హోమ్ /వార్తలు /తెలంగాణ /

OMG: మత్తెక్కించే చాక్లెట్లు .. కేవలం అక్కడ మాత్రమే లభించును

OMG: మత్తెక్కించే చాక్లెట్లు .. కేవలం అక్కడ మాత్రమే లభించును

Drugs Chocolates

Drugs Chocolates

Ganja Chocolates:తెలంగాణలో గంజాయి చాక్లెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ గంజాయి చాక్లెట్లను ఒడిషా, బీహార్ రాష్ట్రం కడుపులో ఆయాసం లేదా అరుగుదల సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్లు ఉపయోగిస్తున్నట్లుగా తెలుస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Sangareddy (Sangareddi), India

K.Veeranna,News18,Medak)

చాక్లెట్లు (Chocolates)ఎక్కడైనా దొరుకుతాయి. కాని ఆ చాక్లెట్లు మాత్రం ఇప్పుడు సంగారెడ్డి (Sangareddy )జిల్లాలోనే ఎక్కువగా అమ్ముతున్నారు. అయితే అవి మార్కెట్‌లో రూపాయి, పది రూపాయలకు దొరికే చాక్లెట్లు కాదు. అందుకే గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నట్లుగా తెలుసుకున్న పోలీసులు(Police) ముగ్గుర్ని పట్టుకున్నారు. వాళ్లు విక్రయిస్తున్న చాక్లెట్ల ప్రత్యేకత ఏంటో .. వాటిని ఎక్కడి నుంచి తెస్తున్నారో కనుగొని కేసు నమోదు చేశారు. ఆ చాక్లెట్లు తినడం వల్ల కలిగే నష్టం తెలుసుకున్న పోలీసులు నిందితుల్ని కటకటాల వెనక్కి పంపారు.

Friendship: చనిపోయిన ఫ్రెండ్ కోసం ఆ స్నేహితులు ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు

చాక్లెట్ల రూపంలో గంజాయి..

తెలంగాణలో గంజాయి చాక్లెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ గంజాయి చాక్లెట్లను ఒడిషా, బీహార్ రాష్ట్రం కడుపులో ఆయాసం లేదా అరుగుదల సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్లు ఉపయోగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నిషేదిత గంజాయి చాక్లెట్లకు భారీగా డిమాండ్ ఉండటంతో అక్కడి నుంచి సంగారెడ్డి జిల్లాలోని పరిశ్రమల ప్రాంతమైన పాశమైలారం, ఇస్నాపూర్ ప్రాంతాలలో జోరుగా విక్రయిస్తున్నారు. ఈ గంజాయి చాక్లెట్ల దందా నడుస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు ఓ ముఠాపై కన్నేసి ఉంచారు.

బిహార్, ఒడిషా నుంచి దిగుమతి..

ఒడిశా నుంచి గంజాయి చాక్లెట్లను తీసుకొచ్చి సంగారెడ్డి జిల్లాలో విక్రయిస్తున్న ముగ్గురిని పట్టుకున్నారు ఎక్సైజ్‌శాఖ పోలీసులు. నిందితుల నుంచి 271 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లుగా  పటాన్‌చెరు ఎక్సైజ్ సీఐ సీతా రామిరెడ్డి తెలిపారు. పటాన్ చెరు మండల పరిధి ఇస్నాపూర్, పాశమైలారంలో గంజాయి చాక్లెట్లు విక్రయి విశ్వసనీయ సమాచారం అందడంతో మూడు పాన్‌షాపులపై దాడులు నిర్వహించారు.

ముగ్గురు అరెస్ట్ ..

ఒడిశా నుంచి బతుకుదె రువు కోసం వచ్చి పాన్ షాపు నిర్వహిస్తున మేష్ దాస్, రంజితబాద్ర, బ్రాజ మోహనాపాత్రను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 271 గంజాయి (చార్మినార్ గోల్డ్ మునక్క అనే బ్రాండ్) చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి చాక్లెట్ల ముఠాను పట్టుకునేందుకు చేపట్టిన ఎక్సైజ్‌ దాడుల్లో సీఐలు, ఎస్‌ఐలతో పాటు పోలీసులు పాల్గొన్నారు. ఇండస్ట్రీ ఏరియాలో ఒడిషా, బీహార్ కార్మికులు ఎక్కువగా ఉండటంతో వాళ్లకు అమ్మడానికే ఈ నిషేధిత చాక్లెట్లు తెచ్చినట్లుగా పోలీసులు రాబట్టారు.

Revanth Reddy: కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి మాట వింటుందా ? ఆ జాబితా ఇప్పట్లో ఉంటుందా ?

271చాక్లెట్లు స్వాధీనం...

ఫ్యాక్టరీలు, పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులకు ఈ గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నారు. వీటి కోసం ప్రత్యేక కోడ్‌ని ఏర్పాటు చేసుకున్నారు. పరిశ్రమలే కాదు ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుతున్న స్టూడెంట్స్‌కి కూడా వీటిని అంటగడుతున్నట్లుగా తెలుస్తోంది.

First published:

Tags: Ganja smuggling, Sangareddy, Telangana News

ఉత్తమ కథలు