Home /News /telangana /

SANKRANTI TRAFFIC RANGOLI IN SHADHNAGAR POLICE STATION LOOKS BEAUTIFUL AND MESSAGE ORIENTED TOO MBNR PRV

Sankranti traffic Rangoli: ఆహా.. ట్రాఫిక్ ముగ్గు చూశారా.. జాతీయ రహదారి, డివైడర్లు, ప్రకృతి పర్యావరణం... వావ్​ అనిపించేలా ఉందిగా..

షాద్​నగర్​లో సంక్రాంతి ట్రాఫిక్​ ముగ్గు

షాద్​నగర్​లో సంక్రాంతి ట్రాఫిక్​ ముగ్గు

సంక్రాంతి పండగను పురస్కరించుకొని షాద్ నగర్ ట్రాఫిక్ పోలీస్ శాఖ ఎస్ఐ రఘు కుమార్ తన పోలీస్ స్టేషన్ వాకిలిలో అందమైన రంగవల్లులను వేశారు. అయితే రంగవల్లులు చూస్తే ఆశ్చర్యానికి గురికాక తప్పదు.

    (న్యూస్ 18, మహబూబ్​నగర్​, సయ్యద్ రఫీ)

    మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి (Sankranti Festival).. భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు హడావుడి ఇవన్నీ సంక్రాంతి శోభను తెస్తాయి. అయితే సంక్రాంతి పండుగ (Sankranti Festival) అంటేనే అందమైన రంగవల్లులు వాకిట మెరుస్తాయి. ఏ ఇంటిని సందర్శించిన అద్భుతమైన ముగ్గులు, గొబ్బిమ్మలు కనబడతాయి. అయితే రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ (Shadnagar) ట్రాఫిక్ సబ్ ఇన్​స్పెక్టర్​ రఘు కుమార్ మాత్రం ఈసారి సంక్రాంతి పండుగకు కొత్తగా ఆలోచించారు. అసలు ఒక మాటలో చెప్పాలంటే "చించేశారు సుమీ"..!

    జాతీయ రహదారిని తలపించే డిజైన్..

    విశేషం ఏదైనా సరే తమ పద్ధతిలోనే సమాజానికి సంకేతం చెప్పాలనుకున్నారు. అందుకే సంక్రాంతి పండగ (Sankranti Festival)ను పురస్కరించుకొని షాద్ నగర్ ట్రాఫిక్ పోలీస్ శాఖ ఎస్ఐ రఘు కుమార్ తన పోలీస్ స్టేషన్ వాకిలిలో అందమైన రంగవల్లులను వేశారు. అయితే రంగవల్లులు (rangoli) చూస్తే ఆశ్చర్యానికి గురికాక తప్పదు. అందమైన ముగ్గులు వేశారు . అవి ట్రాఫిక్ పద్దతిలోనే (Traffic method) వేయడం విశేషం. విశాలమైన జాతీయ రహదారిని తలపించే డిజైన్ ముగ్గును తయారు చేశారు. డివైడర్లు, ప్రకృతి పర్యావరణం, అదేవిధంగా నల్లని జాతీయ రహదారి దానిపై గొబ్బెమ్మలకు బదులు వాహనాలు పెట్టారు. తెల్లని, నల్లని, పచ్చని రంగులతో ట్రాఫిక్ ముగ్గులు వేసి ఔరా అనిపించారు. ఇదేమీ ముగ్గు (Rangoli) అని కాసేపు తేరిపార చూస్తే ట్రాఫిక్ డిసిప్లేన్ సూచిస్తూ ముగ్గులు వేయడం కనిపించింది.

    షాద్ నగర్ (Shadnagar) ఎస్ఐ రఘు కుమార్ తన ఆలోచనతో ప్రజలకు రంగవల్లుల ద్వారా ట్రాఫిక్ నిబంధనలను అవగాహన చేయడం విశేషం. దీనిపై ఎస్సై రఘు కుమార్ మాట్లాడుతూ.. లైన్ డిసిప్లిన్ చాలా ముఖ్యమని ఎస్ఐ రఘు కుమార్ తెలిపారు. రోడ్డుకు ఎడమ పక్కన కార్లు ఆ తర్వాత లారీలు, గూడ్స్ వాహనాలు, ఆ తరువాత ద్విచక్ర వాహనాలు పద్ధతి ప్రకారం వెళితే ఎలాంటి రోడ్డు ప్రమాదం సంభవించదని సూచించే విధంగా ట్రాఫిక్ డిసిప్లేన్ ముగ్గులు వేసినట్లు ఎస్ఐ తెలిపారు.

    ట్రాఫిక్​ ముగ్గు


    గత ఏడాది లైన్ డిసిప్లిన్ లేకుండా ప్రయాణాలు చేయడం వల్ల వాహనదారులు ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగాయని, అందుకే లైన్ డిసిప్లేన్ పై ట్రాఫిక్ పోలీసులు జాగ్రత్తలు సూచిస్తూ ముగ్గును వేసినట్టు పేర్కొన్నారు.

    ట్రాఫిక్ సిబ్బంది ఎంతో కష్టపడి ఈ ముగ్గు వేశారని వారిని అభినందించారు. సంక్రాంతి పండుగ వేళ అందరూ సురక్షితంగా ప్రయాణాలు చేయాలని, తమ గమ్యస్థానాలకు రోడ్డు నిబంధనలను పాటిస్తూ చేరుకోవాలని సూచించారు. పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని, కోరుకుంటూ.. ప్రజలందరికీ భోగి, మ‌క‌ర సంక్రాంతి, క‌నుమ శుభాకాంక్ష‌లు తెలియజేశారు..
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Rangareddy, Sankranti, Shadnagar

    తదుపరి వార్తలు