ఓ వ్యక్తిపై సర్పంచ్ దాడికి పాల్పడ్డాడు. గ్రామంలోని సమస్యలపై ప్రశ్నించినందుకు అతనిపై ఇష్టారీతిన సర్పంచ్ (Sarpanch) దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం (Marpally mandal) దామస్తపూర్‌లో చోటుచేసుకుంది. దామాస్తాపూర్‌కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి గ్రామం డ్రైనేజీ సమస్యల, నీటి సమస్యలను పరిష్కారించాలని స్థానిక సర్పంచ్ జైపాల్ రెడ్డిని కోరినట్టుగా తెలుస్తోంది. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన సర్పంచ్ జైపాల్ రెడ్డి అతడిపై దాడి చేశారు. కాలితో ఎగిరి తన్నడమే కాకుండా.. అతనిపై దాడి చేశాడు. దీంతో శ్రీనివాస్ రోడ్డుపై పడిపోయాడు.
దీంతో అక్కడున్నవారు సర్పంచ్ జైపాల్‌రెడ్డిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామ సమస్యలపై ప్రశ్నిస్తే సర్పంచ్ తనపై దాడి చేశారని ఆరోపించారు. సర్పంచ్ జైపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్‌లో శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
#TRS sarpanch kicks and beats up local after he questions drainage and water issues in his village. Incident at Damasthapur village, Marpally mandal in #Vikarabad district. Local files police complaint against sarpanch Jaipal Reddy. pic.twitter.com/o7EAk4L8du
— krishnamurthy (@krishna0302) September 22, 2021
ఇక, శ్రీనివాస్‌పై సర్పంచ్ దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.