SABITA INDRAREDDY REVIEW ON CORONA IN TELANGANA RESIDENCIAL SCHOOLS VRY
Sabita Indrareddy : విద్యార్థులు అప్రమత్తంగా ఉండాల్సిందే.. విద్యాసంస్థల్లో కఠిన నిబంధనలు మంత్రి
corona
Sabita Indrareddy : విద్యార్థులందరు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. ( Review on Corona ) అప్రమత్తంగా ఉండాల్సిందేనని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. విద్యాసంస్థల్లో కరోనా భవిష్యత్ కార్యచరణపై అధికారులతో ఆమె ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ గురుకుల విద్యాసంస్థల్లో కరోనా కేసుల వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలోనే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ( Review on Corona ) రాష్ట్రంలోని పలు విద్యా సంస్థల్లో కొవిడ్ కేసులు వెలుగుచూడటంతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయపడాల్సిన పనిలేదన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి, భౌతిక దూరం పాటించేలా చూడాలని పాఠశాలల యాజమాన్యాలను మంత్రి ఆదేశించారు. గురుకుల, హాస్టల్ విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. పాఠశాలల సిబ్బంది తప్పనిసరిగా టీకా రెండు డోసులు తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని చోట్ల పాఠశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని మంత్రి వెల్లడించారు. సానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్ మిషన్లను పాఠశాలల్లో తప్పనిసరిగా వాడాలని తెలిపారు.
కరోనా తెలంగాణ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో విజృంభిస్తోంది. గత కొద్ద రోజులుగా తగ్గుముఖం పడుతుందని బావిస్తున్న తరుణంలో మరోసారి ప్రభుత్వ కాలేజీలు, స్కూళ్లతో పాటు పలువురు ప్రముఖులకు కూడా కరోసా సోకుతోంది. ( corona positive to student in Telangana ) ఇప్పటికే ఇటివల రాష్ట్రంలోని పలు స్కూళ్లలో ముఖ్యంగా గురుకులాల్లో కరోనా ఉదృతి పెరుగుతోంది. తాజాగా సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరు లోని మహాత్మ జ్యోతిరావు పూలే కాలేజీలో
కరోనా కలకలం రేపింది.. కాలేజీతో పాటు స్కూళు విద్యార్థులు ఉంటున్న గురుకులంలో సుమారు 43 మంది కరోనా భారిన పడ్డారు.
సీఎం కేసిఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఈ సంధర్భంలోనే మరోసారి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్‌పై దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ( Cabinet sub committee to face omicron ) రాష్ట్ర ఆ వైరస్ వ్యాప్తీ, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ప్రజలను అప్రమత్తం చేసి ఎదుర్కొనేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఈ ఉప సంఘంలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్, సబితా ఇంద్రారెడ్డి సబ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు సబ్ కమిటీ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.