సూక్ష్మంలోనే మోక్షం అంటారు పెద్దలు. జగిత్యాల జిల్లాకు చెందిన ఓ డ్రాయింగ్ టీచర్ టాలెంట్‌ని సునిశితంగా పరిశీలిస్తే అది వాస్తవం అని అందరూ అంటారు. సెప్టెంబర్ 5వ తేది అందరికి గుర్తిండిపోయే రోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ (Dr.Sarvepalli Radhakrishnan)జయంతి. మహనీయుడి పుట్టిన రోజును జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా డ్రాయింగ్ టీచర్(Drawing teacher) చోళేశ్వర్‌చారి(Choleshwar Chari)అద్భుతమైన కళాఖండాన్ని సూక్ష్మరూపంలో పెన్సిల్ లిడ్(Pencil lid)పై చిత్రీకరించారు. అందరిని ఆశ్చర్యపరచడమే కాకుండా అభినందనలు అందుకుంటున్నారు.
పెన్సిల్‌పై శిల్పం..
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని రాఘవపట్నం గ్రామానికి చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, సైకతశిల్పి, కవి గాలిపెల్లి చోళేశ్వర్ చారి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సందర్భం వచ్చింది. వృత్తిరిత్య స్వర్ణకారుడైన చారి ప్రస్తుతం వేములవాడలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో డ్రాయింగ్ టీచర్‌గా పని చేస్తున్నారు. స్వర్ణకార వృత్తి అంటే మునివేళ్లతోనే అత్యంత సూక్ష్మమైన వస్తువులను అందంగా , అద్భుతంగా చిత్రీకరించగలగిన నైపుణ్యం కలిగిన వాళ్లు. అందులో చోళేశ్వర్‌చారి ఆర్ట్ టీచర్ కూడా కావడంతో పెన్సిల్ లిడ్‌పై డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ శిల్పాన్ని చిత్రీకరించారు. కేవలం గంట సమయంలో ఈ అద్భుతమైన సూక్ష్మ కళాఖండాన్ని తయారు చేశారు చారి.
సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫోటో..
సెప్టెంబర్ 5వ తేది జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. తరగతి గదిలో ఉంటూ ఎందరో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది సమాజానికి అందిస్తున్నటువంటి ఎందరో ఉపాధ్యాయులకు, ఎలాంటి లాభోపేక్ష లేకుండా విద్యార్థుల భవిష్యత్తుని ఆలోచిస్తూ జీవితాన్ని ఉపాధ్యాయుడుగానే కొనసాగించే ప్రతి ఉపాధ్యాయుడికి తాను తయారు చేసిన రాధాకృష్ణన్ శిల్పాన్ని అంకితమిస్తున్నట్లు తెలిపారు.
Viral video: రీల్స్ కోసం రైలుతో చెలగాటం .. సోషల్ మీడియా సరదా ఎట్లా తీరిందో తెలుసా
సూక్ష్మకళాఖండం..
ప్రస్తుతం డ్రాయింగ్ టీచర్‌గా విధులు నిర్వహిస్తు చారికి 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తమ శిల్పి అవార్డును పొందారు. మేధావులు కళాకారులు తెలంగాణ పోరాట యోధులు స్వతంత్ర సమరయోధులు ఎందరో దేవత మూర్తుల శిల్పాలను వెయ్యికి పైగా చెక్కిన చారి ఇప్పుడు ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ని ప్రత్యేకంగా చెక్కినట్లు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jagityal, Telangana News