తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడులో ఓ సీన్ కెమెరా కంటికి చిక్కింది. ఓ పోలీస్ కారు మీద దుప్పట్లు, చీరలు ఆరేసి ఉన్నాయి. వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న ఓ సత్రం ముందు పోలీసులు కారును ఆపి ఉంచారు. ఎవరో కానీ, ఆ కారు బానెట్ మీద, అద్దాల మీద దుప్పట్లు ఆరేశారు. దీన్ని చూసిన వారు ‘ఇదే ఫ్రెండ్లీ పోలీసింగ్.’ అని సెటైర్లు వేస్తున్నారు.
మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడకు హెలికాప్టర్ సేవలను ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ తెలంగాణ స్టేట్ ఏవియేషన్ కార్పొరేషన్ సహకారంతో ఈ సేవలను ప్రారంభించింది. ఈ నెల 23వ తేదీ వరకు హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉండనున్నాయి.హెలికాప్టర్ సేవలు మొత్తం మూడు రకాల ప్యాకేజీలుగా ఉన్నాయి. ప్యాకేజీ-1లో భాగంగా వేములవాల నుంచి వ్యూపాయింట్‌కు 7 నిమిషాల రైడ్‌కు టికెట్ ధర రూ.3 వేలు. ప్యాకేజీ-2లో వేములవాడ మిడ్‌మానేరు పరిసర ప్రాంతాలు తిలకించేందుకు రూ.5,500. కనీసం ఆరుగురు వ్యక్తులు ఉండాలి. 16 నిమిషాల విహంగ వీక్షణం. ప్యాకేజీ-3లో హైదరాబాద్ నుంచి వేములవాడకు తిరిగి హైదరాబాద్‌కు టికెట్ ధర రూ. 30 వేలు. కనీసం ఐదుగురు వ్యక్తులు ఉండాలి.