హోమ్ /వార్తలు /తెలంగాణ /

KTR: రైతుబంధు పరిమితి..అసెంబ్లీలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..ఏమన్నారంటే?

KTR: రైతుబంధు పరిమితి..అసెంబ్లీలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..ఏమన్నారంటే?

మంత్రి కేటీఆర్  (ఫైల్ ఫోటో)

మంత్రి కేటీఆర్ (ఫైల్ ఫోటో)

తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly Session)లో రెండో రోజు సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. మొదట మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసి శాసనసభలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. ఈ క్రమంలో కేటీఆర్ కల్పించుకొని కౌంటర్ ఇచ్చారు. ఇక శాసనమండలిలో 24 గంటల కరెంటుపై బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్య వాగ్వాదం నెలకొంది. ఇక తాజాగా అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపించారు. ఇక రైతుబంధు పరిమితిపై ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతంపై మంత్రి కేటీఆర్ (Minister KTR) కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly Session)లో రెండో రోజు సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. మొదట మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసి శాసనసభలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. ఈ క్రమంలో కేటీఆర్ కల్పించుకొని కౌంటర్ ఇచ్చారు. ఇక శాసనమండలిలో 24 గంటల కరెంటుపై బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్య వాగ్వాదం నెలకొంది. ఇక తాజాగా అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపించారు. ఇక రైతుబంధు పరిమితిపై ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతంపై మంత్రి కేటీఆర్ (Minister KTR) కీలక వ్యాఖ్యలు చేశారు.

Big News: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎం ..అక్బరుద్దీన్ ఒవైసీకి కేటీఆర్ కౌంటర్

రైతుబంధు పరిమితిపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..

'రైతుబంధు (Rythubandhu)పరిమితిపై ప్రతిపక్షాలు పనికిమాలిన రాద్ధాంతం చేస్తున్నాయి. వందల ఎకరాలు ఉన్న వారికీ రైతుబంధు ఎందుకని అంటున్నారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే..రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతుబందులో 98.16 శాతం చిన్న, సన్న కారు రైతులకు అందుతుందని, మిగిలిన శాతం మాత్రమే మిగతా వారికి వెళ్తుందన్నారు. రాష్ట్రంలో సీలింగ్ చట్టం ఉంది. ఈ పథకం ద్వారా బీసీ, ఎస్సి, ఎస్టీలకు అధిక మేలు జరుగుతుందని' మంత్రి కేటీఆర్ (minister KTR) తెలిపారు. దేశాన్ని ఇంతమంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు పరిపాలించారు. కానీ ఎవరికీ కూడా రైతుబంధు పథకం తీసుకురావాలనే ఆలోచన రాలేదు. అసాధారణ నాయకులకు మాత్రమే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. సాధారణ నాయకులకు సాధారణ ఆలోచనలు వస్తాయి కానీ ఇంతటి ఊహాజనిత ఐడియాలు రావని ఎద్దేవా చేశారు.

Ys Sharmila: కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల

24 గంటల కరెంటుపై మంత్రి కేటీఆర్ స్పందన..

రాష్ట్రంలో 24 గంటల కరెంటును అందిస్తున్నాం. గత నాయకుల పాలనలో కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ ఫార్మర్లు మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు నాణ్యతమైన విద్యుత్ ను 24 గంటలు అందిస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అన్నారు. కానీ ప్రతిపక్షాలు దీన్ని కూడా రాద్ధాంతం చేస్తున్నాయి. కానీ మా మంత్రి మంచి సమాధానం చెప్పారు. కరెంటు ఉందొ లేదో తెలుసుకోడానికి ఎక్కడైనా వైర్లను పట్టుకొని చూడాలన్నారు. అయితే ఇవి మిమ్మల్ని ఉద్దేశించినవి కావు. మీరు మంచిగా వుండాలని ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి అన్నారు. దీనితో అసెంబ్లీలో నవ్వులు పూసాయి.

ఇక రైతుభీమా లాంటి పథకంతో అన్నదాతలకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, నాయకులకు కూడా ఇలాంటి పథకం అందుతుందన్నారు. రూ. 5 లక్షల బీమాను ప్రతికపక్ష నాయకులు అందజేసిన సంధర్బాలున్నాయని మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా గుర్తు చేశారు.

First published:

Tags: Minister ktr, Rythubandhu, Telangana, Telangana Assembly

ఉత్తమ కథలు