Home /News /telangana /

SANGAREDDY TEHSILDAR WHO CREATED RECORDS THAT THE SURVIVOR DIED AND TRANSFERRED THE LAND TO ANOTHER PERSON PRV MDK

Land Scam: బతికున్న మనిషి చనిపోయిందని రికార్డులు సృష్టించి.. వేరే వ్యక్తి పేరుపై భూ పట్టా చేసిన తహసీల్దార్​

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) రైతులకు ఎలాంటి సమస్యలు ఉండవని ధరణి  (Dharani)పెట్టింది. కానీ, రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తి పడి  ఇష్టారాజ్య మేలుతున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Sangareddy (Sangareddi), India
    (K. Veeranna, News18, Medak) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) రైతులకు ఎలాంటి సమస్యలు ఉండవని ధరణి  (Dharani)పెట్టింది. కానీ, రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తి పడి  ఇష్టారాజ్య మేలుతున్నారు. సంగారెడ్డిలో బతికి ఉండగానే చనిపోయినట్టు సర్టిఫికెట్ ధ్రువీకరించి ఏకంగా 27 ఎకరాల 34 గుంటలు వేరే వారిపేరుపై పౌతి మార్పు చేశారు ఓ తహసీల్దార్ (Tahsildar). సంగారెడ్డి (Sangareddy) జిల్లా రాయికోడ్ తహసీల్దార్ రాజయ్య (Raikod Tehsildar rajaiah) భూ అక్రమాల బాగోతం ఆలస్యంగా వెలుగు చూసింది. రాయికోడ్ మండలం నాగాన్ పల్లీ గ్రామానికి చెందిన శివమ్మ అనే వృద్ధురాలు బతికుండగానే చనిపోయినట్లు రికార్డులు సృష్టించి ఆమె పేరుపై ఉన్న భూమి (Land) పౌతీ మార్పిడికి పాల్పడ్డాడు తాహసిల్దార్ రాజయ్య.  కరోనా సమయం లో శివమ్మ భర్త హన్మంతు రెడ్డీ మృతి చెందాడు. అతనికి 198 వ సర్వే నంబర్ లో 27 ఎకరాల 34 గంటల భూమి ఉంది. దాంతో ఏప్రిల్ మాసంలో భర్త పేరుపై ఉన్న 27 ఎకరాల 34 గంటల భూమిని భర్త పేరుపై నుంచి తన పేరుపై శివమ్మ రిజిస్ట్రేషన్ చేసుకుంది. ఈ నెల 19 వ తేదీన బతికున్న శివమ్మ ను చనిపోయినట్లు రికార్డ్ సృష్టించారు.
    శివమ్మ (బాధితురాలు)
    వృద్ధురాలు శివమ్మ చనిపోయిందని ధరణి వెబ్ సైట్ లో మార్పులు చేర్పులు చేసి  షేరి అంజమ్మ పై రిజిస్ట్రేషన్ చేసి సర్వే నంబర్ లో పట్ట భూమి కనబడకుండా తహశీల్దార్ సొంత తెలివి ప్రదర్శించాడు. దీంతో అనుమానం తో తహశీల్దార్​ను ఆరా తీసిన శివమ్మకు ఆయన బాగోతం తెలిసిపోయింది. దీంతో తహసిల్దార్ పై జిల్లా కలెక్టర్ కు అలాగే రాయికోడ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ధరణి. తెలంగాణ ప్రభుత్వం భూ ఆక్రమణలు, నకిలీ రిజిస్ట్రేషన్లు ఆపడానికి తగాదాలు జరగకుండా ఉండేందుకు తీసుకొచ్చిన పథకం. అయితే ఈ ధరణి వచ్చినా చాలా ప్రాంతాల్లో అక్రమాలు ఆగడం లేదు.  సర్వే నంబర్లు తప్పుగా నమోదవడం, ఒకరి భూమి మరొకరి సర్వే నంబర్లలో చేరడం, విస్తీర్ణాలలో హెచ్చుతగ్గులు, పాసు పుస్తకాల్లో తప్పులు.. ఇలా అనేక సమస్యలు వారిని వెంటాడుతున్నాయి. వాటిని సరిదిద్దుకునే అవకాశాలు పోర్టల్లో లేకపోవడం, అధికారుల చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం లభించకపోవడం.. తదితర కారణాలతో విసిగివేసారిన బాధితులు ఆందోళన బాటపడుతున్నారు. Asara Pensions: ఇక వారికి కూడా ఆసరా పింఛన్​.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు! కొందరు ఇంకాస్త ముందుకెళ్లి నిరసన తెలిపే క్రమంలో అధికారుల సమక్షంలోనే ఆత్మహత్యా ప్రయత్నాలకు తెగబడుతున్నారు బాధితులు. ఫలితంగా జిల్లా కలెక్టరేట్లలో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణికి అధికారులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. ఏమూల నుంచి ఏ బాధితుడు వచ్చి ఎలాంటి ఆందోళన చేపడతారో.. ఏం అఘాయిత్యానికి పాల్పడతారోనన్న ఆందోళన అక్కడి సిబ్బందిలో కనిపిస్తోంది. సోమవారం మూడు జిల్లాల్లో బాధితులు పెట్రోలు పోసుకునేందుకు ప్రయత్నించారు. గతంలో ఉమ్మడి వరంగల్ , మహబూబ్ నగర్ , కరీంనగర్ , రంగారెడ్డి జిల్లాల్లోనూ ఈ తరహా ఘటనలు జరిగాయి.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Land scam, Sangareddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు