Saidabad rape : సైదాబాద్ అత్యాచార నిందితుడికి స్నేహితుడి సహాకారం.. ?

సీసీ కెమెరాల్లో చిక్కిన దృశ్యాలు

Saidabad rape : సైదాబాద్ అత్యాచార నిందితుడు తప్పించుకునేందుకు, స్థానికులతోపటు స్నేహితులు కూడా సహకరించారా.. అందుకే.. అత్యాచారం జరిగి నాలుగు రోజులు గడుస్తున్న నిందితుడు రాజును పోలీసులు పట్టుకోలేక పోతున్నారా... ? ఓవైపు పోలీసులు వెతుకుతున్నా... మరోవైపు స్నేహితుడి సహాకారంతో నిందితుడు ఎక్కడికి పారిపోయాడు.. ?

  • Share this:
    రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్ (saidabad)చిన్నారీ అత్యాచారం(rape) కేసులో నిందితుడు ఇంకా లభించకపోవడం ఉత్కంఠకు దారితీస్తుంది. అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పట్టుకుని ఎన్‌కౌంటర్ (Encounter)చేయాలంటూ అనేక మంది డిమాండ్ చేస్తున్నా.. పోలీసులకు మాత్రం అత్యాచార నిందితుడు చుక్కలు చూపిస్తున్నాడు.

    అయితే గత నాలుగు రోజులుగా పోలీసులు వెతుకున్న సమయంలో సంఘటన అనంతరం నిందితుడు పారిపోయేందుకు అత్యాచారం జరిగిన బస్తీలోనే అతని స్నేహితుడు సహకరించినట్టుగా పోలీసులు(police) గుర్తించారు. ఈ క్రమంలోనే సీసీ కెమెరాలు(cc camera) పరీశీలించిన పోలీసులకు పలు విషయాలు తెలిశాయి. అత్యాచారం జరిగిన తర్వాత పోలీసులు నిందితున్ని వెతుకున్న సంధర్భంలోనే.. నిందితున్ని తప్పించేందుకు అతని స్నేహితుడు(friend) సహకరించినట్టుగా తెలుస్తోంది.

    ఇది చదవండి : రూ 1000 పెట్టు ,1100 చేతపట్టు.. చివరకు నిరుద్యోగి ఇలా అయ్యాడు.. !


    ఇందుకోసం నిందితున్ని గుర్తు పట్టకుండా ఉండేందుకు నెత్తికి టోపి, భుజం రుమాలుతో పాటు మాస్కు, ఓ జత బట్టలతో కూడా ఓ ప్లాస్టిక్ బ్యాగును సైతం ఇచ్చినట్టుగా స్థానికులు చెబుతున్నారు.దీంతో సీసీ కెమెరాలను పరశీలించిన పోలీసులు సైతం ఇదే గమనించారు. తన స్నేహితుడితో కలిసి వెళ్లడం కెమెరాల్లో రికార్డు అయింది.

    అయినా.. పది బృందాలతో నాలుగు రోజులుగా గాలిస్తున్నా.. నిందితుడు రాజు అచూకి మాత్రం లభించడం కష్టంగా మారింది. ఎందుకంటే గంజాయి పీల్చడం , గుడుంబా తాగడం లాంటీ వాటితో రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడనే సమాచారాన్ని సేకరించారు.

    ఇది చదవండి : హైదరాబాద్‌లో స్వచ్ఛమైన గాలి ఉన్న ప్రాంతాలు ఇవే.. పీసీబీ నివేదిక


    మరోవైపు నిందితుడు రాజు సెల్‌ఫోన్ వాడకపోవడంతో ఎక్కడ ఉన్నాడనే ఆచూకి లభించడం కష్టంగా మారినట్టు పోలీసులు చెబుతున్నారు. సీసీ ఫుటేజీని పరిశీలించి , టెక్నికల్ సపోర్ట్‌తో నిందితున్ని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఇక నిందితుడు పారిపోయోందుకు సహకరించిన స్నేహితుడిని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

    కాగా నాలుగు రోజులు క్రితం సైదాబాద్‌(saidabad) బస్తిలో నివాసం ఉండే ఆరేళ్ల చిన్నారీకి చాక్లెట్ ఆశ చూపి తన గదికి తీసుకువెళ్లిన నిందితుడు దారుణంగా హత్య చేసి తన గదిలోనే తాళం (lock)వేసి బయటకు వచ్చాడు. అయితే ఇదే అంశంపై పోలీసులకు చెప్పినా.. పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సకాలంలో స్పందించకపోవడంతోనే ఈ సంఘటన జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    Published by:yveerash yveerash
    First published: