• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • SARPANCH AND DEPUTY SARPANCH FIGHT STUNNING VIDEOS GOES VIRAL IN KOUDIPALLY TELANGANA SK

Telangana: గ్రామ సభలో రచ్చ.. తన్నుకున్న సర్పంచ్, ఉప సర్పంచ్.. వైరల్ వీడియో

Telangana: గ్రామ సభలో రచ్చ.. తన్నుకున్న సర్పంచ్, ఉప సర్పంచ్.. వైరల్ వీడియో

తన్నుకున్న సర్పంచ్, డిప్యూటీ సర్పంచ్

గ్రామాభివృద్ధి కోసం కలిసి పనిచేయాల్సిన సర్పంచ్, ఉపసర్పంచ్ కొట్టుకున్నారు. గ్రామస్తుల ముందే తన్నుకున్నారు. మెదక్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. వీరిద్దరి ఫైట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  • Share this:
    సర్పంచ్.. ఉప సర్పంచ్. గ్రామంలో వీరిద్దరి పాత్ర ఎంతో కీలమైనది. ఇద్దరు కలిసి కట్టుగా పనిచేయాలి. పరస్పరం సహకరించుకుంటూ గ్రామాభివృద్ధికి కృషిచేయాలి. అందుకే ఇద్దరికీ కలిపే తెలంగాణ ప్రభుత్వం చెక్ పవర్ ఇచ్చింది. అలాంటి ప్రజాప్రతినిధులు అందరూ చూస్తుండగా కొట్టుకున్నారు. నువ్వెంతంటే.. నువ్వెంత అంటూ తన్నుకున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నేతలే.. అందరి ముందూ నవ్వుల పాలయ్యారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ముట్రాజ్‌పల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వారిద్దరి ఫైట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    స్థానికులు చెప్పిన కథనం ప్రకారం.. శుక్రవారం ముట్రాజ్‌పల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశం జరిగింది. పంచాయతీ నిధులతో స్థానిక పాఠశాల నుంచి నల్లపోచమ్మ గుడి వరకు మురికి కాలువ నిర్మించేందుకు గ్రామ సర్పంచ్‌ సంజీవ్‌ సమావేశంలో ప్రతిపాదించారు. ఐతే ఆ మార్గంలో కాలువ నిర్మాణం వద్ద.. మరొక చోట నిర్మిద్దామని ఉపసర్పంచ్ సూచించారు. సర్పంచ్ ప్రతిపాదన పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఇరువురి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. మాటా మాటా పెరిగి కొట్టుకునే వరకు వెళ్లింది. గ్రామ వార్డు మెంబర్లు, ప్రజల ముందే ఇరువురు నేతలు కొట్టుకున్నారు. పరస్పరం పిడిగుద్దులు కురిపించుకున్నారు. తోటి సభ్యులు కల్పించుకొని వారిద్దరికి నచ్చజెప్పారు.

    ఘటన అనంతరం ఇరువర్గాల కౌడిపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పరస్పరం ఫిర్యాదు చేశారు. ఉపసర్పంచ్ వెంకటేశంపై ఎంపీటీసీ ప్రవీణ్, సర్పంచ్ సంజీవ్ చేయగా.. సర్పంచ్‌పై ఉపసర్పంచ్ వెంకటేశం పిర్యాదు చేశారు. ఐతే అక్కడ కూడా గొడవ జరిగింది. పోలీసుల ముందే మరోసారి తన్నుకున్నారు. సర్పంచ్ సంజీవ్ సోదరులు రవి, ప్రవీణ్.. వెంకటేశంపై దాడి చేశారు. ఎస్‌ఐ రాజశేఖర్ కలగ చేసుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం అక్కడి నుంచి పంపించారు.



    ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు జాయింట్ చెక్ పవర్ పెట్టడంతో గ్రామాల అభివృద్ధి పక్కన పోయి.. వీరి మధ్యల గొడవలకు దారి తీస్తున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు