(K.Veeranna,News18,Medak)
రోజు రోజుకు గృహ నిర్మాణ విలువలు పెరుగిపోతున్నాయి. మరోవైపు పురాతన కట్టణాలు, ఇళ్లు, నిర్మాణాల తొలగింపుతో వ్యర్ధాలు పెరుగుతున్నాయి. ఈరెండు సమస్యలకో ఒక్క ఐడియాతో పరిష్కారమార్గం కనుగొన్నారు సంగారెడ్డి(Sangareddy)జిల్లా కేంద్రంలోని తారా డిగ్రీ కాలేజీ (Tara degree college)స్టూడెంట్స్. తార డిగ్రీ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్‌గా పని చేస్తున్న అభిజిత్ (Abhijit)మొదటగా 14 ప్రాజెక్టులను ఎంచుకొని అందులో ప్రస్తుతం పురాతన ఇండ్లను కూల్చి వేస్తున్న నేపథ్యంలో ఆ వేస్టేజ్ ని తీసుకువచ్చి ఆ వేస్టేజ్‌తో మరో బ్రిక్స్ (Bricks)తయారుచేసి కొత్తగా కట్టే నేను ఇంటి నిర్మాణానికి ఉపయోగపడేలా పరిశోధనలు చేసి ఢిల్లీ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.
కూల్చివేసిన వ్యర్దాలతో బ్రిక్స్ ..
కాలేజీకి చెందిన సుమారు 60 మంది బీఎస్సీ విద్యార్థులతో ఈ ప్రాజెక్టు మొదలుపెట్టారు. విద్యార్థులకు ఉపయోగపడేలా పరిశోధనలు నిర్వహిస్తున్నారు. బ్రిక్స్ లో బొగ్గు, బంక మట్టి యాక్టిమేట్ కొబ్బరి బొగ్గు సున్నం లాంటి పదార్థాలు వాడి బ్రిక్స్ వాడుతున్నట్లుగా డాక్టర్ అభిజిత్ న్యూస్ 18 తో తెలిపారు. కూల్చి వేసిన వ్యర్ధాలతో తక్కువ ఖర్చుతో అధిక సామర్థ్యం కలిగిన బ్రిక్స్‌ని తయారు చేస్తూ కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు.
సైన్స్ స్టూడెంట్స్‌తో ప్రయోగం..
తారా డిగ్రీ కాలేజీ కెమిస్ట్రీ లెక్చరర్, స్టూడెంట్స్‌తో తలపెట్టిన ఈ విధమైన ప్రయోగానికి ఐఐటి టెక్నికల్ సహకారంతో అందిస్తుంది. రోజు రోజు అభివృద్ధి చెందుతున్న ఇండియాలో సంవత్సరానికి150 నుండి 250 వరకు పురాతన భవనాలు, కట్టడాలను కూల్చివేస్తున్నారు. ఒకసారి పురాతన ఇంటిని కూల్చి వేసినటు వంటి వ్యర్ధాలను తిరిగి ఉపయోగించుకునేలా పాలసీ డిజైనింగ్ చేయాల్సి ఉంది బ్రిక్స్. కూల్చివేసిన వేస్టేజ్‌ని తక్కువ ధరకు కొనుగోలు చేసి కొద్దిగా మార్పులు చేర్పులు చేసి వాటితో బ్రిక్స్ తయారు చేయడం వల్ల కొత్తగా చేపట్టబోయే ఇంటి నిర్మాణానికి ఎంతగానో ఉపయోగపడతాయని..ఖర్చు తక్కువలో ..నాణ్యమైన ఇటుకలు లభిస్తాయంటున్నారు అధ్యాపకులు, శాస్త్రవేత్త అభిజిత్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sangareddy, Students, Telangana News