(K.Veeranna,News18,Medak)
ఏడాది పొడవున తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల జాతరలు, ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఉత్సవాలు, జాతర నిర్వహిస్తూ ఉంటారు. కాని పశువుల కోసం ప్రత్యేకంగా సంగారెడ్డి(Sangareddy)జిల్లాలో ఉత్సవాలు (Cattle festivals)నిర్వహిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈది కూడా సాధారణ జాతరను పోలినట్లుగా సందడిగా ఉంది. ఈ పశువుల ఉత్సవాల్ని తిలకించేందుకు జాతరలో పశువుల్ని కొనుగోలు చేసేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక(Karnataka), మహారాష్ట్ర(Maharashtra)తో పాటు వేర్వేరు ప్రాంతాల నుంచి జనం తరలివచ్చారు.
పశువుల ఉత్సవాలు..
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలో పశువుల జాతర జరుగుతోంది. న్యాల్కల్ గ్రామ శివారులోని ఉర్సే షరీఫ్ పీరైట్ సాహెబ్ దర్గా రైతులు, ప్రజలతో కిటకిటలాడింది. ఎందుకంటే ఇక్కడ ఏడాదికి ఒకసారి పశువుల కోసం ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇందులో పశువులు విక్రయాలు చేయడానికి కర్ణాటక మహారాష్ట్ర తోపాటు చుట్టుపక్కల ప్రాంత వాసులు వచ్చి తమకు నచ్చిన ఎద్దులను విక్రయిస్తారు. కొనుగోలు చేస్తుంటారు. జత ఎద్దులను లక్షల్లో విక్రయాలు చేసి ఆ జతలకు కలర్ ఫుల్ గా బెలూన్స్ కట్టి ఊర్లోకి తీసుకెళ్తారు. జాతర ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన సోమవారం వివిధ ప్రాం తాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జనం దర్గాను దర్శించుకున్నారు.
పెద్ద సంఖ్యలో వచ్చి జనం..
ఉదయం హద్నూర్ గ్రామం నుంచి దర్గా వరకు గంధంను బాజాభజంత్రీలతో తీసువచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో జాతర ప్రాంగణం కిక్కిరిసిపోయాయింది. జాతరలో వేర్వేరు జాతులకు చెందిన గేదెలు, ఆవుల ధరలు లక్షలు పలికాయి. ఎడ్లు ఉర్సును పురస్కరించుకొని నిర్వహించే పశువుల సంత రైతులు, వ్యాపారులు, పశుపోషకులు, కొనుగోలుదారులు, సందర్శకులతో జాతరను తరలపించింది.
జోరుగా పశువుల క్రయ,విక్రయాలు..
పశువుల క్రయ, విక్రయాలు జోరుగా సాగాయి. ఉత్సవాలకు దియోనీ, చెర ఒంగోలుతో పాటు మరికొన్ని జాతులకు చెందిన పశువులు వచ్చాయి.ఉత్సవాలకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు దర్గాను దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. న్యాల్కల్ చెందిన స్వర్గీయ అప్ప గిరిజాబాయి మనుమడు సురేశ్ స్మారకార్థం అతని కుమారుడు ప్రముఖ కళాకారుడు హోతి బస్వరాజ్ సొంత డబ్బులు వెచ్చించి మేలు రకం పశువులకు ప్రోత్సాహాకాలు అందజేశారు. జాతర ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా జాతర ఉత్సవాల్లో పశువుల సంత నిర్వహించడం అనవాయితీగా వస్తుంది.
భక్తుల కోసం భారీ ఏర్పాట్లు..
ఉత్సవాలకు వచ్చిన ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు .ఉత్తమ పోషకులకు బహుమతులు అందజేశారు. నానాటికి తగ్గిపోతున్న పశు సంపదను పెంపొం దించేందుకు ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ప్రముఖ కళాకారుడు బస్వరాజు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sangareddy, Telangana