Home /News /telangana /

RYTHU BANDU CUT WHO CULTIVATING GANJA IN THE STATE VRY

Telangana : ఆ రైతులపై ఉక్కుపాదం.. రానున్న సీజన్‌ను రైతుబంధు కట్...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana : గంజాయి పండిస్తున్న రైతులకు రైతు బంధును కట్ చేయాలంటూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి సాగు చేస్తున్న రైతుల వివరాలను తెలుపుతూ.. లేఖను పంపింది.

    గంజాయి సాగుతో పాటు వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే..
    ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎక్సైజ్ అధికారులతో పాటు రాష్ట్ర పోలీసులు పెద్ద ఎత్తున దాడులు
    చేస్తున్నారు. గంజాయి రవాణతో పాటు సాగుపై కూడా దృష్టి సారించారు. ఈ క్రమంలోనే గంజాయి
    సాగును గుర్తించి తోటలను ధ్వంసం చేశారు. గంజాయి, మత్తు పదార్థాల ప్రభావం యువత, విద్యార్థులపై
    ప్రభావం చూపిస్తుండడంతో సీఎం కేసీఆర్ పలు సార్లు వీటిపై రివ్యూ సైతం నిర్వహించారు. ఈ క్రమంలోనే
    గంజాయి సాగు చేస్తున్న రైతులకు రైతు బంధు కట్ చేస్తామని ఆయన వారిని హెచ్చరించారు. అయినా
    మారుమూల ప్రాంతాల్లో అక్కడక్కడ రైతులు గంజాయి సాగు చేస్తున్నారు.

    ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలను పెడచెవిన పెట్టడడంతో పాటు చట్టవ్యతిరేకంగా గంజాయిని
    సాగు చేస్తుండడంతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పలు చోట్ల దాడులు చేసి గంజాయి సాగు చేస్తున్న రైతులను
    గుర్తించింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 148 మంది రైతులపై పలు కేసులను నమోదు చేసింది. ముఖ్యంగా
    మహబుబాబాద్, జహిరాబాద్, భూపాలపల్లి, వరంగల్ లాంటీ జిల్లాలో పలువురు రైతులను గుర్తించి
    రైతుల ఆధార్ కార్డులు, ల్యాండ్ డాక్యుమెంట్స్‌ను ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపింది. దీంతో వారికి
    రానున్న ఖరీఫ్ సీజన్‌లో రైతు బంధును నిలిపివేయాలని కోరింది. కాగా ప్రతి సంవత్సరం ఎకరానికి
    పదివేల రూపాయల చొప్పున రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వారి ఆకౌంట్స్‌లలో వేస్తున్న విషయం తెలిసిందే..
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Hyderabad, Rythu bandhu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు