Home /News /telangana /

SARPANCH WHO BEGGED FOR ROAD REPAIR EXPENSES IN YADADRI BHUVANAGIRI DISTRICT SNR

Yadadri bhuvanagiri : ఊరి రోడ్లు బాగు చేయడం కోసం జోలె పట్టిన సర్పంచ్ ..ఎక్కడంటే

(పాపం సర్పంచ్)

(పాపం సర్పంచ్)

Yadadri bhuvanagiri: గ్రామాల్లో సర్పంచ్‌ల పరిస్థితి దయనీయంగా మారింది. గ్రామాల్లో రోడ్లు సరిగా లేకపోతే డబ్బుల కోసం గ్రామపెద్దగా సర్పంచ్‌ జోలె పట్టుకొని భిక్షాటన చేసుకోవాల్సిన ధీనస్థితి తలెత్తింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ సర్పంచ్‌ వచ్చిన సమస్య శత్రువు కూడా రాకూడదని స్తానికులు కోరుతున్నారు.

ఇంకా చదవండి ...
గతంలో సర్పంచ్‌(Sarpanch)అంటే ఊరి పెద్దగా భావించేవారు. రోడ్డుపైన కనిపిస్తే నమస్తే పెట్టి మర్యాద ఇచ్చేవారు. కాని ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి తెలంగాణ(Telangana)లో చాలా చోట్ల కనిపించడం లేదు. గ్రామాల్లో సర్పంచ్‌లకు సమస్యలు తలో వెంట్రుకల్లా లెక్క పెట్టలేనన్ని ఉండటం వాటిని క్లియర్ చేయడానికి ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామ ప్రధమ పౌరుడి హోదా కాస్త పలచనవుతోంది. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో ప్రజల దగ్గర మాట కోల్పోవాల్సి వస్తుంది. అందుకే వాళ్లకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం చివరకు రోడ్లపై భిక్షాటన చేసుకుంటున్న పరస్ధితి నెలకొంది. యాదాద్రి భువనగిరి (Yadadri bhuvanagiri)జిల్లాకు చెందిన ఓ సర్పంచ్‌ ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు.

గ్రామాల్లో అభివృద్ధి కోసం..
యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు సర్పంచ్‌గా భీమగాని రాములుగౌడ్ అనే వ్యక్తిని ఎన్నుకున్నారు. పెద్దకందుకూరు నుంచి యాదగిరిపల్లి వరకు వెళ్లే బీటీ రోడ్డు పూర్తిగా దెబ్బతిని అధ్వాన్నస్థితిలో ఉంది. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో వాహనదారులు, పాదాచారులు ఆ రోడ్డుపై నడవడానికి ఇబ్బందికరంగా మారింది. దీంతో వర్షాలకు ముందే అంటే రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలని నియోజకవర్గ ఎమ్మెల్యే గొంగిడి సునీతకు..ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిశారు. తమ గ్రామ సమస్యను మొరపెట్టుకున్నారు సర్పంచ్ రాములుగౌడ్. ఫలితం లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా రోడ్ల మరమ్మతులు చేపట్టడానికి డబ్బుల కోసం చివరకు సర్పంచ్‌ రాములుగౌడ్ జోలెపట్టుకొని రోడ్లపై భిక్షాటన చేసుకోవాల్సిన పరిస్ధితి తలెత్తింది.సర్పంచ్‌ పరిస్థితి ఇలా మరిందా..
ఏ మార్గంలో అయితే రోడ్లు పాడైపోయాయో..అదే రోడ్లో అంటే యాదగిరిపల్లి నుంచి పెద్దకందుకూరు మార్గం మధ్యలో రాములుగౌడ్‌ జోలెపట్టుకొని వచ్చిపోయే వాహనాలను ఆపి మరీ డబ్బులు రోడ్డు పనులకు డబ్బులు దానం చేయమని ధీనంగా అడుక్కున్నారు. టూవీలర్, ఫోర్ వీలర్‌పై వెళ్లే వాళ్లు కాదు చివరకు ఆర్టీసీ బస్సును కూడా ఆపి అందులోని ప్రయాణికుల్ని మా ఊరిలో రోడ్లు పాడైపోయాయి..పనులు చేయించుకోవాలని మా పెద్ద నాయకులకు చెబితే పట్టించుకోవడం లేదు కనీసం మీరైనా తోచిన సాయం చేయమని జోలెపట్టుకొని భిక్షాటన చేశారు. అందరూ దాతలు సహాకరిస్తే వారం రోజుల్లో రోడ్లు రిపేర్ చేయిస్తానంటూ ధీనంగా చెప్పుకొచ్చారు సర్పంచ్ భీమగాని రాములుగౌడ్.

ఇది చదవండి: చికెన్ ఫ్రై‌కి అడ్డా 'నాగర్‌కర్నూల్': తప్పకుండ టేస్ట్ చేయాల్సిందేగెలిచినందుకు ఇదే శాపం..
పన్నులు, ట్యాక్సుల రూపంలో ప్రజలు కట్టే డబ్బులతో గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో మౌళిక సదుపాయాలు, కనీస వసతులు కల్పిస్తూ అభివృద్ధి పనులకు ఖర్చు చేయాలి. కాని ప్రస్తుతం అధికారంలో ఉన్న పాలకులు మాత్రం ఈవిషయాన్ని మర్చిపోయి..గ్రామాల్ని , పట్టణాల అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం నగరాలకే పరిమితం అవుతున్నారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. కనీసం ఈ గ్రామసర్పంచ్‌ పడుతున్న బాధ చూసైన జిల్లా నాయకులు, అధికారులు గ్రామాల్లో రహదారుల మరమ్మతులు చేపడితే బాగుంటుందని సూచిస్తున్నారు.

ఇది చదవండి: సంకల్పానికి అడ్డురాని అంగవైకల్యం: క్రికెట్, బాస్కెట్ బాల్ ఆటల్లో రాణిస్తున్న యువకుడు


Published by:Siva Nanduri
First published:

Tags: Bhuvanagiri, VIRAL NEWS, Yadadri

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు