Home /News /telangana /

RYTHU BANDHU FUNDS WILL BE DEPOSITED IN FARMERS BAN ACCOUNTS FROM JUNE 15 TO 25TH HERE IS CM KCR KEY DECISIONS ON AGRICULTURE SK

Telangana: రైతులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్.. రైతుబంధు డబ్బులు వచ్చేది ఎప్పుడంటే..

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

తెలంగాణలో పండుతున్న వరి ధాన్యం మొత్తాన్ని కొనాల్సిందిగా కేంద్రాన్ని కోరనున్నానమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పంజాబ్ వంటి రాష్ట్రాల్లో నూటికి నూరు శాతం ధాన్యం సేకరిస్తున్న ఎఫ్ సీ ఐ.. తెలంగాణలో సేకరిచంక పోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇంకా చదవండి ...
  తెలంగాణ రైతులకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) శుభవార్త చెప్పారు. జూన్ 15 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులను జమచేస్తామని తెలిపారు. వానాకాలం ప్రారంభమౌతున్న నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలను, ఎరువులను ఫెస్టిసైడ్స్‌ను అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. కల్తీవిత్తనాలు, ఫెస్టిసైడ్స్, బయో ఫెస్టిసైడ్స్ పేరుతో మార్కెట్లోకి వస్తున్న కల్తీ ఉత్పత్తుల మీద ఉక్కుపాదం మోపాలని వ్యవసాయ శాఖ , పోలీసు, ఇంటెలిజెన్స్ శాఖలకు సీఎం కెసిఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం వ్యవసాయరంగంపై జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

  రైతు బంధు:
  జూన్ 15 నుంచి 25వ తేదీ లోపల రైతుబంధు పంటసాయం కింద ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేయాలని సీఎం కేసీఆర్ ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. గత యాసంగిలో అవలంబించిన విధానాన్నే ఇప్పుడు కూడా అవలంబిస్తూ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సిఎం ఆదేశించారు. ఇప్పటిదాకా ఇచ్చిన కాటగిరీల వారిగానే రైతు బంధు ఆర్ధిక సాయాన్ని ఖాతాలో వేయాలన్నారు. కాగా జూన్ 10వ తేదీని కటాఫ్ డేట్‌గా పెట్టుకోని ఆ తేదీవ రకు పార్ట్ బీ నుంచి పార్ట్ ఏ లోకి చేరిన భూములకు రైతు బంధు వర్తింప చేయాలని సిఎం ఆదేశించారు.

  నూటికి నూరు శాతం వ్యవసాయ స్థిరీకరణ :
  ధాన్యం దిగుబడిలో తెలంగాణ ది దేశంలోనే నెంబర్ వన్ స్థానం అన్నారు. వొక్క కారు మాత్రమే వరి పంట పండించే పంజాబ్ కన్నా తెలంగాణలో రెండు పంటల ద్వారా అధిక దిగుబడి వచ్చిందన్నారు. రాబోయే కాలంలో మెదక్, మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లో ఇంకా మరికొన్ని ప్రాజెక్టులను లిఫ్టులను పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ రంగం నూటికి నూరు శాతం స్థిరీకరించబడుతుందన్నారు.


  కేంద్రం వివక్ష తగదు :
  తెలంగాణలో పండుతున్న వరి ధాన్యం మొత్తాన్ని కొనాల్సిందిగా కేంద్రాన్ని కోరనున్నానమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పంజాబ్ వంటి రాష్ట్రాల్లో నూటికి నూరు శాతం ధాన్యం సేకరిస్తున్న ఎఫ్ సీ ఐ.. తెలంగాణలో సేకరిచంక పోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం ఇట్లా వివక్ష చూపడం సరికాదన్నారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాయనున్నామన్నారు.

  నిల్వ సామర్ధ్యం ఇంకా పెంచుతాం :
  ధాన్యాన్ని కొనడం ఎంత శ్రమో ధాన్యాన్ని సేకరించి స్టాకు చేయడం కూడా అంతే శ్రమతో కూడుకున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ వచ్చిన కొత్తలో కేవలం 4 లక్షల టన్నుల ధాన్యాన్ని స్టాకు చేయడానికి మాత్రమే గోడౌన్ల లభ్యత వుండేదని, కానీ నేడు 25 లక్షల టన్నుల ధాన్యాన్ని నిల్వచేసుకునేందుకు గోడౌన్ల నిర్మాణం జరిగిందన్నారు. భవిఫ్యత్తులో మొత్తం 40 లక్షల టన్నుల సామర్థ్యనికి గోడౌన్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు మార్కెటింగ్ శాఖ సిద్ధం చేసిందన్నారు.

  కల్తీ విత్తనాలమీద ఉక్కుపాదం :
  కల్తీ విత్తనాలమీద ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. జిల్లాల వ్యాప్తంగా కల్తీ విత్తన తయారీదారులమీద దాడులు జరపాలని స్పష్టం చేశారు. కల్తీ విత్తనదారులను వలవేసి పట్టుకోవాలని, ఎంతటి వారినైనా పీడీ యాక్టుకింద అరెస్టు చేసి చట్టబపరమైన చర్యలు తీసుకోవాలని సిఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చిత్తశుద్దితో పనిచేసి కల్తీ విత్తన విక్రయ ముఠాలను పట్టుకున్న వ్యవసాయ శాఖ, పోలీసు శాఖ, అధికారులను గుర్తించి వారికి ఆక్సిలరీ ప్రమోషన్, రాయితీల తో పాటు ప్రభుత్వం సేవా పతకం అందచేస్తుందని సిఎం స్పష్టం చేశారు.


  వ్యవసాయ శాఖ అధికారులు పాల్పడితే డిస్మిస్ :
  కల్తీ విత్తనాల తయారీ మీద జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తం కావాలన్నారు. వొకవేల వ్యవసాయ శాఖ అధికారులే స్వయంగా ఎక్కడైనా అవినీతికి పాల్పడుతూ కల్తీ విత్తన ముఠాలతో జట్టుకట్టినట్టు రుజవైతే వారిని ఆక్షణమే ఉద్యోగం లోంచి తొలగించడమే కాకుండా 5 సంవత్సరాలు జైలు శిక్ష పడేలా చూడాలన్నారు.


  క్యూ ఆర్ కోడ్ విధానం :
  కల్తీ విత్తనాల నియంత్రణకు దేశంలో మెట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్రంలో క్యూ ఆర్ కోడ్‌తో సీడ్ ట్రేసబిలిటీని అమలు చేయాల్సిందిగా సిఎం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని ఆదేశించారు. ప్రభుత్వం ఆమోదించిన విత్తన కంపెనీలే విత్తన విక్రయాలు చేపట్టేలా ఈ నియంత్రణ చర్యలుండాలని తెలిపారు. క్యూఆర్ కోడ్ తో కూడిన ప్రభుత్వ సర్టిఫైడ్ ముద్రిత విత్తనాల ప్యాకెట్ల మీద వుంటున్నందున, స్మార్ట్ ఫోన్ తో స్కాన్ చేయడం ద్వారా విత్తన కంపెనీల పూర్తి వివరాలుంటాయని మంత్రి సిఎం కెసిఆర్ కు వివరించారు. ఆలస్యం చేయకుండా తక్షణమే ఈ విధానాన్ని అమలులోకి తేవాలని సిఎం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని ఆదేశించారు సీఎం కేసీఆర్.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Agriculture, CM KCR, Farmers, Rythu bandhu, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు