Home /News /telangana /

SEC on Huzurabad by election : రెండు జిల్లాల్లో ఎన్నికల నియమావళి .. పథకాలు కొనసాగుతాయి.. !

SEC on Huzurabad by election : రెండు జిల్లాల్లో ఎన్నికల నియమావళి .. పథకాలు కొనసాగుతాయి.. !

shashank goyal

shashank goyal

SEC on Huzurabad by election : హుజూరాబాద్ ఉప ఎన్నికల షెడ్యుల్ ప్రకటించడంతో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించి కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లో నిబంధనలు అమల్లో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధుకు కూడా అడ్డంకులు ఉండవని ఆయన స్పష్టం చేశారు

ఇంకా చదవండి ...
    హుజూరాబాద్ ఉప ఎన్నికల షెడ్యుల్ ప్రకటించడంతో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించి కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లో నిబంధనలు అమల్లో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధుకు కూడా అడ్డంకులు ఉండవని ఆయన స్పష్టం చేశారు.

    హుజూరాబాద్ ఉప ఎన్నికల షెడ్యుల్ విడుదల కావడంతో రెండు జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తన నియామావళి అమల్లోకి వచ్చాయి. షెడ్యుల్‌తోపాటు ఎన్నికల నిర్వహాణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ శశాంక్ గోయల్ వివరాలు వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించి 20 మంది స్టార్ క్యాంపెయినర్లకు అనుమతి ఇచ్చామని చెప్పారు. నిబంధనలకు లోబడి ప్రచారం చేసుకోవాలని ఆయన సూచించారు. ఎన్నకల కోసం ఈవీఎంలతోపాటు ఎన్నికల ఏర్పాటు చేశామని చెప్పారు.

    ఇది చదవండి :  హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంట్‌డౌన్.. ఎవరి బలాలు ఏమిటి.. ?


    కాగా నేటి వరకు 2,36,269 మంది ఓటర్లు ఉండగా.. ఎన్ఆర్ఐ, సర్వీసు ఓటర్లు కలిపితే ఓట్లర సంఖ్య 2,36,430 ఉన్నారని చెప్పారు. ఇక వీరిలో 18-19 ఏళ్ల మధ్య 4,988 మంది ఓటర్లు ఉన్నారు80 ఏళ్ల పైన 4,454 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఇక కోవిడ్ నిబంధనలను అనుసరించి 80 సంవత్సరాలు దాటిన వృద్దులతో పాటు కోవిడ్ రోగులకు పోస్టల్ ఓట్లతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయని చెప్పారు. ఇక కోవిడ్ నిబంధనలు సైతం వర్తిస్తాయని చెప్పారు. ఇందుకోసం అభ్యర్థులతో పాటు ఎన్నికల్లో పాల్గోనే సిబ్బంది రెండు డోసుల టీకాలు తీసుకున్నవారికే అనుమతి ఉంటుందని చెప్పారు. ఇందుకు సంబంధించి కమిషన్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

    ఇది చదవండి : హుజూరాబాద్ ,బద్వేల్ ఉప ఎన్నికల షెడ్యుల్ విడుదల


    ఇక దళిత బంధు పథకానికి సంబంధించి ఎలాంటి అడ్డంకులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడున్న పథకాలు యథావిధిగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Huzurabad By-election 2021, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు