Home /News /telangana /

SAMMKKA JATARA SPECIAL ARRANGEMENTS FOR SINGARENI LABOUR VRY ADB

Adilabad : అక్కడి కార్మికుల కోసం ప్రత్యేక సమ్మక్క జాతర.. ఎందుకంటే..

ఆదిలాబాద్ లో సమ్మక్క జాతర

ఆదిలాబాద్ లో సమ్మక్క జాతర

Adilabad : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సింగరేణి ప్రాంతం సమ్మక్క సారక్క జాతరకు ముస్తాబవుతోంది. వనదేవతలు కొలువుదీరేందుకు గద్దెలను కూడా సిద్దం చేశారు. సింగరేణి కార్మికుల సౌకర్యార్థం ఇక్కడ ప్రత్యేకంగా జాతర నిర్వహిస్తున్నారు..

    (  ఆదిలాబాద్, కట్టా లేనిన్, న్యూస్ 18 తెలుగు )

    ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సింగరేణి ప్రాంతం సమ్మక్క సారక్క జాతరకు ముస్తాబవుతోంది. వనదేవతలు కొలువుదీరేందుకు గద్దెలను కూడా సిద్దం చేశారు. అయితే మేడారంలో సమ్మక్క సారక్క జాతరకు సింగరేణి ప్రాంతంలో ఏర్పాట్లు చేయడం ఏమిటనే అనుమానం కలుగకమానదు. కాని ఇది నిజం. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారంలో జరిగే సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళలేని భక్తుల కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సింగరేణి ప్రాంతాలైన మంచిర్యాల, రామకృష్ణాపూర్, చెన్నూరు, బెల్లంపల్లి, కాసిపేట తోపాటు లక్షేట్టిపేట, నెన్నెల ప్రాంతాల్లో మిని మేడారం జాతర ఉత్సవాలను గిరిజన సంప్రదాయం ప్రకారం నిర్వహిస్తారు. సింగరేణి యాజమాన్యం, గ్రామ కమిటీలు ఈ ఉత్సవాలకు ఏర్పాట్లను చేస్తున్నాయి.

    ఈ నెల 16వ తేదీ నుండి 19వ తేదీ వరకు మూడురోజులపాటు మేడారంలో జాతర జరుగనున్నవిషయం తెలిసిందే. అయితే అదే రోజుల్లో ఇక్కడ కూడా జాతర ఉత్సవాలు జరుగుతాయి. ఇదిలా ఉంటే సింగరేణి కార్మికులు మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళుతుండటంతో ఆర్థిక సంవత్సరం చివరి రెండు నెలల కాలంలో సంస్థ బొగ్గు ఉత్పత్తి లక్ష్యం మీద ప్రభావం పడే అవకాశం ఉంది. జాతర కేవలం మూడు రోజులే అయినప్పటికి జాతర ప్రారంభానికి కొన్ని రోజుల ముందు నుండే కార్మిక కుటుంబాలు వివిధ ప్రదేశాల్లో ఉన్న దేవాలయాలను సందర్శించడం ఆనవాయితీ. ఇలా కార్మికులంతా దైవ దర్శనానికి వెళితే కార్మికుల గైర్హాజరు బొగ్గు ఉత్పత్తి పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

    KTR on CM KCR : ఢిల్లీపై సీఎం పోరాటం.. మంత్రి కేటీఆర్ ఎమన్నారంటే..

    ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని  సింగరేణి సంస్థ 1988 నుండి మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని పాలవాగు ఒడ్డున, 1994 నుండి శ్రీరాంపూర్ ఏరియాలోని సిసిసిఓని ముక్కిడి పోచమ్మ తల్లి ఆలయ ఆవరణలో సమ్మక్క సారక్క జాతరను నిర్వహిస్తోంది. ఇక్కడికి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు. మరోవైపు మంచిర్యాల లోని గోదావరి నది పక్కన 2002 నుండి ఈ సమ్మక్క సారక్క ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. అంతకుముందు ఇక్కడి భక్తులు గోదావరి నదికి అవతలి ఒడ్డున ఉన్న పెద్దపల్లి జిల్లా గోలివాడ గ్రామంలో జరిగే సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళేవారు. ప్రస్తుతం గోదావరి నదికి ఇవతలివైపు మంచిర్యలలోనే నిర్వహిస్తుండటంతో భక్తులు ఇక్కడికే వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు.

    Bhdradri Khothagudem : పెళ్లి ప్రయత్నాల్లో కానిస్టేబుల్... ఇంతలోనే తుపాకి మిస్‌ ఫైర్‌

    పవిత్ర గోదావరి నది ఒడ్డునే ఈ ఉత్సవాలు జగుతుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రస్తుతం అమ్మవారి గద్దెలు ఉన్నచోట నీరు ఉండటంతో నది ఒడ్డున కొత్తగా మళ్లీ గద్దెలను కడుతున్నారు. బస్సు, రైల్వే సౌకర్యం ఉండటంతో పొరుగున ఉన్న మహారాష్ట్ర నుండి కూడా భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మండలం ఇటిక్యాల గ్రామ శివారులోని గోదావరి నది ఒడ్డున కూడా ఈ సమ్మక్కసారక్క జాతర నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తంమీద స్వామి కార్యం, స్వకార్యం రెండు పూర్తయినటు సింగరేణి ప్రాంతంలో ఈ మినీ సమ్మక్క సారక్క జాతర నిర్వహణతో ఈ ప్రాంత సింగరేణి కార్మికులు, ఇతర ప్రజలకు దూరభారం తగ్గడంతోపాటు ఆర్థికంగా కూడా కలిసిరావడం విశేషం.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Adilabad, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు