sangareddy : పనులు కావాలంటే ప్రైవేటుగా కలవాలంటూ... శానిటరి ఇన్‌స్పెక్టర్ రాసలీలలు..

శానిటరి ఇన్‌స్పెక్టర్‌ను చితక బాదుతున్న మహిళ

sangareddy : కావాల్సిన పనులు చేసి పెడతానంటూ ఓ శానిటరి ఇన్‌స్పెక్టర్ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు..పనులు కావాలంటే ప్రైవేటుగా కలవాలని హుకుం జారీ చేశాడు...అనుమానం వచ్చిన ఆ మహిళ తన భర్తతో కలిసి ఆ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను చితక బాదారు.

  • Share this:
    News18 ప్రతినిధి
    కె.వీరన్న
    మెదక్ జిల్లా
    ప్రభుత్వ విధులు నిర్వహించే అధికారులు అక్రమార్కులుగా మారడమే కాకుండా మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారు. అవసరాల కోసం వచ్చిన వారిని లైంగికంగా వాడుకునేందుకు వెనకాడడం లేదు..దీంతో తమకు కావాల్సిన పనుల కోసం వెళుతున్న మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారు.

    అయితే కొంతమంది మాత్రం తమకు జరుగుతున్న వేధింపులపై బయటకు వచ్చి చెబుతుండడంతో కొంతమంది అధికారుల తీరు బయటపడుతోంది. ఈ నేపథ్యంలోనే సంగారెడ్డి జిల్లాలో సదాశివపేట్‌లో పని చేసే ఎంకన్న అనే శానిటరీ ఇన్‌స్పెక్టర్ కూడా ఓ మహిళను వేధింపులకు గురి చేశాడు.. అవసరమైన పనులు చేసిపెడుతా అంటూ.. మహిళను లోబరుచుకునే ప్రయత్నం చేశాడు.

    తనకు ఇళ్లు కూలింది..నష్టపరిహారం ఇప్పిస్తానంటూ ఆ మహిళ ధరఖాస్తు చేసుకోవడంతో.. ఆమెను లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. తనకు ఫోన్ చేసి ప్రైవేటు కార్యాలయానికి రావాలని చెప్పాడు. లేదు అంటే ఇంకా ఎవరినైనా పంపించాలని కోరాడు...దీంతో విషయం అర్థం చేసుకున్న ఆ మహిళ తన భర్తకు చెప్పింది. అనంతరం ఇద్దరు కలిసి శానిటరి ఇన్‌స్పెక్టర్ ఎంకన్న చెప్పిన ప్రైవేటు కార్యాలయానికి వెళ్లారు. ఆ తర్వాత బయటకు గుంజి రోడ్డుమీదే పిడిగుద్దులు గుద్దారు.. అనంతరం ఆ మహిళ చెప్పుదెబ్బలతో గురుడికి బుద్ది చెప్పింది..

    అయితే ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మున్సిపల్ కమీషనర్ జోక్యం చేసుకున్నట్టు తెలుస్తోంది. కేసు పెట్టకుండా మాట్లాడుకుందామని ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. కాని భాదితురాలు మాత్రం కేసును వెనక్కి తీసుకునేందుకు నిరాకరించింది.
    Published by:yveerash yveerash
    First published: