• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • SAAHO MOVIE SAAHO PRODUCERS ANNOUNCED 1 LAKH FOR PRABHAS FAN WHO INJURED IN ELECTRIC SHOCK SK

సాహో నిర్మాతల ఔదార్యం...గాయపడ్డ ప్రభాస్ ఫ్యాన్‌కి ఆర్థిక సాయం

సాహో నిర్మాతల ఔదార్యం...గాయపడ్డ ప్రభాస్ ఫ్యాన్‌కి ఆర్థిక సాయం

సాహో నిర్మాతల ఔదార్యం...గాయపడ్డ ప్రభాస్ ఫ్యాన్‌కి ఆర్థిక సాయం

గురువారం యువి క్రియేషన్స్ నిర్వాహకులు విక్రమ్ రెడ్డి, వంశిరెడ్డి గాంధీ ఆస్పత్రికి వెళ్లి వెంకటేశ్‌ని పరామర్శించారు. అతడి పరిస్థితిని చూసి చలించిపోయిన చిత్ర నిర్మాతలు..వెంకటేష్ కుటుంబ సభ్యులకు లక్ష రూపాయలను అందించారు.

  • Share this:
    దేశమంతటా సాహో మేనియా నడుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రేపు ప్రపంచవ్యాప్తంగా సాహో మూవీ విడుదల నేపథ్యంలో థియేటర్లు కళకళలాడుతున్నాయి. అభిమానుల కోలాహలంతో సందడి వాతావరణం నెలకొంది. ఐతే బుధవారం మహబూబ్‌నగర్‌లోని తిరుమల థియేటర్‌లో అపశృతి చోటుచేసుకుంది. సాహో ఫ్లెక్సీ కడుతుండగా కరెంటు వైర్లు తగలడంతో వెంకటేశ్ అనే ప్రభాస్ అభిమానికి తీవ్ర గాయాలయ్యాయి. రెండో అంతస్తు మీద నుంచి పడిపోవడంతో కాళ్లు, చేతులు విరిగిపోయాయి. ప్రస్తుతం అతనికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి ద్వారా సాహో చిత్ర నిర్మాతలు తెలుసుకున్నారు.

    గురువారం యువి క్రియేషన్స్ నిర్వాహకులు విక్రమ్ రెడ్డి, వంశిరెడ్డి గాంధీ ఆస్పత్రికి వెళ్లి వెంకటేశ్‌ని పరామర్శించారు. అతడి పరిస్థితిని చూసి చలించిపోయిన చిత్ర నిర్మాతలు..వెంకటేష్ కుటుంబ సభ్యులకు లక్ష రూపాయలను అందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మిథున్ రెడ్డి..యూవీ క్రియేషన్స్ నిర్మాతలు విక్రమ్ రెడ్డి, వంశీరెడ్డి తన స్నేహితులని చెప్పారు. ఫ్లెక్సీలు కట్టేటప్పుడు, వేడుకలు చేసుకునేటప్పుడు..అభిమానులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనవసరంగా ప్రాణం మీదకు తెచ్చుకోవద్దని హితవు పలికారు మిథున్.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు