నేడు పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. క్వశ్చన్ అవర్ లో ఎంపీ రేవంత్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మధ్య మాటల తూటాలు పేలాయి. ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో పార్లమెంట్ లో గంభీరమైన వాతావరణం నెలకొంది. నేడు పార్లమెంట్ లో క్వశ్చన్ అవర్ సందర్బంగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) రూపాయి విలువ పతనం గురించి కేంద్ర ప్రభుత్వాన్ని హిందీలో ప్రశ్నించారు. రోజురోజుకు రూపాయి విలువ పడిపోతుందని గతంలో మోదీ (Modi) చెప్పిన విషయాన్ని రేవంత్ (Revanth Reddy) ప్రస్తావించారు.
ప్రధాని మోదీ (Modi) గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని రూపాయి విలువ గురించి ప్రశ్నించారని, ఇప్పుడు అదే ప్రశ్న నేను అడుగుతున్నానన్నారు. ఆ సమయంలో డాలర్ కు రూపాయి విలువ 60 నుంచి 70 మధ్యలో ఉందని అప్పుడే దేశ ఆర్ధిక వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ఐసీయూలోకి తీసుకెళ్లిందని ప్రధాని మోడీ అంటే ప్రస్తుతం రూపాయి విలువ చూస్తుంటే మాత్రం ఇప్పటి కేంద్ర ప్రభుత్వం ఏకంగా మార్చురీకి తీసుకెళ్తుందా అని ప్రశ్నించారు. రూపాయిని బలోపేతం చేయడానికి కేంద్రం అమలు చేస్తున్న ప్లాన్ ఏదని రేవంత్ రెడ్డి కేంద్రాన్ని పార్లమెంట్ వేదికగా ప్రశ్నించారు.
Anyone can speak any language in this country, @nsitharaman stop Hindi imposition on Non-Hindi speaking majority in this country! You’re not only insulting @revanth_anumula but also the whole Telugu and non-Hindi speaking people and regions of this country. pic.twitter.com/GtqXeRsVh1
— Telangana Congress (@INCTelangana) December 12, 2022
ఘాటుగా స్పందించిన కేంద్ర మంత్రి నిర్మల..
రేవంత్ వేసిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చేప్పే ముందు రేవంత్ హిందీ భాష గురించి మాట్లాడారు. బలహీనమైన హిందీ భాషలో ప్రశ్న వేసిన రేవంత్ రెడ్డికి అదే బలహీనమైన హిందీలోనే సమాధానం ఇస్తాను అన్నారు. దీనికి రేవంత్ రెడ్డి స్పందిస్తూ నేను శూద్రున్ని కాబట్టి స్వచ్ఛమైన హిందీ తనకు రాదని, కానీ వారు బ్రాహ్మణ వాదులు కాబట్టి శుద్దమైన హిందీ వచ్చని అన్నారు. దీనికి కల్పించుకున్న నిర్మల నేను కూడా తెలంగాణ నుంచే వచ్చానని, కానీ తనది కూడా బలహీనమైన హిందీ భాషే అని అన్నారు.
అలాగే రేవంత్ రెడ్డి ప్రశ్నకు సమాధానం ఇస్తూ..అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు వేరు. అప్పటి ఆర్ధిక వ్యవస్థ ఇప్పటి ఆర్ధిక వ్యవస్థ వేరు. కేవలం రూపాయి మారకపు విలువనే కాదు. ఇతర సూచీలను ప్రస్తావిస్తే బాగుంటుందని అన్నారు. అప్పటి ఆర్ధిక వ్యవస్థ ఐసీయూలోనే ఉందని కానీ తాము ఇప్పుడు ప్రగతిరథంలో నడిపిస్తున్నామని అన్నారు. కరోనా సమయంలో కఠిన సవాళ్లను ఎదుర్కొని వేగంగా అభివృద్ధి చెందుతున్న కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Lok sabha, Mp revanthreddy, Nirmala sitharaman, Revanth Reddy, Telangana