్వఛ్చబడి : సిద్దిపేటలో స్యచ్చబడి ని ప్రారంభించనున్న మంత్రి హరీష్ రావు, చెత్త సేకరణ , పునర్వినియోగం తోపాటు చెత్త మెనేజ్‌మెంట్ పై డిజిటల్ క్లాసులు సైతం నిర్వహించనున్నారు.

  • Share this:
నగరాలను స్వచ్చంగా, పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రస్తుత సమజానికి ఓ సవాలుగా మారుతోంది. ముఖ్యంగా జనసాంద్రతా ఎక్కువగా ఉన్న నగరాల్లో ఇది మరి క్లిష్టంగా మారింది. దీంతో
స్వఛ్చతపై దేశ వ్యాప్తంగా పెద్ద ఉద్యమమే నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర్ర రాజధాని తోపాటు పలు జిల్లాల్లో స్వఛ్చ నగరాలు చాల ప్రాముఖ్యం పోందుతున్నాయి. అయితే నగరాలు పరిశుభ్రంగా ఉండాలంటే ముఖ్యంగా చెత్తకు సంబంధించి అవగాహన చాల అవసరం. చెత్త సేకరణ నుండి దాని పలురకాలుగా విభజించి మనావళికి తిరిగి ఉపయోగించుకునే విధంగా రీ సైక్లింగ్ విధానాన్ని   తీసుకురావడాన్ని చాల ముఖ్యంగా పాలకులు భావిస్తున్నారు. చెత్తతో ఎరువులు తయారు చేయడం తోపాటు విద్యుత్ ఉత్పత్తి సంబంధించిన అవగాహాన పెంచేందుకు పలు సంస్థలు, స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నారు.

సిద్దిపేట జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు మంత్రి హరిష్ రావు ప్రత్యేక చొరవ తీసుకునే విషయం తెలిసిందే....స్వరాష్ట్రంతో పాటు దేశంలో ఇతర రాష్ట్ర్రాల్లో ఉంటే ప్రత్యేకతలు, ఆర్ధిక వనరులపై ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఏ పథకం ద్వార ఏ నిధులు తీసుకు రావచ్చనే అవగాహాన చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు...ఆదిశగా మంత్రి హరీష్ రావు గారి ప్రత్యేక చొరవ తో దక్షిణ భారతదేశంలో బెంగళూరు తర్వాత సిద్దిపేటలోనే ‘స్వచ్ఛబడి’ని ఏర్పాటు చేయించారు. పాఠశాలలో చెత్త గురించిన పాఠాలు చెప్పనున్నారు. ఇందుకోసం సిద్దిపేటలోని పాత ఎంసీహెచ్‌ ఆస్పత్రిలో అన్ని హంగులతో ఈ స్కూలును ఏర్పాటు చేయడం చేయించారు. అన్ని వర్గాల వారికి ఇక్కడ డిజిటల్‌ క్లాసుల్లో
పాఠాలు బోధించి, ఆ తర్వాత ప్రాక్టికల్‌గా వివరించనున్నారు. అయితే ఈ స్వచ్ఛబడిని బెంగళూరుకు చెందిన పర్యావరణ సామాజిక కార్యకర్త శాంతి పర్యవేక్షిస్తున్నారు.

swacha school

మరోవైపు సిద్దిపేటను మోడల్ పట్టణంగా తీర్చిదిద్దడంలో మంత్రి హరీష్ రావు ఇప్పటికే పలు అభివృద్ది పనులు చేపట్టారు. నగర సుందరీకణతో పాటు మోడల్ మార్కెట్ , ఇటివలి ప్రారంభించిన కొమటి చెరువు అభివృద్ది స్థానిక ప్రజలను బాగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ స్వచ్చ బడులు ప్రజలకు మరింత చేరువై అవగహాన పెంచనుంది.

swacha school
swacha school
Published by:yveerash yveerash
First published:

అగ్ర కథనాలు