కామారెడ్డి జిల్లాలో సర్పంచ్‌ల ఆందోళన, వారి బాధ వర్ణనాతీతం

కామారెడ్డి జిల్లాలో సర్పంచ్‌ల ఆందోళన

గ్రామాల్లో ఎల్ఈడీ బల్బుల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా సర్పంచ్‌లు కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

  • Share this:
    గ్రామాల్లో ఎల్ఈడీ బల్బుల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా సర్పంచ్‌లు కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే దారిలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసినా వాటిని తోసుకుంటూ వెళ్లి కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించారు. కలెక్టర్ బయటకు రావాలని కలెక్టర్ కు వ్యతిరేకంగా సర్పంచ్‌లు నినాదాలు చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్‌లు మాట్లాడుతూ.. ఎల్ఈడీ బల్బుల నిర్వహణ ప్రైవేటీకరణ చేయడం వల్ల గ్రామ పంచాయతీలకు అదనపు భారం కలుగుతుందని, వెంటనే దానిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పల్లె ప్రగతిలో చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు పెండింగులో ఉన్నాయని, గ్రామాల్లో బడ్జెట్ లేకపోవడంతో పుస్తెలు తాకట్టు పెట్టి, అప్పు చేసి పనులు చేయించామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లోకి కలెక్టర్ వచ్చినప్పుడు కార్యాలయం వద్దకు రాకుండా సర్పంచ్‌లను రోడ్లపైనే నిలబెట్టి పనులు చేయకపోవడానికి బాధ్యులను చేస్తూ మెమోలు జారీ చేయడం సరికాదన్నారు. కలెక్టర్ బయటకు వచ్చి తమతో చర్చించాలని కలెక్టర్ వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.

    సుమారు నాలుగు గంటల పాటు ఆందోళన అనంతరం డీఎస్పీ చొరవతో సుమారు 20 నుంచి 30 మంది సర్పంచులు కలెక్టర్ వద్దకు వెళ్లి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: