హైదరాబాద్‌లో ఆటోవాలాల అడ్డగోలు దోపిడీ... కి.మీకి ఎంతో తెలుసా?

ఆర్టీసీ సమ్మెతోపాటు క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లు కూడా సమ్మెకు దిగారు. దీంతో ఆటోవాలాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఇష్టం వచ్చినట్టు చార్జీలు వసూలు చేస్తున్నారు.

news18-telugu
Updated: October 19, 2019, 2:34 PM IST
హైదరాబాద్‌లో ఆటోవాలాల అడ్డగోలు దోపిడీ... కి.మీకి ఎంతో తెలుసా?
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 19, 2019, 2:34 PM IST
తెలంగాణలో సమ్మె ప్రభావంతో హైదరాబాద్‌లో ప్రయాణికులను ఆటోవాలాలు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. గత 10 రోజుల నుంచి ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. అసలు మీటర్ అనే మాటను పక్కనపెట్టేశారు. ప్రయాణికులను ఎంతగా దోచుకుంటున్నారనే దానికి ఉదాహరణగా ఓ ప్రయాణికుడు తన ఆవేదనను న్యూస్‌18తో పంచుకున్నాడు. ‘ఖైరతాబాద్ నుంచి ఎర్రమంజిల్ వరకు వెళ్లడానికి ఆటో అడిగా. ఆటో డ్రైవర్ రూ.70 అడిగారు. కేవలం కిలోమీటర్ దూరం మాత్రమే ఉంది. అంత ఎందుకంటే.. బస్సుల్లేవ్. అనే సమాధానం వచ్చింది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌లో మెట్రో రైలు ఎక్కితే రూ.10 లోపే ఎర్రమంజిల్ చేరుకోవచ్చు. కానీ, ఆటో డ్రైవర్లు రూ.60, రూ.70 వసూలు చేస్తున్నారు.’ అని ఓ ప్రయాణికుడు తెలిపాడు. తెలంగాణలో ఇవాళ్టి నుంచి ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు కూడా నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో ఆటోవాలాల దోపిడికీ మరింత అడ్డు లేకుండా పోతోంది.

తెలంగాణలో 15 రోజులుగా ఆర్టీసీ సమ్మె జరుగుతోంది. ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. మెట్రో సర్వీసులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అదే సమయంలో మెట్రో సర్వీసులు లేని మార్గాలు, ఇతర ప్రాంతాల్లో ప్రజలు ఆటోల మీద ఆధారపడుతున్నారు. దీంతో ఆటో డ్రైవర్లు ప్రయాణికుల నుంచి భారీగా వసూలు చేస్తున్నారు.

కాలువలో పడిన ఆవు.. క్షేమంగా ఇలా బయటకు తీశారు



First published: October 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...