Saidabad rape : బార్లు, వైన్స్‌ల ముందు నిందితుడి ఫోటో.. కమిషనర్ ఆదేశాలు

స్నేహితుడితో కలిసి నిందితుడు రాజు

Saidabad rape : సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి తప్పించుకు తిరుగుతున్న నిందుతుడి ఫోటోను రాష్ట్రంలోని బార్లు, మరియు వైన్స్‌లలో పెట్టాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ ఆదేశాలు జారీ చేశారు. ఇది వెంటనే అమలు చేయాలని ఆయన చెప్పారు.

  • Share this:
    సైదాబాద్ అత్యాచారం (saidabad rape)రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. నిందితుడిని పట్టుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వ అధికారులు (officials)పావులు కదుపుతున్నారు. ఇందుకోసం తమ వంతు కృషితోపాటు నిందితుడిని పట్టుకునేందుకు బార్లు, రెస్టారెట్లతో పాటు వైన్స్‌ ల (wines)ముందు ఫోటోను అంటించాలని ఆదేశాలు జారీ చేశారు.

    మరోవైపు నిందితుడి కోసం పోలీసులు ఓవైపు గాలింపు చర్యలు చేస్తుండగ ఆచూకి తెలిపిన వారికి పది లక్షల రూపాయల రివార్డు (reward)కూడా రాష్ట్ర పోలీసు శాఖ ప్రకటించింది. దీంతో పాటు ఫోటోను బయటకు రిలీజ్ చేయడంతోపాటు రెండు కాంటాక్ట్ నంబర్లను సైతం విడుదల చేసింది.

    ఇది చదవండి : బాధితురాలి కుటుంబానికి 10 కోట్లు.. స్పాట్‌లో షర్మిల దీక్ష.. రాజకీయ దుమారం రేపుతున్న ఘటన


    కాగా నిందితుడిని (accused)పట్టుకునేందుకు పది బృందాలతో పోలీసులు(police teams) వెతుకుతుండగా.. ఇతర విభాగాల సహాకారం కూడా తీసుకుంటున్నారు. ముఖ్యంగా మారు వేశంలో స్నేహితుడి(friend) సహాకారంతో పారిపోయిన నిందితుడికి గంజాయితో పాటు గుడుంబా అలవాటు ఉన్న నేపథ్యంలోలనే ఆ దిశగా పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

    ఇది చదవండి : రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి.. మత్తు విక్రయాలు.. దాని ఫలితమే సైదాబాద్ ఘటన


    అయితే నిందితుడు రాజు ఇతర రాష్ట్రంలో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్లినట్టు కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అత్యాచారం(rape) తర్వాత పారిపోయోందుకు సహకరించిన రాజు స్నేహితుడిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నా.. ఎక్కడికి వెళ్లాడనేది సస్పెన్స్‌గా(suspence) మారింది.

    ఇది చదవండి : వైద్యం చేయమంటే చిన్నారి బొడ్డు కొరికాడు.. భూత వైద్యుడి ఘోరం


    మరోవైపు అత్యాచార సంఘటనపై రాష్ట్ర రాజకీయాలు కూడా వెడెక్కెయాయి. పలు పత్రిపక్ష పార్టీల నేతలు సంఘటన స్థలానికి వెళ్లడంతోపాటు బాధితురాలి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. మరోవైపు సినిమా హీరోలు సైతం సంఘటనపై స్పందిస్తుండడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
    Published by:yveerash yveerash
    First published: