హోమ్ /వార్తలు /తెలంగాణ /

New year celebrations : న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు.. పాల్గోనే వారు ఇవి పాటించాల్సిందే.. లేదంటే...

New year celebrations : న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు.. పాల్గోనే వారు ఇవి పాటించాల్సిందే.. లేదంటే...

CV-Anand

CV-Anand

New year celebrations : నూతన సంవత్సర వేడుకలపై హైకోర్టులో పిటిషన్ ధాఖలు కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.. వేడుకలకు సంబంధించి పాటించాల్సిన నిబంధనలపై మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ నిబంధనలు పాటించని వారిపై చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.

ఇంకా చదవండి ...

హైదరాబాద్ నగరంలో న్యూఇయర్ వేడుకలపై పోలీసులు పలు ఆంక్షలు జారీ చేశారు. వేడుకల రద్దు కోరుతూ హైకోర్టులో పిటిషన్ పడిన నేపథ్యంలో నగర పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో వేడుకలకు సంబంధించి కోర్టునుండి ఎలాంటీ వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలోనే వేడుకలు నిర్వహించే వారు తప్పనిసరిగా రెండు డోసులు వేసుకున్నవారినే వేడుకలకు అనుమతించాలని చెప్పారు. మరోవైపు మాస్క తప్పని సరిగా ధరించాలని లేదంటే వేయి రూపాయల జరిమానా విధిస్తామని చెప్పారు. ఇక న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించే వారు రెండు రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాని సూచించారు. వేడుకల్లో పాల్గొనే సిబ్బందికి సైతం కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఇక బహిరంగ ప్రదేశాల్లో డీజేలకు అనుమతి లేదు. ఇతరులకు ఇబ్బంది కల్గించే విధంగా ఉంటే తగిన చర్యలు తీసుకుంటారు. ఉత్సవాల్లో అసభ్యకర డెస్స్‌లు ధరించినా..డాన్సులు చేసినా...చర్యలు తీసుకోవడంతోపాటు మాదకద్రవ్యాలను అనుమతించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ సీవీ అనంద్ అన్నారు.

కాగా మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సర ఉత్సవాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఆ రోజు పార్టీలకు అర్థరాత్రి వరకు అవకాశం కల్పించింది. రాష్ట్రంలోని బార్లు,వైన్స్‌లు అర్ధరాత్రి వరకు కొనసాగే విధంగా నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం షాపులతో సహా,నగరంలో నిర్వహించే ఈవెంట్లకు కూడా అవకాశం కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది.

Nalgonada : ముందుగా ప్రభుత్వ ఉద్యోగి.. ఆ తర్వాత 6గురు స్నేహితులు.. యువతిపై లైంగిక దాడి. ఫలితంగా..!

మరోవైపు డిసెంబర్‌ 31 వ తేదీన వైన్స్‌లు రాత్రి 12 గంటలకు ఓపెన్‌ ఉన్నప్పటికీ.. డ్రంకన్‌ డ్రైవ్‌ ఉంటుందని పేర్కొంది. దీంతో అర్థరాత్రి వరకు వైన్స్‌లు ఒపెన్‌ ఉంటాయని కేసీఆర్‌ సర్కార్‌ ప్రకటన చేయడంతో.. మందు బాబులు సంబరాలు స్వేచ్చగా సంబరాలు చేసుకునే అవకాశం కల్పించినట్టయింది.. అయితే ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి హైకోర్టు ఆంక్షలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీంతో క్రిస్మస్ వేడుకలు ముగిసిన తర్వాత జనవరి 2 వ తేదీ వరకు కరోనా ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసు శాఖతో పాటు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది..

Paddy Issue : ఖరీఫ్ ధాన్యం సమస్య క్లోజ్...అయినట్టేనా... అదనపు కొనుగోళ్లకు కేంద్రం అనుమతులు..

దీంతో ఈ వేడుకలను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌ పడింది. ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకలపై హైకోర్ట్ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కోంటూ.. ఓ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించాడు.. ఒమిక్రాన్ వ్యాప్తి జరుగుతున్ననేపథ్యంలో...ఇతర రాష్ట్రల వలే.. ఆంక్షలు పెట్టాలని హై కోర్ట్ ఆదేశించినా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.. ఈ క్రమంలోనే ఎపిడెమిక్ , డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తుందని కోర్ట్ కు తెలిపాడు.. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా న్యూ ఇయర్ వేడుకలను అనుమతి ఇచ్చిందని తెలిపాడు.. దీంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా 62 ఒమిక్రన్ కేసులు నమోదయ్యాయని , ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుని న్యూ ఇయర్ వేడుకల పై ఆంక్షలు విధించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. దీంతో ఆ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు రేపు విచారించనుట్టు తెలిపింది..

First published:

Tags: Hyderabad, New Year 2022

ఉత్తమ కథలు