హోమ్ /వార్తలు /తెలంగాణ /

crime : కరోనా పేరుతో జాగ్రత్తలు... పోలీసంటూ పుస్తెలెత్తుకెళ్లిన మాయగాడు..!

crime : కరోనా పేరుతో జాగ్రత్తలు... పోలీసంటూ పుస్తెలెత్తుకెళ్లిన మాయగాడు..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mahabubnagar : అమ్మా.. అంటూ దగ్గరికి వచ్చాడు. తోటి ప్రయాణికుడే కదా ముసలవ్వ నమ్మితే.. నేను పోలీసని చెప్పాడు. కరోనా కాలంలో దోంగల భయం ఉందంటూ.. తానే దోంగతనానికి పాల్పాడ్డాడు.

  అమ్మా.. అంటూ దగ్గరికి వచ్చాడు. తోటి ప్రయాణికుడే కదా ముసలవ్వ నమ్మితే.. నేను పోలీసని చెప్పాడు. కరోనా కాలంలో దోంగల భయం ఉందంటూ.. తానే దోంగతనానికి పాల్పాడ్డాడు.

  నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణ సమీపంలో లో చోటుచేసుకుంది. కల్వకుర్తి పోలీస్ స్టేషన్ ఎస్సై మహేందర్ కథనం ప్రకారం వెల్దండ మండలం కుప్ప గండ్ల కు గ్రామానికి చెందిన మాడుగుల శాంతమ్మ అనే మహిళ ఉర్కొండ గ్రామానికి వెళ్లేందుకు కల్వకుర్తి పట్టణానికి వచ్చింది. బస్టాండ్ నుంచి ఆటో వద్దకు వెళ్తుండగా గుర్తు తెలియని ఓ వ్యక్తి వచ్చి ఆమెను పలకరించాడు.

  అమ్మ నేను పోలీసు నని చెప్పి నమ్మించాడు. మెడలో బంగారం ఉంచుకుంటే ఎలాగమ్మా, అసలే కరోనా నేపథ్యంలో చోరీలు పెరిగాయి కష్టకాలం ఉంది, కాబట్టి దొంగలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు బంగారం ఏ దొంగ కంటికో కనబడితే ఎవరైనా ఎత్తుకుని వెళ్తే ఎలాగని భయాన్ని పురిగొల్పాడు..నగలు తీసి భద్రంగా దాచుకో మని జాగ్రత్తలు చెప్పాడు. అయితే వాడే ఓ దోంగ అన్న సంగతి కనిపెట్టలేక పోయిన అవ్వ కరోనా కాలంలో కష్టాలు అంటూ చెప్పిన మాటలనే నమ్మింది..ఆ వెంటనే ఆమె మెడలో నుంచి పుస్తెలతాడు తీసింది. అయితే ఎక్కడ పెట్టాలో తెలియక తికమక పడుతున్న అవ్వకు, ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం ఓ పేపర్ కవర్‌ ఉందని చెప్పాడు.

  దీంతో దోంగను నమ్మిన ముసలవ్వ అందులో పుస్తెలతాడు పెట్టమని ఇచ్చింది. అయితే పెస్తెలతాడును తన జేబులో వేసుకుని మరో కాగితం మలిచి ఆమె సంచిలో పెట్టాడు. అనంతరం అక్కడి నుండి జారుకున్నాడు. అయితే కాసేపటికి తేరుకున్న శాంతవ్వ కోంతదూరం వెళ్లాక అనుమానం వచ్చి దోంగ ఇచ్చిన పేపరు కవర్‌ను చూసింది..దీంతో గుండే అగినంత పనైంది. కాగితంలో రాళ్లు తప్ప బంగారం లేదు.. అక్కడే లబోదిబోమని మొత్తుకుంది. మాటల గారడీలో పెట్టి బంగారం దోచుకువెళ్లాడని అర్థమయింది. పోలీసు స్టేషన్‌కు వెళ్లి పిర్యాధు చేసింది శాంతమ్మ .

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Crime news, Mahabubnagar

  ఉత్తమ కథలు