Home /News /telangana /

SANDAL SHOPKEEPER AT THE VEMULAWADA TEMPLE SOLD DEVOTEES SLIPPERS FOR LIQUOR SNR KNR

Vemulawada : గుడిలోకి వెళ్లి వచ్చేలోపే చెప్పులమ్ముకున్న కాంట్రాక్టర్ ..భక్తులు ఏం చేశారంటే

(భక్తుల చెప్పులు మాయం)

(భక్తుల చెప్పులు మాయం)

Telangana: వేములవాడ రాజన్న టెంపుల్‌ ప్రాంగణంలో భద్రపరిచమని భక్తులు ఇచ్చిన చెప్పులను అమ్ముకొని మద్యం తాగాడు పాదరక్షాల షాపు కాంట్రాక్టర్. దర్శనానంతరం చెప్పులు అడిగితే మద్యం మత్తులో పొంతన లేని సమాధానం ఇచ్చాడు. ఆగ్రహించిన భక్తులు అతడ్ని చితకబాదారు.

ఇంకా చదవండి ...
    (P.Srinivas,New18,Karimnagar)
    భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ఆలయాల దగ్గర తప్పుడు పనులు చేయకూడదనే ఇంగితజ్ఞానాన్ని సైతం మర్చిపోతున్నారు. ఎక్కడెక్కడి నుంచో దైవదర్శనం కోసం వచ్చే భక్తులకు ఆలయ పరిసరాల్లో ఉండే కాంట్రాక్టర్లు, వ్యాపారులు శఠగోపం పెడుతున్నారు. ఇంత జరుగుతుంటే అన్నీంటిని దగ్గరుండి పర్యవేక్షించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. రాజన్నసిరిసిల్ల ( Rajannasiricilla)జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ(Vemulawada)శ్రీరాజరాజేశ్వరస్వామి(Sri Rajarajeswaraswamy)ఆలయ ప్రాంగణంలో భక్తులు అసహనాన్ని పరీక్షిస్తున్నారు అక్కడి వ్యాపారులు, ఆలయ సిబ్బంది.

    ఛీ దరిద్రుడా..
    వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు నిత్యం వేలాదిగా తరలివస్తారు. సేలవు దినాలు కారాణంగా శని, ఆదివారాల్లో భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. భక్తి, విశ్వాసం, నమ్మకంతో వేములవాడ రాజన్న సన్నిధికి వచ్చే భక్తుల పాదరక్షాలు విడిచి ఆలయంలోకి వెళ్లాలి. అందుకోసం చెప్పులు భద్రపరుచుకునేందుకు ఆలయ ప్రాంగణంలో పాదరక్షాలు భద్రపరిచేందుకు ఓ కాంట్రాక్ట్‌ షాప్‌ని ఏర్పాటు చేశారు. ఆ చెప్పులు భద్రపరిచే కాంట్రాక్టర్ తప్పుడు పని చేసి బుక్కయ్యాడు. ఆలయంలోనికి వెళ్లే ముందు భక్తులు భద్రపరచమని చెప్పులు అప్పగించి వెళితే వాటిని అమ్ముకొని మద్యం తాగాడు. భక్తులు దర్శనం చేసుకొని తిరిగి వచ్చి చెప్పులు అడిగితే లేవని..ఇక్కడే పెట్టాను ఏమైపోయాయో తెలియదంటూ మద్యం మత్తులో ఊగిపోతూ సమాధానం ఇచ్చాడు. చెప్పుల స్టాండ్ చూసుకునే కాంట్రాక్టర్ వ్యవహారంతో భక్తులు తీవ్ర ఆగ్రహానికి గురై గట్టిన నిలదీశారు. మద్యం తాగడానికి డబ్బుల కోసమే అమ్ముకున్నట్లుగా తాగిన మైకంలో నిజం అంగీకరించాడు.

    చెప్పులు అమ్ముకుంది అందుకా..
    దేవాలయానికి వచ్చే భక్తుల వస్తువులను భద్రపరిచి తిరిగి అప్పగించాలనే నిబంధనలతో నమ్మకమైన వ్యక్తులకు ఇలాంటి కాంట్రాక్ట్‌లు అప్పగిస్తారు. ఎందుకంటే ఆలయానికి వచ్చే భక్తుల వస్తువులు పోయినా, ఏదైనా అసౌకర్యం కలిగిన అది దేవాలయ పాలకమండలికి చెడ్డ పేరు వస్తుందనే భావనతో నమ్మకస్తులకు ఇలాంటి కాంట్రాక్ట్‌లు అప్పగిస్తారు. కాని వేములవాడలో మాత్రం రాజన్న సన్నిధిలో ఉన్న చెప్పులు భద్రపరుచు కాంట్రాక్టర్‌తో పాటు అతని షాపులో పనిచేస్తున్న సిబ్బంది భక్తుల వేసుకొచ్చే కొత్త చెప్పులను 50, 100 రూపాయలకు అమ్ముకోవడంపై భక్తులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. కొత్త చెప్పులు అమ్ముకొని మద్యం తాగిన కాంట్రాక్టర్‌ని భక్తులు చొక్కా పట్టుకొని నిలదీశారు. పొంతన లేని సమాధానం చెప్పడంతో చితకబాదారు.

    చోద్యం చూస్తున్న అధికారులు..
    ఆలయ ప్రాంగణం, పరిసరాల్లో మద్యం తాగకూడదు, అమ్మకూడదు..అలాంటి వ్యక్తులకు ప్రవేశం కల్పించకూడదనే నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికి స్వయంగా పాదరక్షాలు భద్రపరిచే కాంట్రాక్టర్‌ మద్యం తాగి స్వామివారి సన్నిధిలో భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంటే ఆలయ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు భక్తులు. ఇలాంటి వ్యక్తులకు ఎలా కాంట్రాక్ట్ అప్పగిస్తామని మండిపడుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులు సెల్‌ఫోన్‌, బ్యాగ్స్, చెప్పులు ఇలాంటి వాటిని భద్రపరిచే బాధ్యతను మంచి వ్యక్తులకు అప్పగించాలని ఇలాంటి తాగుబోతులు, తిరుగుబోతులను ఆలయ పరిసరాల్లోకి రాకుండా స్వామివారి పవిత్రతను కాపాడాలని సూచిస్తున్నారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Telangana, Temple, Vemulawada

    తదుపరి వార్తలు