హోమ్ /వార్తలు /తెలంగాణ /

Maha Shivratri:కేతకి సంగమేశ్వరాలయంలో బ్రహ్మోత్సవాలు .. దక్షిణి కాశీగా పిలిచే శైవక్షేత్రంలో భక్తుల పూజలు

Maha Shivratri:కేతకి సంగమేశ్వరాలయంలో బ్రహ్మోత్సవాలు .. దక్షిణి కాశీగా పిలిచే శైవక్షేత్రంలో భక్తుల పూజలు

sangameshwara temple

sangameshwara temple

Maha Shivratri:సంగారెడ్డి జిల్లాలోని అన్నీ శైవక్షేత్రాలు, శివాలయాల్లో మహాశివరాత్రి శోభ ఉట్టిపడుతోంది. జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచిన కేతకి సంగమేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Sangareddy (Sangareddi), India

(K.Veeranna,News18,Medak)

ఆలయాలకు మహాశివరాత్రి శోభ సంతరించుకుంది. సంగారెడ్డి (Sangareddy)జిల్లాలోని అన్నీ శైవక్షేత్రాలు, శివాలయాల్లో మహాశివరాత్రి (Maha shivratri)శోభ ఉట్టిపడుతోంది. మహాశివుడికి లింగాభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు వస్తున్నారు. ఈనేపధ్యంలోనే జిల్లాలోని అన్నీ దేవాలయాలను ముస్తాబు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచిన శివాలయం కేతకి సంగమేశ్వర ఆలయం. ప్రస్తుతం ఈ ఆలయం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. మహాశివరాత్రిని పురస్కరించుకొని బుధవారం నుంచి ప్రారంభం అయ్యాయి వేడుకలకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక(Karnataka), మహారాష్ట్ర(Maharashtra), ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మహాశివుడ్ని దర్శించుకుంటారు.

దక్షిణ కాశీగా పేరు ..

సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంగం మండల కేంద్రంలో మంజీర నది తీరంలో వెలిసిన అత్యంత పురాతన పుణ్యక్షేత్రమే కేతకి సంగేమశ్వర దేవాలయం. దక్షిణ కాశీగా పిలవబడే ఈ ఆలయంలో శివుడికి మొదటగా బ్రహ్మదేవుడే మొగలి పూలతో పూజ చేసినట్లుగా ఇక్కడి చరిత్ర చెబుతోంది. అందుకే ఈ ఆలయానికి కేతకి సంగమేశ్వర ఆలయంగా భక్తులు పిలుస్తారు. ఏటా ఇక్కడ మహాశివరాత్రికి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. కరోనా తర్వాత ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు చకచక ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మూడేళ్ల తర్వాత ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో ఆలయానికి భక్తులు పోటెత్తనున్నారు.

శివరాత్రికి ముస్తాబు..

ఆలయ ఉత్సవాల నిర్వహణపై ఇప్పటికే కలెక్టర్ డా. శరత్, ఎమ్మెల్యే కె. మాణిక్ రావు, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంస్ చైర్మన్ ఎం.శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ అన్ని శాఖల అధికారులతో జాతర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించి భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు.  ఆలయంతో పాటు పరిసరాల్లో తాగు నీరు, క్యూలైన్లు, స్నానాలకు ప్రత్యేక ఏర్పాట్లు, పార్కింగ్, భారీకేడ్లు ఆరోగ్యం పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆలయానికి రంగులు, చలువ పందిళ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జహీరాబాద్ డీఎస్పీ రఘు, రూరల్ సీఐ ఎన్. వెంకటేశ్, ఎస్ఐ రాజేందర్రెడ్డిల ఆధ్వర్యంలో   బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

Maha Shivratri 2023: ఆ గుడిలో ఏటా పెరుగుతున్న శివలింగం..శివాలయంలో జోలెపట్టి వేడుకుంటే ఎంతటి కష్టమైన ఇట్టే మాయం

రెండేళ్లుగా ఉత్సవాలు లేవు..

కోవిడ్ నేపథ్యంలో గత రెండేళ్ల పాటు ఆలయ ఆవరణలోని అమృత గుండంలో భక్తుల స్నానాలకు అనుమతి ఇవ్వలేదు. కొద్ది నెలల క్రితమే అమృత గుండంలో స్నానాలు చేసేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో స్నానాలతో పాటు జలలింగానికి పూజలు చేస్తున్నారు. పల్లకీ సేవా భజనలు ఉంటాయి. 18న మహాశివ రాత్రి, అగ్నిప్రతిష్ఠ, గణపతిహోమం, స్వామి వారికి అభిషేకం, రాత్రి లింగోద్భవ సమయంలో మహ న్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, ఋత్విక్క రణ, పల్లికీ సేవ భజనలు ఉంటాయి.

23తో బ్రహ్మోత్సవాలు ముగింపు..

19న స్వామివారికి, రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, రుద్రస్వాహకార హోమం, నవ గ్రహశాంతి హోమం సాయంత్రం 5.30 గంటలకు నందివాహన సేవ, రాత్రి 12గంటలకు అగ్నిగుండం పూజ, అగ్ని ప్రతిష్ఠ ఉంటుంది.వారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, రుద్రస్వాహకార హోమం, సాయంత్రం 5.30 గం టలకు పార్వతీపరమేశ్వరుల కల్యాణ మహోత్సవం రాత్రి 10.30 గంటలకు స్వామి వారి విమాన రథోత్సవం, పల్లకీసేవ నిర్వహిస్తారు. కల్యాణ మహోత్సవంలో పాల్గొనే దంపతులు ముందుగా ఆలయ అధికారులను సంప్రదించి రూ.1,116 చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. 21, 22 తేదీల్లో నిత్య పూజ లతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వ హిస్తారు. చివరి రోజు 23న లక్ష బిల్వార్చన, అన్న దానం, పల్లకీ సేవా తదితర కార్యక్రమాలతో ఉత్స వాలు ముగుస్తాయని అధికారులు తెలిపారు.

First published:

Tags: Mahashivratri, Sangareddy, Telangana News

ఉత్తమ కథలు