హోమ్ /వార్తలు /తెలంగాణ /

Inspirational Story: అద్దాల మేడల్లో ఉండే ఐటీ ఉద్యోగులు పొలంలో ప్రత్యక్షం..ఎందుకొచ్చారో..? ఏం చేశారో తెలుసా..?

Inspirational Story: అద్దాల మేడల్లో ఉండే ఐటీ ఉద్యోగులు పొలంలో ప్రత్యక్షం..ఎందుకొచ్చారో..? ఏం చేశారో తెలుసా..?

it employs

it employs

Inspirational Story: కరోనా లాక్‌డౌన్ నేర్పిన పాఠాలో లేక సినిమాల ప్రభావమో తెలియదు కాని రైతు లేనిదే మనిషి మనుగడ కష్టం అని తెలుసుకుంటున్నారు ఐటీ ఉద్యోగులు. ఎత్తైన అద్దాల మేడల్లో ఏసీ గదుల్లో ..స్పింగ్ కుర్చిలో కూర్చొని ల్యాప్‌ టాప్‌ల్లో చూస్తూ పని చేయాల్సిన వాళ్లంతా మట్టిలో ఉన్న మహత్యం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Sangareddy (Sangareddi), India

(K.Veeranna,News18,Medak)

అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించినప్పటుడే దేశం అభివృద్ధి చెందుతుందని నేటి యువత అర్ధం ఇప్పుడిప్పుడే చేసుకుంటున్నారు. కరోనా లాక్‌డౌన్(Corona Lockdown)నేర్పిన పాఠాలో లేక సినిమాల ప్రభావమో తెలియదు కాని రైతు లేనిదే మనిషి మనుగడ కష్టం అని తెలుసుకుంటున్నారు ఐటీ ఉద్యోగులు(IT employees). ఎత్తైన అద్దాల మేడల్లో ఏసీ గదుల్లో ..స్పింగ్ కుర్చిలో కూర్చొని ల్యాప్‌ టాప్‌(Laptop)ల్లో చూస్తూ పని చేయాల్సిన వాళ్లంతా మట్టిలో ఉన్న మహత్యం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేశారు. సాగు చేయడం ఎంత కష్టతో..ఇష్టంతో చేస్తే దాని వల్ల కలిగే ఫీలింగ్ ఏంటో ప్రత్యక్షంగా అనుభవించాలని వరి చేనులోకి అడుగుపెట్టి నాట్లు వేశారు. సంగారెడ్డి(Sangareddy)జిల్లాలో వ్యవసాయ కూలీలుగా మారిన ఐటీ ఉద్యోగులను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు.

తెలంగాణలో ఆ అసెంబ్లీ సీటు యమా హాట్ గురూ!..ఎందుకో తెలుసా?

వరినాట్లు వేసిన ఐటీ ఉద్యోగులు..

సంగారెడ్డి జిల్లా  తెల్లాపూర్‌ను ఐటీ ఉద్యోగులు సందర్శించారు. వీకెండ్‌ విజిట్‌కు వచ్చిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అదే సమయంలో తెల్లాపూర్‌కు చెందిన రైతు ఆంజనేయులు పొలంలో వరినాట్లకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అంతే గ్రామంలోకి వచ్చిన ఐటీ ఉద్యోగులు స్వయంగా పొలంలోకి దిగారు. వరి నాట్లు ఎలా వేయాలో ఒకసారి చూసి నాట్లు వేయడం మొదలుపెట్టారు. ఇది ఫోటోల కోసమే ..ప్రచారం కోసమో కాదని రైతన్న పంట పండించడానికి పడుతున్న కష్టం ఎలా ఉంటుందో స్వయంగా తెలుసుకోవడానికే తెల్లాపూర్ వచ్చామని..అందులో భాగంగానే వరినాట్లు వేశామని ఐటీ ఉద్యోగులు చెప్పారు.

కష్టమంతా రైతులదే..

కోవిడ్ సమయంలో ప్రపంచం దేశాలు స్తంభించిపోయినా...దేశాల్లో అందరూ ఇంటికే పరిమితమైనప్పటికి రైతు మాత్రం సాగు చేయడం వల్లే ప్రజలు కడుపు నిండా అన్నం తినగలిగారని సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సుచిత్ర తెలిపారు. వ్యవసాయం చేయడంతో పాటు కూరగాయలు పండించడం వల్లనే అందరం ఆరోగ్యంగా ఉండగలిగామన్నారు. రైతుల కష్టాలను చూసిన ఐటి ఉద్యోగులు వరి నాట్లు వేయడానికైనికి పొలంలో పని చేయాలనిపించిందన్నారు.

సాగు చేయడం ఎంతో కష్టం..

వ్యవసాయం మాటల్లో చెప్పుకున్నంత సులువు కాదని..రైతులు ఎంతో కష్టపడితేనే దేశ ప్రజలు కూర్చొని భోజనం చేస్తున్నారని వాపోయారు. పండించిన పంటను తినడం చాలా ఈజీ  కానీ పంటను పండించడం ఎంత కష్టంతో కూడుకున్న పనో ఒక్క రైతుకే తెలుస్తుందన్నారు.అందుకే తాము కూడా వీలైనంత వరకు వరినాట్లు వేయడానికి కృషి చేస్తామని చెప్పుకొచ్చారు. పెద్ద చదువులు చదివి, కార్పొరేట్ ఆఫీసుల్లో డ్రెస్‌లు నలగకుండా పనిచేస్తున్న యువతి,యువకులు వచ్చి వరినాట్లు వేయడం చూసి గ్రామస్తులు, పొలం యజమాని ముచ్చటపడ్డారు.

బస్సు రన్నింగ్ లో ఉండగా డ్రైవర్ కు గుండెపోటు.. తృటిలో తప్పిన ప్రమాదం..

వరినాట్లు వేయడం ఆనందంగా ఉంది..

రైతు కష్టాలు తెలుసుకోవాలనే తాపత్రయం, వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి పొలం పనులు చేయాలన్న తన ఆలోచనను తోటి మిత్రులకు తెలపడంతో వారు కూడా ఎంతో ఉత్సాహంతో ముందుకొచ్చారని అందరం కలిసే వరినాట్లు వేయడానికి తెల్లాపూర్ వచ్చామని మరో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఎంతో సంతోషంగా చెప్పాడు. వరినాట్లు వేయడం, రైతు పనుల్లో పాలుపంచుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు ఐటీ ఉద్యోగులు.

First published:

Tags: Agriculture, Sangareddy, Telangana News