SANTOSHI WIFE OF COL SANTHOSH BABU HAS BEEN POSTED AS TRAINEE COLLECTOR OF YADADRI DISTRICT NS
Telangana: ట్రైనీ కలెక్టర్ గా కల్నల్ సంతోష్ సతీమణి.. మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్
యాదాద్రి జిల్లా కలెక్టర్ కు రిపోర్టు చేస్తున్న సంతోషి
భారత, చైనా సరిహద్దుల్లో ఇటీవల ఇరు దేశాల సైనికుల మధ్య ఏర్పడిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బాధిత కుటుంబీకులను సీఎం కేసీఆర్ స్వయంగా పరామర్శించారు. కల్నల్ సంతోష్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని ప్రకటించారు.
భారత, చైనా సరిహద్దుల్లో ఇటీవల ఇరు దేశాల సైనికుల మధ్య ఏర్పడిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బాధిత కుటుంబీకులను సీఎం కేసీఆర్ స్వయంగా పరామర్శించారు. కల్నల్ సంతోష్ సతీమణికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సంతోష్ భార్య సంతోషిని యాదాద్రి జిల్లా డిప్యూటీ కలెక్టర్ గా నియమించింది. ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న సంతోషిని రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి జిల్లాకు కేటాయించింది. ఈ నేపథ్యంలోనే దివంగత కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి యాదాద్రి జిల్లాలో ట్రైనీ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు సంతోషి యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ కు ఆమె రిపోర్టు చేశారు.
అమరుడు కల్నల్ సంతోష్ కుటుంబాన్ని పరామర్శించిన సమయంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశరక్షణ కోసం సంతోష్ ప్రాణత్యాగం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. సంతోష్ మరణం తనను ఎంతగానో కలచివేసిందని చెప్పారు సీఎం కేసీఆర్. ప్రభుత్వం సంతోష్ కుటుంబానికి ఎల్లవేళలా అండగా వుంటుందని హామీ ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలని సూచించారు.
సంతోష్ కుటుంబ బాగోగులు చూసుకోవాలని స్థానిక మంత్రి జగదీశ్ రెడ్డిని ముఖ్యమంత్రి కోరారు. సంతోష్ భార్య సంతోషీకి గ్రూప్1 ఉద్యోగం ఇచ్చే నియామక పత్రాన్ని స్వయంగా అందజేశారు తెలంగాణ సీఎం. హైదరాబాద్ లోని బంజార్ హిల్స్ లో 711 గజాల స్థలానికి సంబంధించిన పత్రాన్ని సంతోష్ భార్యకు ముఖ్యమంత్రి అందించారు. సంతోష్ భార్యకు రూ. 4 కోట్ల చెక్కును, తల్లితండ్రులకు రూ.1 కోటి చెక్కును ముఖ్యమంత్రి అందించారు.
సంతోష్ చనిపోయిన సమయంలో ఆయన సతీమణి సంతోషి మాట్లాడుతూ.. చైనాతో సరిహద్దు ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు అడుగు జాడల్లోనే తన పిల్లలు అభిజ్ఞ, అనిరుధ్లను నడిపిస్తానని తెలిపారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన పిల్లల్లో... తండ్రి చేసిన త్యాగం, చూపిన ధైర్యసాహసాల్ని పిల్లలకు నూరిపోస్తానని ఓ ఇంటర్వ్యూలో సంతోషి తెలిపారు. తన భర్త ఎప్పుడూ దేశం గురించే ఆలోచించేవారనీ... దేశ రక్షణే ధ్యేయంగా ఉండేవారనీ... తమకు ఎంతో స్పూర్తి కలిగించేవారని ఆమె వివరించారు. చైనాతో ఘర్షణలో సంతోష్ బాబుతోపాటూ... అమరులైన 19 మంది సైనికులకూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక సాయం ప్రకటించడం ఎంతో గొప్ప విషయం అని అన్నారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.