తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కాకా రేపుతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీన చేయడంతో పాటు పలు డిమాండ్లతో సమ్మెకు దిగుతున్నారు కార్మికులు. అక్టోబరు 5 నుంచి సమ్మె చేస్తామరని ఇప్పటికే కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో సోమేశ్ కుమార్ కమిటీ చర్చలు విఫలమవడంతో సమ్మె జరగడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టిన తెలంగాణ ప్రభుత్వం ప్లాన్-బీ తెరమీదకు తెచ్చింది. ఆర్టీసీ కార్మికులకు షాకిస్తూ సమ్మె సమయంలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం.
దసరా సమయంలోనే సమ్మెకు పిలుపునివ్వడంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. కార్మిక సంఘాల డిమాండ్ల పరిష్కారం దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని.. ప్రస్తుతానికి సమ్మె విరమించాలని కమిటీ కోరినా వినకపోవడంపై ఆగ్రహంతో ఉంది. ఈ క్రమంలోనే ప్రైవేట్ , స్కూల్ బస్సు డ్రైవర్లకు రోజుకు రూ.1500 వేతనం ఇచ్చి సమ్మె సమయంలో బస్సులను నడపాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ఇంటర్ అర్హత ఉన్న వారిని కండక్టర్లుగా నియమించి రోజుకు రూ. వెయ్యి వేతనం ఇవ్వాలని భావిస్తున్నారు.
ప్రభుత్వం తీరుపై కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తచేస్తున్నాయి. చర్చలకు ముందే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూ తమను రెచ్చగొడుతున్నారని నేతలు మండిపడుతున్నారు. స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మెను రద్దు చేసే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మెకు ప్రైవేట్ బస్సు సంఘం మద్దతు ప్రకటించింది. ఇలా ఆర్టీసీ యాజమాన్యం, కార్మికుల ఫైట్‌తో పండగకు బస్సులు తిరుగుతాయా లేదని ప్రజల్లో ఆందోళన నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Rtc, Telangana, Telangana News, Tsrtc