saidabad rape : అక్కడ అత్తను కొట్టి.. ఇక్కడ అత్యాచారం చేసిన సైదాబాద్ క్రిమినల్

స్నేహితుడితో కలిసి వెళుతున్న నిందితుడు

saidabad rape : సైదాబాద్ అత్యాచార నిందితుడి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.. ఇటివల తన అత్తగారింట్లో ఘర్షణకు దిగి .. సొంత అత్తను చితకబాదాడు. దీంతో అక్కడి నుండి తిరిగి హైదరాబాద్‌కు మకాం మార్చినట్టు తెలుస్తోంది.

  • Share this:
    అత్యాచారం,(rape) హత్య చేసిన నిందితుడు రాజును పట్టుకునేందుకు పోలీసులు రాష్ట్రమంతా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజు తన అత్తగారింటి వద్ద పోలీసులు ముమ్మర తనిఖీలు చేశారు. ఇందుకోసం తన అత్తగారి ఇళ్లు అయిన సూర్యపేటతో(suryapet) పాటు చుట్టుపక్కల ప్రాంతాలను పోలీసలీలు జల్లెడ పట్టారు.

    కాగా ప్రసవం వెళ్లిన రాజు భార్య సూర్యపేటలోని జలాల్‌పురంలో ఉంటున్నట్టు గుర్తించారు. దీంతో రాజు అప్పుడప్పుడు వచ్చి వెళుతుండేవాడని బంధువులు తెలిపారు. ఈ క్రమంలోనే గత రెండు వారాల క్రితమే సూర్యాపేట వెళ్లినట్టు చెప్పిన బంధువులు కొద్ది రోజులు అక్కడే కూలి పని చేశాడని వివరించారు.

    ఇది చదవండి : నేటి రాశి ఫలాలు.. ప్రేమ వ్యవహారాల్లో పురోగతి.. నిరుద్యోగులకు శుభవార్త


    ఈ క్రమంలోనే ఒక రోజు తాగిన(Drink) మైకంలో కుటుంబ సభ్యులతో గొడవకు దిగిన రాజు.. తన అత్తపై చేయి చేసుకున్నట్టుగా తెలిపారు. దీంతో ఇతర కుటుంబ సభ్యులు దాడి చేస్తారనే భయంతో తిరగి హైదరాబాద్‌కు చేరుకున్నట్టు చెప్పారు.

    ఇక నిందితుడి కోసం పోలీసులు నగరం మొత్తం జల్లెడ పడుతున్నారు. సంఘటన హోమంత్రి మహముద్ ఆలీతోపాటు(home minister) డీజిపి, (dgp)కమిషనర్‌లు సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. నిందితుడి ఆచూకి చెప్పినవారికి పది లక్షల రూపాయల రివార్డును కూడా ప్రకటించడంతోపాటు పలు పబ్లిక్ ప్లేస్‌లలో పలు రకాల పోస్టర్లను సైతం విడుదల చేశారు.

    ఇది చదవండి : బస్సులో తానెవ్వరో చెప్పకుండా ప్రయాణించిన సజ్జనార్.. ఆయన ఇలా ఎందుకు చేశారంటే..


    ముఖ్యంగా నిందితుడికి గంజాయితోపాటు గుడుంబా తాగే అలవాటుతో పాటు బస్టాండ్స్, రైల్వే స్టేషన్లతో పాటు బయటి ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ పడుకునే అలవాటు కూడా ఉండడంతో పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఇందుకోసం వందలాది సీసీ కెమెరాలను(cc camera) పరీశీలించిన పోలీసులు చివరకు సహకరించిన అతని స్నేహితున్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

    నిందితుడు చివరగా ఎల్‌బీనగర్ చౌరస్తా నుండి ఉప్పల్ రింగ్ రోడ్డు వైపు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అంతకు మందు ఓ వైన్స్ వద్ద ఆగి మద్యం కూడా సేవించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే వైన్స‌లు, రెస్టారెంట్ల వద్ద నిందితుడి ఫోటోను పెట్టాలని ఎక్సైజ్ కమిషనర్ సైతం ఆదేశాలు జారీ చేశారు.
    Published by:yveerash yveerash
    First published: