హోమ్ /వార్తలు /తెలంగాణ /

Sangareddy: అక్క‌డ సంవ‌త్స‌రానికి ఒకేసారి ప‌శువుల సంత‌.. రూ.ల‌క్ష‌ల్లో ధ‌ర‌లు

Sangareddy: అక్క‌డ సంవ‌త్స‌రానికి ఒకేసారి ప‌శువుల సంత‌.. రూ.ల‌క్ష‌ల్లో ధ‌ర‌లు

పశువుల సంత

పశువుల సంత

Sangareddy | అక్క‌డ సంవత్సరంలో ఒకేసారి ఎద్దుల పశువుల (Cattle) సంత జరుగుతుంది. ఈ సంతకు రక రకాల జాతులకు చెందిన ఎద్దులు వస్తాయి. కొన్ని వేల ఎద్దులు వస్తాయి. ఇక్కడ ప్రత్యేకంగా ఎద్దుల సంత కొనుగోలు తో పాటు మంచి మంచి ఎద్దులను రైతులు కొనుగోలు చేసి ఆ ఉర్సులో ఆకర్షణీయంగా నిలుస్తుంటారు.

ఇంకా చదవండి ...

అక్క‌డ సంవత్సరంలో ఒకేసారి ఎద్దుల పశువుల (Cattle) సంత జరుగుతుంది. ఈ సంతకు రక రకాల జాతులకు చెందిన ఎద్దులు వస్తాయి. కొన్ని వేల ఎద్దులు వస్తాయి. ఇక్కడ ప్రత్యేకంగా ఎద్దుల సంత కొనుగోలు తో పాటు మంచి మంచి ఎద్దులను రైతులు కొనుగోలు చేసి ఆ ఉర్సులో ఆకర్షణీయంగా నిలుస్తుంటారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ శివారులోని ఉర్ఫె షరీఫ్ పీర్ గైట్ సాహెబ్ దర్గా ఆదివారం జనసంద్రంగా మారింది. ఈ ఉత్సవాలు మూడో రోజుల పాటు ఘనంగా కొనసాగుతాయి. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి దర్గాను దర్శించుకుటున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ శివారులో హద్నూర్ గ్రామం నుంచి దర్గా వరకు గంరంను బాజా భజంత్రీలతో తీసుకువచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Telangana: కాంగ్రెస్ ఇస్తేనే తెలంగాణ వ‌చ్చింది.. మోదీ తాజా కామెంట్ల వెనుక‌ బీజేపీ వ్యూహం అదేనా?

రూ.ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు..

ఈ ఉత్సవాలో ప్రత్యేకంగా సంవత్సరం ఒకసారి పశువుల సంత భారీగా జరుగుతుండటంతో రైతులు, వ్యాపారులు, అమ్మకం అందించారు. కొనుగోలుదారులు, సందర్శకులతో దర్గా ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఉత్సవాలకు దియోనీ, జెర్సీ, ఒంగోలు జాతులకు చెందిన పశువులను తీసుకు వచ్చారు. న్యాల్‌క‌ల్‌కు చెందిన స్వర్గీయ అడివప్పు-గిరిజాబాయి, సురేష్ స్మారకార్థం ఆయన కుమారుడు హోతి బస్వరాజ్ మేలు రకం పశువులకు ప్రోత్సాహకాలు ప్రకటించారు.

జత ఎడ్లు రూ.1.75 లక్షలు జాతర ఉత్సవాల్లో భాగంగా జరిగిన పశువుల సంతలో ఒక ఎడ్ల జత రూ.1.75 లక్షలు పలికింది. హుల్టెరకు చెందిన రైతు దావలప్ప తన ఎడ్ల జతకు రూ.1.75లక్షలు, హద్నూర్ గ్రామానికి చెందిన పల్లె అశోక్ రైతు రూ.1.60 లక్షలకు ఎడ్ల జతలను అమ్మారు. ప్రతి ఏటా జాతర ఉత్స దర్గాను దర్శించుకుంటున్న ప్రజలు ఉత్స‌వాల్లో పశువుల సంత నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.


Telangana Politics: ఆ రోజు ఏం జ‌రిగింది.. పార్ల‌మెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం తీరుపై ఎందుకు గొడ‌వ‌!

అన్ని ఏర్పాట్లు పూర్తి..

సంతకు జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రాలకు చెందిన రైతులు, వ్యాపారులు తరలి వచ్చారు. నానాటికి తగ్గిపోతున్న పశు సంపదను పెంపొందించేందుకు కళాకారుడు బస్వరాజు ఆధ్వర్యంలో ఉత్తమ పశుపోషణచారులకు బహుమతులను అందచేస్తారు. ఏటా భారీ ఎత్తున నిర్వహించే జాతరలో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని ఉమ్మడి మెదక్ జిల్లా (Medak Dist) డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకు మార్ అన్నారు. జాతరలో ప్రజలకు ఇబ్బంది. కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సమస్యలను ఎమ్మెల్యే, ఎంపీల దృష్టికి తీసుకువె ళ్లి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తన్వీర్ అహ్మద్, నర్సిం హారెడ్డి, వెంకట్, న్యాల్కల్ పీఏసీఎస్ చైర్మన్ సిద్ధి లింగయ్యస్వామి, టేకూర్, మిర్జాపూర్(ఎన్), న్యాల్కల్ గ్రామాల సర్పంచ్లు అమీర్, మల్లారెడ్డి, శివశంకరయ్యస్వామి, ఎస్సై వినయ్ కమార్, తదితరులు పాల్గొన్నారు.

- కె.వీర‌న్న‌, మెద‌క్‌, న్యూస్‌18

First published:

Tags: Medak Dist, Sangareddy, Telangana

ఉత్తమ కథలు