Home /News /telangana /

SANGAREDDY FARMER LEFT THE VILLAGE AFTER THE BANK STAFF AUCTIONED OFF HIS ASSETS DUE TO NON PAYMENT OF LOAN FOR CROP CULTIVATION MDK PRV

Farmer leaves Village: ఆ రైతు ఇంట్లో ‘‘సర్కారు వారి పాట’’.. కంటనీరుతో ఊరు విడిచి వెళ్లిన అన్నదాత కుటుంబం

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక ఓ రైతు కుమిలిపోయాడు. మరోవైపు అధికారుల వేధింపులు ఎక్కువవడం, రుణం తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఆ రైతు కుటుంబం బతుకుదెరువు కోసం పట్నం పయనమైంది.

    మహేష్ బాబు సినిమాలంటే.. ఓ సోషల్ మెసేజ్ గ్యారంటీ అనే మార్క్ ఉంది. శ్రీమంతుడు, మహర్షి,సరిలేరు నీకెవ్వరూ,భరత్ అనే నేను.. ఇలా ఏ సినిమా చేసిన సొసైటీకి టాలీవుడ్ ప్రిన్స్ ఓ మెసేజ్ ఇస్తున్నాడు. తాజాగా సర్కారు వారి పాట కూడా అలాంటి కాన్సెఫ్ట్ తోనే వచ్చింది. ఓ మిడిల్ క్లాస్ కుటుంబం అప్పు తీసుకుంటే.. దాన్ని ఎంత బాధ్యతగా తీర్చుతుంది... ఆ అప్పు తీర్చకుంటే పరువు కోసం తాపత్రయ పడతాడ. ఇలాంటి ఘటనే ఒకటి సంగారెడ్డిలో జిల్లాలో చోటుచేసుకుంది. బ్యాంకులో తీసుకున్న అప్పు చెల్లించలేక ఓ రైతు (farmer) కుమిలిపోయాడు. మరోవైపు అధికారుల వేధింపులు ఎక్కువవడం, రుణం తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఆ రైతు కుటుంబం బతుకుదెరువు కోసం  హైదరాబాద్​కు దగ్గరగా ఉంటే పటాన్‌చెరువు శివారు ప్రాంతానికి పయనమైంది. ఈ సంఘటన శుక్రవారం సంగారెడ్డి (Sangareddy) జిల్లా అందోల్‌ మండల పరిధి కంసాన్‌పల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

    రైతు ఆశిరెడ్డిగారి శంకర్‌ రెడ్డి తెలిపిన ప్రకారం మండల పరిధిలోని కన్‌సాన్‌పల్లి గ్రామంలో తనకు 3.31 ఎకరాల పొలం ఉంది. తన పొలంలో బోరు మోటర్, పైపులైన్‌ ఏర్పాటు కోసం 2016లో జోగిపేట కోఆపరేటివ్‌ బ్యాంకులో (Jogipeta Cooperative Bank) రూ.80 వేల రుణం తీసుకున్నాడు. పంట దిగుబడులు రాకపోవడం, ఇతరుల పొలాలను కౌలుకు తీసుకుని సాగుచేసినా దిగుబడులు రాలేదు. దీంతో అప్పు తీర్చే మార్గం కనిపించలేదు. బ్యాంకు అధికారులు ఒత్తిడి చేయడంతో మరోచోట అప్పు చేసి రూ.40 వేలు చెల్లించాడు. ప్రభుత్వ రుణమాఫీ చేస్తుందని ఆశగా ఎదురుచూసినా లాభం లేకుండా పోయింది. చేసిన అప్పు రూ.1.42 లక్షలకు చేరింది.



    ఈనెల 23వ తేదీన గ్రామంలో భూమి వేలం..

    అప్పులు తీర్చడం కోసం ట్రాక్టర్‌ కూడా అమ్మేశాడు. ప్రస్తుతం వేసిన మొక్కజొన్న కూడా చేతికి రాకుండా పోయింది. బ్యాంకు అధికారులు పదే పదే ఇంటి చుట్టూ తిరుగుతూ నోటీసులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈనెల 23వ తేదీన గ్రామంలో భూమి వేలం వేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. గ్రామంలో బకాయి ఉన్నట్లు పోస్టర్లు అంటించారు. ఒకవైపు అవమానం, మరోవైపు అప్పు తీర్చే మార్గం లేక భార్యాపిల్లలకు నచ్చజెప్పి ఊరు విడిచివెళ్లిపోయాడు.

    ఊరు విడిచి వెళుతున్న రైతు కుటుంబం


    నిబంధనల ప్రకారమే..

    కంసాన్పల్లి గ్రామానికి చెందిన రైతు శంకర్ రెడ్డి మోటారు కొను గోలు కోసం బోరు వేయించేందుకు రూ.80 వేలు 2016లో తీసుకు న్నాడు. చాలాసార్లు గ్రామానికి వెళ్లి నోటీసులు ఇచ్చినా స్పందించ లేదు. ఒకసారి రూ.40 వేలు చెల్లించాడు. ఇంకా రూ.1.12 లక్షలు బకాయి ఉంది. ఈనెల 23వ తేదీన ఆయన భూమిని వేలం వేస్తు న్నట్లు ప్రకటన కూడా ఇచ్చాం. ఇందులో 70 నుంచి 80 శాతం చెలిస్తే కొంత సమయం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్పాం. పాత బకాయిలు పేరుకుపోవడంతో కొత్త రుణాలు ఇవ్వలేకపోతున్నాం. నిబంధనల ప్రకారమే రైతుకు నోటీసులు జారీ చేశాం. డీసీసీబీ బ్యాంకు మేనేజర్ రాజు జోగిపేట
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Farmer, Sangareddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు