హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR | Akunuri Murali : కాళేశ్వరం ప్రాజెక్టు మూసేయక తప్పదు : ఎందుకో చెప్పిన రిటైర్డ్ ఐఏఎస్..

CM KCR | Akunuri Murali : కాళేశ్వరం ప్రాజెక్టు మూసేయక తప్పదు : ఎందుకో చెప్పిన రిటైర్డ్ ఐఏఎస్..

సీఎం కేసీఆర్, ఐఏఎస్(రి) ఆకునూరి మురళి (పాత ఫొటోలు)

సీఎం కేసీఆర్, ఐఏఎస్(రి) ఆకునూరి మురళి (పాత ఫొటోలు)

సీఎం కేసీఆర్ అన్నీ తానై నిర్మించిన ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక ఎకరాకు నీరు పారించాలంటే కరెంటు ఖర్చే రూ.50వేలు అవుతుందని, తెల్ల ఏనుగు లాంటి దీన్ని మూసేయక తప్పదని ఇంజనీర్ కన్ఫర్డ్ ఐఏఎస్ (రి) ఆకునూరి మురళి చెప్పారు. విద్యా రంగంపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు..

ఇంకా చదవండి ...

దేశంలోనే మొట్టమొదటి ఇంజనీర్ కన్ఫర్డ్ ఐఏఎస్ అధికారి ఆయన. సాధారణంగా రెవెన్యూ విభాగంలో పనిచేసినవారు ఐఏఎస్ లుగా కన్ఫర్డ్ అవుతుంటారు. అయితే కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆకునూరి మురళి మాత్రం చిన్న వయసులోనే గ్రూప్-1 కొలువు సాధించి, ఆర్ అండ్ బీలో ఇంజనీర్ గా ప్రస్తానం కొనసాగించి ఐఏఎస్ అయ్యారు. గ్రామీణ పేదరిక నిర్మూలన, గ్రామీణాభివృద్ది కార్యక్రమాల రూపకల్పనలో నిష్ణాతుడిగానూ పేరు పొందారు. ఎన్నెన్నో అంతర్జాతీయ సంస్థలకు సైతం సేవలందించిన మురళి తెలంగాణ ఏర్పాటు తర్వాత జిల్లా కలెక్టర్ గానూ పనిచేశారు. అయితే తర్వాతి కాలంలో ప్రాధాన్యం లేని పోస్టుల్లో వేశారని, పని చేసే అవకాశం ఇవ్వాలని కోరినా సీఎం కేసీఆర్ నో చెప్పారని, అందుకే వ్యక్తిగత స్థాయిలోనైనా సమాజానికి సేవ చేద్దామనే స్వచ్ఛంద పదవీ విరమణ పొందానని చెబుతారాయన.

టీఎస్ సీఎం కేసీఆర్ వద్దనుకున్న మురళిని ఏపీ సీఎం జగన్ సలహాదారుగా నియమించుకోవడం, ఆయన ఆధ్వర్యంలో ఏపీలో విద్యా, గ్రామీణాభివృద్ది రంగాల్లో సంచలనల మార్పులు చోటుచేసుకోవడం తదుపరి చరిత్ర. కాగా, తెలంగాణలో విద్యావిధానం, కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులపై ఇంజనీర్ ఐఏఎస్ ఆకునూరి మురళి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ నిర్వహించే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో తెలంగాణకు సంబంధించిన కీలక రంగాలపై మురళి తన ఆలోచనలు పంచుకున్నారు. వాటిలో ముఖ్యాంశాలివే..

PM Kisan Yojana: రైతులకు శుభవార్త.. బ్యాంక్ ఖాతాల్లోకి పీఎం కిసాన్ 11 విడత డబ్బులు.. 31న మోదీ స్వయంగా..


తెలంగాణలోని ఏ ఒక్క ప్రాజెక్టుకూ కేంద్రం జాతీయ హోదా, నిధులు ఇవ్వకున్నా, కేసీఆర్ సర్కారు సొంతగా అప్పులు చేసిమరీ దాదాపు రూ.లక్ష కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం, దాని ద్వారా సుమారు 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని చెప్పడం తెలిసిందే. అయితే అసలు కాళేశ్వరం దొంగ స్కీం అని, కమిషన్ల కోసం రూపొందిన ప్రాజెక్టు అని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆరోపించారు. ప్రపంచంలోనే మూర్ఖపు ప్రాజెక్టుగా, తెల్ల ఏనుగులా మారిన కాళేశ్వరాన్ని నిర్వహించలేమని, ఐదేళ్లలోపే దాన్ని మూసేయక తప్పదని ఆయన అన్నారు.

CM KCR | KTR : కేటీఆర్ సీఎం కావాల‌ని ఆంధ్రా యువ‌కుడి పాద‌యాత్ర‌.. దసరాకు కేసీఆర్ నిర్ణయం?


‘నేను భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా పనిచేశా. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ డిజైన్‌ చేసినప్పుడు సీఎం 36 లక్షల ఎకరాల ఆయకట్టు అని చెప్పారు. ప్రారంభించినప్పుడు 42 లక్షల ఎకరాలు అన్నారు. ఆ ప్రాజెక్టు నీరు ఎన్ని ఎకరాల్లో పారుతుందని నేను ఆర్టీఐ పెడతాను. 15 లక్షల ఎకరాలు పారుతుందని నిరూపిస్తే.. దేనికైనా సిద్ధం. ప్రపంచంలోనే ఇంత మూర్ఖపు ప్రాజెక్టు లేదు. ఎకరా వరికి నీరు పారించాలంటే దీనికయ్యే కరెంటు ఖర్చు రూ.50 వేలు. ఈ విషయాన్ని ప్రభుత్వ నీటి పారుదల శాఖ సలహాదారు శ్రీధర్‌రావు దేశ్‌పాండేనే ఒక వ్యాసంలో రాశారు. కేసీఆర్ తానే ఇంజనీర్ గా, విధాన రూపకర్తగా వ్యవహరించారు కాబట్టే కాళేశ్వరానికి దుస్థితి తలెత్తింది.  ఒకే దెబ్బతో ఇంకో మూడు, నాలుగు ఎన్నికలకు సరిపడా పెట్టుబడి డబ్బులు సంపాదించుకోవచ్చనే ఆలోచన తనది. కాళేశ్వరం ప్రాజెక్టు ముమ్మాటికీ తెల్ల ఏనుగు. ఇంకో ఐదేళ్లలో దాన్ని మూసేయాల్సి వస్తుంది’ అని ఆకునూరి మురళి అన్నారు.

CM KCR | Vehicle Tax : అప్పులు దొరక్క పన్నులు బాదుడు! -వాహనాలపై టాక్స్ భారీగా పెంచిన కేసీఆర్ సర్కార్


కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి మోసపూరిత పథకాలే దళిత బంధు, రైతు బంధు అని, కేవలం ఎస్సీల ఓట్లు పొందేందాలనే దుర్మార్గపు ఆలోచన తప్ప దళిత ఉన్నతికి బంధు ఏమాత్రం పనికిరాదని, ఫామ్ హౌజులున్న సినిమా సెలబ్రిటీలు, సివిల్స్ ఇతర ఉన్నతాధికారులకూ రైతు బంధు డబ్బులు పడుతున్నాయంటేనే అదెంత వృథా స్కీమో అర్థం చేసుకోవచ్చని మురళి చెప్పారు. నియోజకవర్గానికి 100 మందికి చొప్పున దళిత బంధు అమలు చేస్తూ పోతే, రాష్ట్రంలోని 18 లక్షల దళిత కుటుంబాలకు బంధు చేరడానికి 156 ఏళ్ల సమయం పడుతుందని ఆక్షేపించారు.

Congress | Rajya Sabha : అభ్యర్థుల జాబితా ఇదే.. గులాం నబీకి షాక్.. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ఆజాద్?


తెలంగాణలో విద్యా వ్యవస్థను కేసీఆర్ సర్కారు ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేస్తున్నదని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆరోపించారు. రాష్ట్రంలో మొత్తం రూ.12వేల కోట్లు టీచర్ల జీతాలు ఇస్తున్నారని, స్కూల్ స్థాయిలో ఒక విద్యార్థి మీద ఏడాదికి రూ.40-45వేలు ఖర్చు పెడుతున్నారని, అదే ప్రైవేటు స్కూళ్లలో రూ.7వేలు ఖర్చు పెడుతున్నారని, మరి ప్రైవేటులో 90 శాతం ఏ గ్రేడ్‌ తీసుకొస్తే.. సర్కారు పాఠశాలల్లో 63శాతం సీ గ్రేడ్‌ ఉంటున్నారని, దీనికి కారణం సీఎంకు, సర్కారుకు విజన్ లేకపోవడమేనని, పాఠశాల విద్య మీద గానీ, యూనివర్సిటీ విద్య మీద గానీ, నాణ్యమైన విద్య విషయంలోగానీ సీఎం కేసీఆర్‌ కనీసం ఐదు నిమిషాలైనా సమీక్ష నిర్వహించలేదని మురళి విమర్శించారు.

BJP | Rajya Sabha : సీఎం కోసం త్యాగం చేస్తే ఎంపీ సీటు.. అభ్యర్థుల తొలి జాబితా.. మైనార్టీ మంత్రి నఖ్వీపై సందిగ్ధం!


‘పేదలకు కావాల్సింది విద్య, వైద్యం. వీటిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టట్లేదు. తెలంగాణ రాక ముందు విద్యకు 11శాతం బడ్జెట్‌ ఉండేది. అది ఇప్పుడు 6.2 శాతానికి వచ్చింది. కేంద్రంలో కూడా గతంలో 6 శాతం ఉంటే.. దానిని 2.6శాతం చేశారు. ధనిక దేశమైన అమెరికాలో 93శాతం ప్రభుత్వ, 7శాతం ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. మరి మన పేద దేశంలో ఎలా ఉండాలి. సరిగ్గా ప్రణాళిక ఉంటే.. ఐదేళ్లలో రాష్ట్రంలో అద్భుతమైన స్కూళ్లు కట్టొచ్చు. ప్రతి నియోజకవర్గంలో అపోలో, యశోద, కేర్‌ వంటి ఆస్పత్రులు నిర్మించొచ్చు..’అని ఆకునూరి మురళి అన్నారు. సీఎం కేసీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణ విద్యా రంగంపై ఆకునూరి మురళి చేసిన ఆరోపణలపై ప్రభుత్వం లేదా అధికార టీఆర్ఎస్ నుంచి స్పందన వెలువడాల్సి ఉంది.

First published:

Tags: CM KCR, Kaleshwaram project, Telangana, Trs