Home /News /telangana /

SARPANCH BECOME WATCHMEN IN NIZAMABAD RURAL DISTRICT VRY NZB

Nizamabad : వాచ్‌మెన్‌గా మారిన సర్పంచ్..ఉదయం సర్పంచ్‌ ..రాత్రి వాచ్‌మెన్ సీట్లో....!

Nizamabad

Nizamabad

Nizamabad : అక్షరాల ప్రజలు ఓట్లు వేసి గెలుచుకున్న ఓ సర్పంచ్ వాచ్‌మెన్‌గా మారాడు..ఓ వైపు కుటుంబ భాద్యతలు మరోవైపు గ్రామ బాధ్యతలు ..దీనికి అదనంగా ప్రభుత్వ టార్గెట్లు..వెరసి తనకున్న భూమిని అమ్ముకుని ఉదయం సర్పంచ్‌గా రాత్రిపూట వాచ్‌మెన్‌గా మారిన దీన స్థితి బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తున్న రాష్ట్రంలో వెలుగు చూసింది.

ఇంకా చదవండి ...
  నిజామాబాద్ జిల్లా, న్యూస్18 తెలుగు ప్ర‌తినిధిః పి మ‌హేంద‌ర్,

  రాష్ట్రంలో సర్పంచ్‌ల పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఈ స్టోరీ చదివితే అర్థం అవుతుంది..సర్పంచ్ పదవి కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ తర్వాత ప్రజల అవసరాలు తీరుస్తూ.. అనేక ఆర్ధిక ఇబ్బందులకు గురి అవుతున్నవారు వేలల్లోనే ఉన్నారు. ఇందుకు తోడు రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఖండిషన్లు వారిని మరింత ఆర్ధిక కష్టాల్లోకి నెట్టుతున్నాయి.. చేసిన పనులకు డబ్బులు తిరిగి రాక చేసిన అప్పులు చెల్లించలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పల్లె ప్రగతి పేరుతో ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా అవి కనీస అవసరాలకు కూడా సరిపోని పరిస్థితి నెలకొంటుంది.

  ఈ నేపథ్యంలోనే నిధులు మంజూరు కాక సర్పంచ్ లు గ్రామం కోసం తన స్వంత పొలం అమ్ముకున్నారు.. ఉదయం పూట సర్పంచ్ కుర్చీలో కూర్చుంటూ.. రాత్రివేళ సెక్యూరిటీ గార్డులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరి పరిస్థితి ప‌గ‌వాణికి కూడా రాకుడ‌ద‌ని గ్రామస్థులు సైతం అయ్యో పాపం అంటున్నారు.. ఈ ప‌రిస్థితి నిజామాబాద్ జిల్లాలోని ఓ స‌ర్పంచ్ దీనగాధ‌..

  నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ఆరెపల్లి గ్రామం,ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఇరుసు మల్లెష్.. ఆరెప‌ల్లి గ్రామం సర్పంచ్‌గా ఎంపికయ్యాడు..ఈయనను పోటీ ఎక్కువగా ఉండడంతో చిట్టీలు వేసి ఎంపిక చేశారు..చిట్టిల రూపంలో ఆయనకు అదృష్టం తన్నుకువచ్చినా...నిజజీవితంలో మాత్రం ఆయన కష్టాలపాలు చేసింది..ఇలా సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత కొన్ని అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. అయితే ఆ పనులను తానే స్వయంగా చేయడంతో అప్పుల పాలు అయ్యాడు.. ఇలా పల్లె ప్రగతితో పాటు గ్రామంలో చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు అలాగే ఉండిపోయాయి.. దీంతో చేసిన పనులకు సకాలంలో బిల్లులు రాక, అప్పులు తీర్చలేక..తనకున్న రెండు ఎకరాల భూమిలో అర ఎకరం భూమి కూడా అమ్ముకుని చేసిన అప్పులు తీర్చాడు.

  ఇక దీంతో ఇళ్లు గడవడం కూడా ఇబ్బందిగా మారింది, మరోవైపు సర్పంచ్‌లకు ఇచ్చే గౌరవ వేతనం కూడా నెలవారిగా అందని పరిస్థితి ఉంటుంది..ఇలా అన్ని సమస్యలను కలిసి ఆయన్ను వాచ్‌మెన్‌గా మార్చాయి..ఈ క్రమంలోనే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అశోక టవర్స్‌లో వాచ్‌మెన్‌గా చేరాడు..ఇలా రాత్రీ పూట వాచ్‌మెన్ విధులు నిర్వహిస్తూ ఉదయం పూట సర్పంచ్ పనుల్లో నిమగ్నమవుతున్నాడు. ఇలా గ్రామంలో ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులతో పాటు ఇతర అవసరాలను చూస్తున్నాడు..

  కాగా ఈ పరిస్థితులపై మల్లెశ్ మాట్లాడుతూ గ్రామపంచాయితీకి వస్తున్న నిధులపై వివరించాడు..మొత్తం గ్రామ జనభా 434 ఉండగా అందుకు అనుగుణంగా ప్రతి నెల 37వేల రూపాయలు ఎస్ఎఫ్‌సి నుండి వస్తాయని చెప్పాడు. ఇవి సిబ్బంది జీతాలతోపాటు కరెంట్ బిల్లులకు సరిపోతుందని వివరించాడు. ఇక చేసిన అభివృద్ది పనులకు బిల్లులు రావడం గగనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు.

  బిల్లులకు సంబంధించి జిల్లా కలెక్టర్‌తో పాటు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ కూడా పరిస్థితి వివరించానని చెప్పాడు. అయినా డబ్బులు ఇప్పిస్తామని చెబుతున్నారు గాని ఒక్క హామి కూడా అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా ఎవరికి చెప్పిన నిధులు రాకపోవడంతో తనకున్న భూమిలో అరఎకరం భూమి అమ్మి మరి అభివృద్ది పనుల నిధులు ఇచ్చినట్టు చెప్పాడు. ఇక కుటుంబ భారం కూడా తోడు అవడంతోనే వాచ్‌మెన్‌గా చేరానని చెప్పాడు.
  Published by:yveerash yveerash
  First published:

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు