హైదరాబాద్‌లోని ,నారాయణగూడ, ఖైరతాబాద్, కాచిగూడ, సైదాబాద్, బోయిన్పల్లి, ఈస్ట్ మారేడ్ పల్లి, చప్పల్ బజార్, మధురాపురి, కార్వాన్, నార్సింగ్, ఓల్డ్ సిటీ, మరికొన్ని ప్రాంతాల్లో సదర్ ఉత్సవాలు జరగనున్నాయి. ప్రతియేటా దీపావళి తర్వాత నగరంలోని యాదవ్‌లు సదర్ ఉత్సవాలను ఉల్లాస ఉత్సాహాలతో నిర్వహిస్తుంటారు. ఖరీదైన దున్నపోతులను ప్రదర్శనకు పెడతారు. వాటిని అలంకరించి ఊరేగిస్తారు. వీటి వెంట కుర్రకారు ఈలలు, డ్యాన్సులు, మ్యూజిక్కులతో ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటారు. ప్రతియేటా నిర్వహించే ఈ సదర్ ఉత్సవాల్లో నారాయణగూడలో నిర్వహించే సంబురాలు హైలైట్‌గా నిలుస్తుంటాయి.ఈ నెల 5వ తేదీన ఖైరతాబాద్, ఎల్లారెడ్డి గూడ, లాల్ బజార్, మరికొన్ని ప్రాంతాల్లో సదర్ సంబురాలు ప్రారంభం కానున్నాయి. కాగా, నారాయణగూడ సదర్ ఉత్సవాలు మరుసటి రోజు అంటే 6వ తేదీన జరగనున్నాయి.
సదర్ కోసం నగరంలోని యాదవ్‌లు పంజాబ్, హర్యానాల నుంచి దున్నరాజులను కొని తెస్తుంటారు. ఉత్సవాలకు ముందుగానే తెచ్చి వాటికి నాణ్యమైన దానా పెట్టి బలిష్టంగా తయారుచేస్తారు. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడ్డ తర్వాత డ్రైఫ్రూట్స్, అరటి పండ్లు, పాలు వంటి పౌష్టికాహారం అందిస్తారు. దున్నపోతుల వీపులపై వెంట్రుకలు లేకుండా చేస్తారు. ఆవాల నూనెతో మర్దన చేస్తారు. వీటిని ప్రత్యేకంగా హర్యానా నుండి లక్షల రూపాయలు వెచ్చించి తెస్తారు.. ఉత్సవాలు అయిపోగానే తిరిగి వారికి అప్పగిస్తారు..
ఇది చదవండి : టపాసులు కాల్చడం కాదు.. అక్కడ కొట్టుకోవడమే దీపావళీ స్పెషల్..
అయితే 1946లో హైదరాబాద్‌లో ప్రారంభమై ఈ ఉత్సవాలు క్రమంగా జిల్లాలకూ వ్యాపిస్తున్నాయి. ఇప్పుడు మహబూబ్ నగర్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లోనూ నిర్వహిస్తున్నారు. సాధారణంగా సదర్ ఉత్సవాలకు ముందు ఆ దున్నపోతులను అలంకరించి ప్రదర్శనకు ఉంచుతారు. కాగా గతంలో ఈ ఉత్సవాలను కుటుంబాల పరంగా నిర్వహించుకునేవారు.. అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సదర్ ఉత్సవాలకు అధికారిక ఏర్పాట్లు చేస్తున్నారు...స్థానికులకు కావాల్సిన సదుపాయలతో పాటు ఏర్పాట్లు చేస్తారు.. దీంతో సదర్ ఉత్సవాల్లో రాజకీయ ప్రముఖులు పాల్గొంటారు. సాయంత్రం నగరంలోని పలుచోట్ల సదర్ సందడి నెలకొంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Diwali 2021, Hyderabad