(K.Veeranna,News18,Medak)
పెళ్లైన మహిళలు ఇంటికే పరిమితం కాకుండా వాళ్లలో ఉండే సహజ నైపుణ్యానికి పదును పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఆడవాళ్లు స్వశక్తితో ఎదగాలని వారి కాళ్లపై వారే నిలబడే విధంగా ఉపాధి మార్గాలు చూపించేందుకు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు స్టేట్ బ్యాంక్ అధికారులు. సంగారెడ్డి (Sangareddy)జిల్లా కేంద్రంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank of India)గ్రామీణ ఉపాధి పథకం పేరుతో బ్యూటీ పార్లర్ ట్రైనింగ్(Beauty Parlor Training) పూర్తి చేసుకున్న వారిలో సొంతగా బ్యూటీ పార్లర్ పెట్టుకునేందుకు ఆర్ధిక సాయం అందించేందుకు శిక్షణ పూర్తి చేసుకున్న వారిని పరిశీలించారు. శిక్షణలో వాళ్లు నేర్చుకున్న మెళకువలను తెలుసుకున్నారు.
అందాల ప్రపంచంలో అతివలు..
సంగారెడ్డిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివాహిత మహిళలకు చేయూతగా నిలవాలని భావించింది. అందుకోసం గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా సంగారెడ్డి బైపాస్‌లో మేకప్, పెళ్లి కూతురి అలంకారం వంటి వాటితో పాటు బ్యూటీ పార్లర్ కోచింగ్‌ని శిక్షణ ఇచ్చారు. ఇక్కడ ట్రైనింగ్ నేర్చుకున్న మగువలే నవ వధువు లాగా ముస్తాబయ్యారు. 30 రోజులలో బ్యూటీ పార్లర్ గా నేర్చుకుని సొంత షాప్ పెట్టుకుని మరో 10 మంది మహిళలకు నేర్పించి అండగా నిలుస్తామని ఆ మహిళా మణులు న్యూస్ 18 తో చెప్పారు.
ఉపాధి మార్గం చూపేందుకు..
సొంతగా తమ కాళ్లపై తామే నిలబడాలని..ఆర్ధికంగా నిలదొక్కుకోవాలనే ఆలోచనతో ఈ బ్యూటీ పార్లర్ కోచింగ్‌లో శిక్షణ తీసుకున్నామని మహిళలు తెలిపారు. తమ భర్తల ప్రోత్సాహంతో 30రోజుల పాటు మేకప్, పెళ్లి కూతురు అలంకారంలో తర్ఫీదు పొందినట్లుగా తెలిపారు. చాలామంది మహిళలు ఈ గ్రామీణ స్వయం ఉపాధిలో మీరు ఏం నేర్చుకోలేకపోతున్నారని విమర్శలు చేశారని ..ఆ విమర్శలను విని ఇట్లాగైనా సరే బ్యూటీ పార్లర్ గా నేర్చుకోవాలని తపనతో భర్త పై ఆధారపడకుండా మేము కష్టపడి డబ్బు సంపాదించి మరో పదిమందికి ఉపయోగపడతామని అన్నారు.
మేకప్ ట్రైనింగ్ ..
పెళ్లి వేడుకలకు నవవధువు ఎలా తయారవుతుందే అలా ప్రదర్శన చేసి మహిళలకి అందం ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి కింద ఉచితంగా బ్యూటీ పార్లర్ శిక్షణ 30 రోజులపాటు ఇచ్చి వారు షాపు పెట్టుకునే దానికి కూడా ఎస్బీఐ ఆర్థిక సాయం చేస్తుందని ఎస్బీఐ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ తెలిపారు. హిమ బిందు క్రిస్టియన్స్ బ్యూటీ పార్లర్ నేర్చుకుని నవ వధువు అలా తయారు కావాలని ఎన్నో రోజుల నుంచి కలలుకని ఈరోజు బ్యూటీ పార్లర్ ద్వారా తన కోరిక నెరవేరిందని న్యూస్ 18 తో తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sangareddy, Telangana News