(K.Veeranna,News18,Medak)
తెలంగాణ(Telangana)లో కొత్త తరహా స్మగ్లింగ్ బయటపడింది. ముఖ్యంగా అరుదుగా కనిపించే అటవీ ప్రాణుల్ని ఇతర రాష్ట్రాలకు తరలించి సీక్రెట్‌గా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈవిధమైన క్రైమ్ చేస్తున్న ముఠాను సంగారెడ్డి(Sangareddy) జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వాళ్లు స్మగ్లింగ్ చేస్తున్న రెండు తలల పాముల్ని(Two headed snakes) స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ రెండు తలల పాములు ఎక్కడి నుంచి తెస్తున్నారు..? వాటితో ఏం చేస్తారు..? ఆ పాముల్ని ఎవరికి విక్రయిస్తున్నారనే విషయాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. అయితే స్మగ్లింగ్ ముఠాలో 9మందిని అరెస్ట్ చేయగా..ముగ్గురు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు.
స్నేక్స్ స్మగ్లింగ్ ముఠా..
వన్యప్రాణ సంరక్షణ చట్టాన్ని తుంగలో తొక్కి అడవుల్లో ఉండే జంతువులు, పాముల్ని గుట్టుచప్పుడు కాకుండా తెచ్చి విక్రయిస్తున్న స్మగ్లర్లు ఈమధ్య కాలంలో ఎక్కువయ్యారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం శ్రీనివాస్‌నగర్‌లో నివాసముంటున్న కొందరు నల్లమల అటవీ ప్రాంతం నుండి రెండు తలల పాములను తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తోంది ఓ ముఠా. సంగారెడ్డికి చెందిన చిన్నోల్ల మాణిక్ రెడ్డి, చిత్తూరుకు చెందిన కే. చంద్రశేఖర్, యుగంధర్, గోపాల్, ప్రసాద్, తమిళనాడు కు చెందిన V. భాస్కర్, T. నవీన్, కర్ణాటకకు చెందిన Md. బాషా,రమేష్, రాఘవేందర్, అంబర్ విజయ్,షేక్ సికిందర్ కలిసి రామచంద్రాపురం పరిధిలో రెండు తలల పాములను విక్రయిస్తున్నారు.
రెండు తలల పాములతో బిజినెస్..
స్నేక్ స్మగ్లింగ్ ముఠా దందాపై సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్ ఓ టి పోలీస్, అటవీ శాఖ అధికారులు కలిసి దాడి చేసి నిందితుల్ని పట్టుకున్నారు. వాళ్ల దగ్గర నుంచి రెండు తలల పాములు, లక్ష 90 వేల నగదుతో పాటు రెండు కార్లు, 10 మొబైల్స్‌తో పాటు ఒక తూనిక మిషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని రామచంద్రాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరందరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని మియాపూర్ ఏసిపి నర్సింహ రావు తెలిపారు. ఈ స్నేక్ స్మగ్లింగ్ గ్యాంగ్‌లో మొత్తం 9మందిని అరెస్ట్ చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ రెండు తలల పాముల్ని కర్ణాటక , ఆంధ్రప్రదేశ్, తెలంగాణ , తమిళనాడు రాష్ట్రాల నుంచి తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లుగా తేల్చారు.
నల్లమల ఫారెస్ట్ నుంచి తెస్తున్న ముఠా..
చూడటానికి మట్టి రంగులో శరీరం అంతా ఒకే పరిమాణంలో ఉన్నాయి. రెండు తలల పామని గుర్తించారు. ఆరు నెలలు ఒక వైపు తలతోను, మరో ఆరు నెలలు రెండవ తలతోను ఆహారం తీసుకుంటుంది. ఆంధ్రాలోని గోదావరి పరీవాహక ప్రాంతాలు, చిత్తడి నేలల్లో ఇవి ఎక్కువగా ఉంటాయని తెలిపారు. అయితే ఈ పాములో విషం ఉండదని రెండు వైపుల తల ఉండటం కారణంగా వేగంగా కదల్లేదని తెలిపారు. పట్టుకున్న పాముకు రెండు తలలు ఉండవని ఎలుక బొరియల్లో దూరినప్పుడు చురుగ్గా కదలలేకపోవడం వలన ఎలుకలు కొరికేసి రెండవ వైపు తలను పోలిన ఆకారం ఏర్పడుతుంది.
మార్కెట్‌లో భారీ డిమాండ్ ..
ఈ రెండు తలల పాముగా క్షుద్రపూజలకు వినియోగిస్తారని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అంతర్జాతీయ స్మగ్లింగ్ చేసే వన్యప్రాణుల్లో ఈ పాము ఒకటన్నారు. రెండ్ సాండ్ బోయా లక్షల రూపాయలకు అమ్ముకుంటారని చెబుతున్నారు. ఈ రకం పాముల్ని రక్షించేందుకు ప్రభుత్వం వణ్యప్రాణి సంరక్షణ చట్టం షెడ్యూల్–4లో దీనిని చేర్చిందని వివరించారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sangareddy, Telangana crime news